అలనాటి నటి లలిత. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

అలనాటి నటి లలిత.
అలనాటి నటి లలిత.
లలిత .భారతీయ సినిమానటి, నర్తకి. ఈమె ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో మొదటి సోదరీమణి.
 
ఈమె 1930, డిసెంబరు 12న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె 1938లో అదిథన్ కనవు అనే తమిళ చిత్రంద్వరా సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెళ్లు పద్మిని, రాగిణులు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఈమె తన సోదరీమణులకంటే ముందుగా సినిమా రంగంలో ప్రవేశించింది. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించి వ్యాంపు పాత్రలలో ఎక్కువ పేరు సంపాదించింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె 1983లో మృతి చెందింది.
లలిత నటించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:
విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1943 పతిభక్తి
పి.ఎస్.శ్రీనివాసరావు, దాసరి సుబధ్ర పి.ఎస్.శ్రీనివాసరావు
1950 బీదలపాట్లు
చిత్తూరు నాగయ్య, పద్మిని
కె.రామనాథ్
1951 పెళ్లికూతురు
ఎన్.ఎస్.కృష్ణన్, పద్మిని ఎన్.ఎస్.కృష్ణన్
1952 కాంచన
కె.ఆర్.రామస్వామి, పద్మిని, ఎం.ఆర్.సంతానలక్ష్మి ఎస్.ఎమ్.శ్రీరాములు
1952 సింగారి
టి.ఆర్.రామచంద్రన్, పద్మిని, రాగిణి
1953 అమ్మలక్కలు
ఎన్.టి.రామారావు,పద్మిని,బి.ఆర్.పంతులు
డి.యోగానంద్
 
1953 ఒక తల్లి పిల్లలు
శ్రీరాం, టి.ఎస్.దొరైరాజ్, పద్మిని, పి.శాంతకుమారి ఎ.ఎస్.ఎ. స్వామి
1953 దేవదాసు
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి
వేదాంతం రాఘవయ్య
 
1955 అంతా ఇంతే
శివాజీ గణేశన్, పద్మిని, రాగిణి
ఆర్.ఎం.కృష్ణస్వామి
1955 విజయగౌరి
ఎన్.టి. రామారావు,పద్మిని,రాగిణి డి.యోగానంద్
1960 శివగంగ వీరులు
ఎస్.వరలక్ష్మి,కమలా లక్ష్మణ్, ఎం.ఎన్.రాజం
1961 విప్లవ స్త్రీ
ఆనందన్, ఎం.ఆర్.రాధా,పండరీబాయి
ఎం.ఎ.తిరుముగం
 

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
భారతీయ ప్రాచీన విషిష్ట ప్రదేశాలు.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు