కాశీ ప్రయాణ కథలు - అతి సుకుమారి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kaashi Prayana Kathalu - Athi Sukumari

కాశీ ప్రయాణ కథలు - అతి సుకుమారి.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

"సోదరులారా ఈరోజు మీకు నాబాల్యంలో చదివిన బేతాళ కథ వంటి కథ అతి సుకుమారి గురించి చెపుతాను దానికి తగిన సమాధానం మీరే చెప్పాలి అన్న బ్రహ్మయ్య చెప్పడం ప్రారంభించాడు...

పూర్వం అమరావతి రాజ్యాన్ని ధర్మధ్వజుడు అనేరాజు పరిపాలిస్తుండేవాడు. అతను వంశకేతుడు అనేపేరున ప్రసిధ్ధిచెందాడు. అతనికి ధారావళి, ఇందులేఖ,మృగాంగావతి అనే ముగ్గురు భార్యలను ఒకేముహుర్తంలో వివాహం చేసుకున్నాడు.మెదటి భార్య ధారావళితో ఉద్యానవనంలో విహరిస్తూ ఓపూపొద వద్ద సేదతీరసాగారు.అప్పుడు రాజుగారిచేతిలో మల్లేపూవు చేజారి ఆమె ఓడిలో పడింది.దాని బరువుకు ఆమె గిజగిజలాడింది.అదే సమయంలో ఆమె జడలోని పారిజాతపుష్పం లోని తేనె కొరకు ఒ తుమ్మెద పుష్పంపై వాలింది.ఆతుమ్మెద బరువు మోయలేక ధారావళి పక్కకు వొరిగి సృహతప్పింది.

అదిచూసిన ఆమె చెలికత్తెలు సపర్యలు చేసి ఆమెను భద్రంగా రాణివాసం చేర్చారు.పెద్దభార్య సుకుమారత్వం చూసిన ధర్మధ్వజుడు అచ్చెరు వొందాడు.

మరుదినం రాత్రి తన రెండో భార్య అయిన ఇందులేఖ మందిరానికి వెళ్ళిన రాజు ఆమెతో శయ్యపై నిద్రకు ఉపక్రమించాడు.గవాక్షం నుండి పున్నమి చంద్రుని వెన్నెల శయ్యపైఉన్న ఇందులేఖ చేతిపై పడింది.ఆవెన్నెల వెలుగు సోకినంత మేరా శరీరంకందిపోయి బాధతో కేకలు వేసింది.పరుగున వచ్చిన చెలికత్తెలు,చందనం,తులసి రసం ఆమెచేతిపై పూసి ఆకులతో విసిరి సేదతీర్చారు.అదిచూసిన రాజు తనభార్య కోమలత్వానికి ఆశ్చర్యపోయాడు.

మరుదినం మూడో భార్య మృగాంగావతి మందిరానికి వెళ్ళి శయనించబోఏ సమయంలో కోట వెలుపల దూరంగా ఎవరో జొన్నలు దంచుతున్న శబ్ధం వినిపించింది.ఆశబ్ధానికే చేతివేళ్లు కందిపోయి బాధతో విలవిల లాడింది మృగాంగావతి.అదిచూసిన చెలికత్తెలు మందిర ద్వారాలు మూసి ఆమె చెవులలో దూది ఉంచారు.అది చూసిన రాజు తనమూడో భార్య

సుకుమారత్వనికి అమితంగా ఆశ్చర్యపోయాడు " .

"తుమ్మెద బరువుకే సోలిపోయిన మెదటిభార్య , వెన్నెలవెలుగు సోకి కందిపోయిన రెండో భార్య,ఎక్కడో దూరాన దంచుతున్న శబ్ధానికే చేతివేళ్లు ఎరుపెక్కిన ముడవ భార్య ఈముగ్గురిలో ఎవరు గొప్ప సుకుమారి " అన్నాడు బ్రహ్మయ్య .

"అన్నగారు ఇందులేఖ,ధారావళి స్మర్శ కలిగిన తరువాత బాధ అనుభవించారు.కాని సర్శ లేకుండానే దూరంగా వినిపించిన శబ్ధానికే మృగాంగవతి వేళ్లు కందిపోయాయి...కనుక ఆమే అతి సుకుమారి " అన్నాడు శివయ్య.

కథ ముగియడంతో అంతా నిద్రకు ఉపక్రమించారు,

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్