కాశీ ప్రయాణ కథలు - తల్లి -తండ్రి ప్రత్యక్ష దైవాలు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kaashi Prayana Kathalu - Thalli Thandrulu daivalu

కాశీ ప్రయాణ కథలు - తల్లి -తండ్రి ప్రత్యక్ష దైవాలు

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు. ఈరోజు మనం తల్లి , తండ్రి ఉన్నతమైన స్ధానం గురించి తెలుసుకుందాం అన్న సరస్వతి చెప్పడం ప్రారంభించింది.

మన ఆచారవ్యవహారాలను సంస్కృతి అంటాము ఈసంస్కృతి మన జీవిత నడవడికకు ఎంతో దోహదపడుతుంది. పాఠ్యాంశాలుగాకాని నీతికథలుగా కాని లేక పద్య,శతకాల ద్వారాకానీ బాల్యంనుండే మనకు ఎన్నో నీతిదాయక విషయాలు బోధిస్తారు. తల్లి,తండ్రి,గురువు,దైవం అని పెద్దలు మనకు చెప్పారు.అలా పెద్దలను గౌరవించడం మన సంస్కృతిలోభాగం. మన పూర్వీకులైన ఎందరోఈవిషయం ఆచరించి చూపారు.

మనకు ఈదేహన్ని ప్రసాదించిన కనిపించే దైవం అమ్మ.

కళ్ళముందు నడయాడే దేవతలు నలుగురు అని పూర్వీకులు చెప్పారు.వారినే మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ - అతిధి దేవోభవ అంటూ ప్రస్తుతిస్తాం.

'ప్రతి మనిషి పుట్టుకకే పటట్టుగొమ్మ అమ్మ

ఈ లోకమనే గుడి చేరగా తొలి వాకిలి అమ్మ!'

అమ్మలో సమస్త దేవతలు కకొలువై ఉంటారు అందుకే అమ్మ మాతృదేవత అయింది.

మనవేదం కూడా ' భూమేర్ గరీయసీ మాతా,స్వర్గాదుచ్ఛా తరం పితాః

భూమికంటే తల్లి గొప్పదని,స్వర్గం కంటే తండ్రి గొప్పవాడని ఆర్యోక్తి .ఎంతటి పదవిలో ఉన్నవారైనా పాదాలు తాకి నమస్కరింపబడేది తల్లి.

మనంఈభూమి పైకి రాకముందే అమ్మతొ అనుబంధం ఏర్పడుతుంది. ప్రాణం పోసి తన రక్తమాంసాలను కలిపి జన్మనిచ్చినందుకే అమ్మకి "మాత్రుదేవోభవ"అని పెద్దలు దైవత్వంకలిగించారు. అందుకే తల్లి,తండ్రి,గురువు,దైవం అన్నారు.

నాస్తి మాతృ సమా ఛాయా: నాస్తి మాతృ సమాగతి:

నాస్తి మాతృ సమంత్రాణం నాస్తి మాతృ సమప్రియా!

తల్లిలా చల్లని నీడనిచ్చేమరో తరువేది ఈలోకంలో లేదు అని శాస్త్రాలు చెపుతున్నాయి.ఈలోకంలో చెడు సంతతి ఉంటుందేమో కాని చెడు తల్లి ఉండదని ఆర్యోక్తి.

కుటుంబము లోని సంతానానికి కారకులు తల్లితండ్రులు. వీరిలో స్త్రీని తల్లి, జనని లేదా అమ్మ. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ. . కన్నతల్లి బిడ్డని తొమ్మిది నెలలు గర్భాశయం లో పెంచి,తర్వాత జన్మనిచ్చిన ప్రేమమూర్తి.పాలు త్రాగించి, ఆహారం

తినిపించి, ప్రేమతో పెంచుతుంది. అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదంటే అతిశయోక్తి కాదు. తల్లిని అమ్మ, మాత అని కూడా అంటారు. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది. మనం ఈలోకంలోకి వచ్చాక తొలి సారి వాసన పట్టెది,గుర్తించేది అమ్మనే.తొలిసారి రుచి చూసేది కూడా అమ్మ పాలనే. మననుండి ప్రేమ తప్పఏమి ఆశించని త్యాగమయి అమ్మ.కానిఆ అమ్మకునేడు ప్రేమా అనురాగాలే కరువయ్యాయి.అమ్మ పాలతో అబ్బిన తెలివితేటలు, సంస్కారం,డబ్బుముందు మొకరిల్లాయి.బోసినోటితో కొరికినా నవ్వుతూ బోజ్జనింపిది అమ్మ.

ఈలోకంలో ఐదుగురు తల్లులు ఉన్నారని శాస్త్రం చెపుతుంది.

రాజః పత్ని గురోఃపత్ని భతృ పత్నీ చదైవచ

పత్నిమాతా స్వమాతాచ పంచైతా మాతరః స్మృతాః!!

మహరాజు ధర్మపత్ని,గురుపత్ని,అన్నభార్య,భార్యతల్లి,వీళ్ళంతా తల్లితొ సమానులే.

అమ్మఒడిలో తలపెట్టి సేదతీరిన ఆనందానికి వెలకట్టే షరాబు ఈలోకంలో ఉన్నాడా? అమ్మనాదగ్గరఉంటుంది అనకుండా నేను అమ్మదగ్గరేఉన్నాను అనేవాళ్ళు నేడు ఎందరు? మనం ఎదటి స్త్రీని పిలిచేటప్పుడు అమ్మఅనిపిలుస్తాం.అంటే మరొకరి తల్లినికూడా మన తల్లిగా గౌరవించే గోప్పసంప్రదాయంలోను,స్త్రీని అమ్మవారిగా పూజించే సంసృతిలో పెరిగిన మనం నేడు ఆస్త్రీమూర్తులకు ఎలాగౌరవిస్తున్నామో అందరికి తెలిసందే,తల్లి పాదదాలవద్ద స్గర్గం ఉందని మనం మరువకూడదు.

తండ్రిని దైవంగా భావించమని మన సంప్రదాయం చెపుతుంది.తండ్రి ఇచ్చిన వరం నెరవేర్చడానికి రాముడు అరణ్యలకువెళ్ళాడు.తండ్రి ఆజ్ఞతో తల్లినే సంహరించి తిరిగి తండ్రి అనుగ్రహంతో తల్లిని బ్రతికించుకున్నాడు పరశురాముడు.తండ్రి ఆనందకొరకు ఆజన్మ బ్రహ్మచారిగా మారాడు భీష్ముడు.తండ్రికి తనయవ్వనాన్ని ధారపోసాడు పురూరవుడు.ఎందరో మహనీయులు తమసాహిత్యంలో తండ్రి పాత్రకు సముచిత స్ధానం కలిగించారు.తండ్రి తండ్రి ద్వారానే ఈదేహం ఇహపరాలు సాధించే హితాన్ని విద్యాబుధ్ధులు నేర్వడానికి ఆర్ధిక సామాజిక ఆలంబన ఇస్తాడుకనుక 'పిత్రుదేవోభవ' అన్నారు.

'ఉపాధ్యాయాన్ దశాచార్య. ఆచార్యాణాం శతంపితః'

నూరుగురు ఉపాధ్యాయులకంటే,ఒక ఆచార్యుడు,నూర్గురు ఆచార్యులకంటే తండ్రి అత్యధిక గౌరవము ఉన్నవాడని వేదాలు చెపుతున్నాయి.

'భూమేర్ గరీయసీ మాతా.. స్వర్గాదుచ్చ తరం పితా'

భూమికంటే తల్లిగొప్పదని చెపుతూనే స్వర్గం కన్ని తండ్రి గొప్పవాడని శృతి చెపుతుంది " అన్నది .

మంచి విషయాలు తెలుసుకున్న అందరూ నిద్రకు ఊపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు