కమల్ హసన్ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

కమల్ హసన్ .


కమల్ హసన్ .
( నవంబర్7, 1954లో తమిళనాడు రాష్ట్రం జిల్లాలోని పరమక్కుడి లోపుట్టారు)భారతదేశపు రామనాథపురంపురంనటుడు. బహుముఖ ప్రజ్ఞగల ఈ నటుడు ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో, అందునాఎక్కువగాతమిళచిత్రాలలో నటించినప్పటికీ భారత దేశ మంతటా సుపరిచితుడు. బాలనటుడిగా తానునటించినమొట్టమొదటిచిత్రానికేజాతీయ పురస్కారం అందుకున్న కమల్ తరువాత జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని మూడు సార్లు పొందాడు.తనఇంట ఇతను నాలుగో సంతానం, ఆఖరి వాడు. కొడుకులందరికి చివరి పదం "హాసన్" అని వచ్చేలా పేరు పెట్టారు ఇతని తండ్రి. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో కమల్ హసన్ తండ్రికి ఉన్న అనుబంధానికి గుర్తు. కమల్ 3 1/2 యేళ్ళ పసి వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం "కలత్తూర్ కన్నమ్మ". బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేసారు. అదే సమయంలో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె.బాలచందర్తో ఆయనకు ఏర్పడిన అనుబంధం తరువాత సుదీర్ఘ గురు-శిష్య సంబంధంగా మారింది. కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందాడు. ఇటీవలి కొన్ని చిత్రాలలో పాటల రచయితగా కూడా పనిచేసారు. భరత నాట్యం ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి. తమిళ చిత్ర రంగంలో తిరుగులేని నటుడిగా ఎదిగారు.
కమల్ తన సినీ జీవితాన్ని కలత్తూర్ కన్నమ్మ అనే చిత్రంలో బాల నటుడిగా ఆరంభించాడు. ఇది ఆయనకి ఉత్తమ బాల నటుడిగా అవార్డ్ తెచ్చిపెట్టిన మొదటి చిత్రం. ఆ తర్వాత కూడా ఎం.జి.రామచంద్రన్,శివాజీ గణేషన్,నాగేష్,జెమినీ గణేష్ వంటి వారు నిర్మించిన చిత్రాలలో బాల నటుడుగా నటించాడు.
70 వ దశాబ్ధంలో కమల్ పూర్తి స్థాయిలో సినిమాల్లో నటించారు. తమిళ చిత్రాలలోనే కాక ఆ నాటి ప్రసిద్ధ మళయాళ దర్శకులు నిర్మించిన మళయాళ చిత్రాలలో కూడా నటించారు. పూర్తి స్థాయి కథా నాయకుడిగా "అవర్‌గళ్", "అవళ్ ఓరు తొడరర్‌కదై", "సొల్ల తాన్ నినైక్కిరేన్", "మాణవన్", "కుమార విజయం" లాంటి చిత్రాలలో నటించినప్పటికీ శ్రీదేవి తో ఆయన నటించిన 16 వయదినిలె (తెలుగులో పదహారేళ్ళ వయసు) చిత్రం 23 ఏళ్ళ వయసులో యువ కథానాయకుడిగా మంచి పేరు తెచ్చింది. కమల్ హాసన్, శ్రీదేవి తెర మీద ప్రసిద్ధ జంటగా మారి సుమారు 23 చిత్రాలు కలిసి నటించారు. 16 వయదినిలె చిత్రం తర్వాత దర్శకుడు కె.బాలచందర్ నిర్మించిన మరో చరిత్ర అనే తెలుగు చిత్రంలో నటించారు.
1970 లో విభిన్న పాత్రలను పోషించారు.
దర్శకుడిగా ఆయన చేపట్టిన మొదటి చిత్రం "శంకర్ లాల్" చిత్రీకరణ జరుగుతుండగా టి.ఎన్.బాలు దుర్మరణం జరిగింది. 1979 లో కమల్ పలు క్లాసిక్, మాస్ చిత్రాలలో నటించి మంచి స్టార్ డమ్ పొందాడు. దీనికి ఎమ్.జీ.అర్/శివాజి వంటి చిత్ర రంగం నుండి తప్పుకోవడం కూడా తోడైంది. (ఎమ్.జీ.ఆర్ చిత్ర రంగం నుండి విరమించుకోగా, 1977 తర్వాత 1990 వరకు శివాజి చిత్రాలకు దూరంగా ఉన్నారు). చిత్ర రంగంలో ఉన్న పోటీని ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికి కమల్ తన చిత్రాలలో విభిన్న కథలతో, పాత్రలతో ముందుకు వచ్చారు.
అంధ వయొలిన్ విద్వాంసునిగా రాజ పార్వయి చిత్రంలో 27 ఏళ్ళవయసులోనటించాడు.(1997లోమరొకయాదృచ్ఛికమైన సంఘటన కారణంగా కమల్ తిరిగి దర్శకత్వం చేపట్టాల్సి వచ్చింది. చాచి 420 (తెలుగులో భామనే సత్యభామనే) చిత్ర దర్శకుడు శంతను షెనొయ్ పనితనం నచ్చక పోవడంతొ కమల్ మళ్ళి దర్శకుడిగా మారారు. అటుపై ఐరోప చిత్ర విధానాలను అనుసరిస్తూ, కమల్ నిజ జీవితానికి దగ్గరైన సహజ హాస్యం పండిస్తూ అనేక చిత్రాలను తీస్తూ వచ్చారు. ఈ చిత్రాల కారణంగా కొంతమంది అభిమానులని నిరాశపరిచినా, నటుడిగా ఎంతో ఎత్తుకి ఎదిగారు.
ఐతే ఎనభైలో మాదిరిగా తొంభైలలో అతని చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు. 1996 లో విడుదలైన "ఇండియన్", "అవ్వై షణ్ముఖి" మాత్రం 200 మిలియన్లు వసూలు చేసి కమల్ ను అగ్రపథంలో నిలిపాయి.
నూతన శతాబ్దంలో కమల్ హసన్ బహుముఖ ప్రతిభ తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక అనేక విభాగాల్లో కూడా కనిపించనారంభించింది. ఈ కాలంలో నటన మాత్రమే కాకుండా ఆయన దర్శకత్వం, రచన, కథా సంవిధానం, సంగీతం మొదలైన విభాగాల్లో తనదైన శైలిని ప్రదర్శించాడు. నటనలో విభిన్న పాత్రలెన్నింటినో తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో పోషించ
2000లో విడుదలైన తెనాలి కమల్ హసన్ చిత్రాల్లో రూ. 30 కోట్లకు పైగా సాధించిన తొలి చిత్రం. 2005లో వచ్చిన వసుల్ రాజా ఎమ్. బి. బి. ఎస్ సుమారు రూ. 40 కోట్లు సాధించగా, 2006 లో వచ్చిన వేట్టైయాడు - విళయాడు రూ. 45 కోట్లు సాధించి తమిళ బాక్సాఫీసుపై కమల్ హసన్ ప్రభావం తగ్గలేదని నిరూపించాయి.
పురస్కారాలుసవరించు
కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని కమల్ హసన్ మూడు పర్యాయాలు గెలుచుకున్నాడు. ఆ చిత్రాలు వరుసగా: మూండ్రంపిరై, నాయకన్ (నాయకుడు), ఇండియన్ (భారతీయుడు). ఈయన ఉత్తమ బాలనటుడిగా కూడా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని కలతూర్ కన్నమ్మ చిత్రానికిగానూ గెలుచుకున్నాడు. ఇవే కాకుండా సాగర సంగమం, స్వాతి ముత్యం చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతి పొందాడు. మరో ప్రతిష్ఠాత్మక ఫిల్మ్ ఫేర్ బహుమతిని ఆయన రికార్డు స్థాయిలో 18 సార్లు సొంతం చేసుకున్నాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. భారత ఉపఖండంలో మరే నటుడు/నటికీ ఈ గౌరవం దక్కలేదు. 1990లో కేంద్ర ప్రభుత్వం కమల్ హసన్ ను పద్మశ్రీ బిరుదంతో గౌరవించింది. 2005లో మద్రాసు లోని సత్యభామవిశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. 2014లో కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో కమల్ హసన్ మొత్తం 171 అవార్డులను సొంతం చేసుకున్నాడు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను కళైమామణి (కళాకారుల్లో మాణిక్యం) బిరుదంతో సత్కరించింది.
కమల్ హసన్ 1981 నుండి రాజ్ కమల్ పతాకంపై సినీ నిర్మాణం ప్రారంభించాడు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం రాజ పార్వై. ఆ తరువాత రాజ్ కమల్ సంస్థ నుండి అపూర్వసహోదరగళ్, దేవర్మగన్, కురుదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్ ప్రెస్ లాంటి మంచి చిత్రాలు రూపొందాయి.
కమల్ హసన్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మరుద నాయగం దశాబ్దంనర పైగా నిర్మాణంలోనే ఉంది. 19వ శతాబ్దపు మదురై నగర వాసియైన స్వతంత్ర పోరాట యోధుడు యూసఫ్ ఖాన్ సాహెబ్ (మొహమ్మద్ యూసఫ్ ఖాన్) గురించిన ఈ చిత్ర నిర్మాణమ్ రెండవ ఎలిజబెత్ రాణి చేతులమీదుగా మొదలయింది.
2005లో కమల్ హసన్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది.
కమల్ హాసన్ వాణి గణపతి అనే ఆమెను వివాహమాడారు. తర్వాత సారికతో తన జీవితాన్ని పంచుకున్నాడు. వీరికి శృతి, అక్షర అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఇప్పుడు సారిక నుండి విడిపోయాడు. మరో ప్రముఖ తెలుగు నటియైన గౌతమితో సహజీవనం సాగిస్తున్నాడు.
వివిధ భాషలలో కమల్ హసన్ ప్రవేశం.
1960 - తమిళ చిత్ర రంగ ప్రవేశం,1962 - మలయాళ చిత్ర రంగ ప్రవేశం
1977 - బెంగాలీ చిత్ర రంగ ప్రవేశం,1977 - కన్నడ చిత్ర రంగ ప్రవేశం
1977 - తెలుగు చిత్ర రంగ ప్రవేశం,1977 - హిందీ చిత్ర రంగ ప్రవేశంముజరిగాయి.

 

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు