మీ జీవితం మరొకరి కల - Lasya

మీ జీవితం మరొకరి కల

ఒక గ్లాసులో సగం నీళ్ళున్నప్పుడు మీరు సగం గ్లాసు ఖాళీగా ఉన్న విషయాన్ని గమనిస్తారా..లేదా అరగ్లాసు నిండుగా ఉందన్న విషయాన్ని గమనిస్తారా? నిజానికి ఈ ప్రశ్నని మీరు ఎన్నోసార్లు వినుంటారు. ఈ ప్రశ్నకి మీ సమాధానమనేది జీవితంపై మీ దృక్పథాన్ని తెలియచేస్తుందని గమనించాలి. పాజిటివ్ థింకింగ్ అనేది జీవితంపై అత్యంత ప్రభావం చూపిస్తుంది.

ఈ మధ్యకాలంలో పాజిటివ్ థింకింగ్ కి ఉన్న ప్రాధాన్యతను చాలామంది గుర్తించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా మనం ఎన్నో సెల్ఫ్ హెల్ప్ బుక్స్ కి థాంక్స్ చెప్పుకోవాలి.

పాజిటివ్ థింకర్ గా ఉండేవారు ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందగలుగుతారని నిపుణులు అంటున్నారు. ఒకానొక స్టడీలో పాజిటివ్ థింకింగ్ కలిగిన వ్యక్తులు అనేక సీరియల్ హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా త్వరగా బయటపడినట్టు తేలింది.

స్టడీస్ ప్రకారం ఆశావాదులు నిరాశావాదులతో పోల్చితే శారీరకంగా అలాగే మానసికంగా ఆరోగ్యకరంగా ఉంటారని తేలింది. ఆశావాదులలో రోగనిరోధక శక్తిలో పెరుగుదల ఇందుకు కారణం కావచ్చు.

పాజిటివ్ థింకింగ్ ను అలవరచుకోవడం ఎలా?

కొన్ని కామన్ స్ట్రాటజీస్ ను వాడి నెగటివ్ థాట్స్ ను గుర్తించి వాటిని పాజిటివ్ థాట్స్ తో రీప్లేస్ చేయాలి. ఐతే, సాధనకు కొంత సమయం పట్టవచ్చు. క్రమేణా, పాజిటివ్ గా ఆలోచించడం సహజంగానే అలవాటు అవుతుంది.

నెగటివ్ సెల్ఫ్ టాక్ ను అవాయిడ్ చేయండి. మీతో మీరు చెప్పుకునే విషయాలనే సెల్ఫ్ టాక్ అనంటారు. మీ సెల్ఫ్ టాక్ అనేవి నెగటివ్ థాట్స్ తో నిండిపోయి ఉంటే వెంటనే వాటిని పాజిటివ్ థాట్స్ తో రీప్లేస్ చేయడం ముఖ్యం. లేదంటే మీ సెల్ఫ్ ఎస్టీమ్ దెబ్బతినే ప్రమాదం తలెత్తుతుంది.

హ్యూమర్ ను ప్రయత్నించండి

నెగటివిటీ నుంచి బయటకు వచ్చే క్రమంలో కొన్ని అలవాట్లను పెంపొందించుకోవలసి వస్తుంది. వీటిలో హ్యూమర్ ను డైలీ రొటీన్ లో భాగం చేసుకోవడం కూడా ముఖ్యం. ఆన్లైన్ లో జోక్స్ చదవడం అలాగే ఇతరులతో సంభాషించేటప్పుడు మాటల్లో కాస్తంత ఆరోగ్యకరమైన హ్యూమర్ ని యాడ్ చేయడం వంటివి మనసును తేలికపరుస్తాయి. కామెడీ షోస్ ను చూడడం వల్ల కూడా మనసు రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.

గ్రాటిట్యూడ్ ను ప్రాక్టీస్ చేయాలి

గ్రాటిట్యూడ్ జర్నల్ ను మెయింటెయిన్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఇందులో మీకు లభించిన బ్లెస్సింగ్స్ జాబితాను పొందుపరచండి. వీటిని రోజోకొక్కసారి చదవడం అలాగే ఎప్పటికప్పుడు కొన్ని కొత్తవాటిని యాడ్ చేయడం వలన మీ లైఫ్ ఎంత హ్యాపీగా ఉందొ మీరు గుర్తించగలుగుతారు.

మీకు తెలుసా మీ జీవితమనేది మరొక్కరి కల అని. ఉదాహరణకు మీరు మంచి ఉద్యోగంలో ఉన్నారు. పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఉద్యోగవేటలో ఉన్నవారికి మీలాంటి జీవితమనేది డ్రీం అని మీరు గుర్తించాలి. ఇలా మనం తరచూ గుర్తించడం మిస్సవుతున్న కొన్ని విషయాలను గుర్తించేందుకు గ్రాటిట్యూడ్ జర్నల్ హెల్ప్ చేస్తుంది.

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు