ఇది నిజమా ???. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

ఇది నిజమా ???.

ఇది నిజమా ?
మహాభారతయుధ్ధంలో పదమూడవరోజున ద్రోణుడు పద్మవ్యూహాన్ని పన్నాడు పద్మవ్యూహంలో ప్రవేసించిన అభిమన్యుడు ద్రోణుని , కృపుడు,అశ్వత్ధామ,కృతవర్మ కర్ణ శల్య దుర్యోధన దుశ్శాసనులను నిలువరించి పోరాడుతున్న అభిమన్యుని పరాక్రమ ధాటికి ఎందరో రాజులు మరణించారు. సుయోధనుడు మొదలగు వారు పారిపోయారు పారిపోయిన సుయోధనుడు అశ్వత్థామ, కృప, కర్ణ, కృతవర్మ, బృహద్బలుడు, శకుని మొదలగు వారిని కూడగట్టుకుని అభిమన్యుని ఎదుర్కొన్నాడు. అభిమన్యుడు మేఘఘర్జన చేసి పిడుగు వలె వారి మీద పడ్డాడు.ఆసమయంలో ఉరుము లేని మెరుపులా సుయోధనుని కుమారుడు లక్ష్మణకుమారుడు అభిమన్యుని ఎదుర్కొని నిరంతర శర ప్రయోగం చేసాడు. తన కుమారుని విడువలేని సుయోధనుడు మదనపడసాగాడు.
అభిమన్యునితో పోరుచేస్తున్నాడు. అభిమన్యుడు లక్ష్మణకుమారుని మీద బాణములు గుప్పించాడు. ఇరువురి నడుమఅమోఘమైన పోరు జరిగింది . అభిమన్యుడు ఒక దివ్యాస్త్రంతో లక్ష్మణకుమారుని తల తెగవేసాడు. తన కుమారుని మరణం కళ్ళారా చూసిన సుయోధనుడు మిక్కుటమైన కోపంతో ఊగిపోతూ అభిమన్యుని కొట్టండి, నరకండి, చంపండిఅనిఆక్రోశించాడు. కృతవర్మ, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ, కర్ణుడుబృహద్బలుడు అత్యంత ప్రభావం కల శరములు అభిమన్యునిపై వేసారు, అనంతరం కౌరవుల కుట్రకు అభిమన్యుడు వీరమరణం పొందాడు.
ఇక్కడ మనకు లక్ష్మణకుమారుడు పోరాటయోధుడుగా అభిమన్యుని సమంగా పోరాడి వీరమరణం పొందాడు. ఇది నిజం. పిరికివారు యుధ్ధ రంగంలోనికిరారు వచ్చినా మహావీరులతో తలపడరు. యుధ్ధరంగంలో అభిమన్యునితో తలపడగలిగిన లక్ష్మణకుమారుని పాత్ర మనతెలుగు సినిమాలలో ( మాయబజార్ -పాండవవనవాసం) వంటివాటిలో వక్రీకరించబడింది.లక్ష్మణకుమారుడు ముమ్మాటికి యోధుడే అతని చరిత్రలో అబధ్ధపు ప్రచారం జరిగింది.
ఉత్తర కుమారుడు : దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాసం భగ్నం చేయాలని సుశర్మను మత్స్యదేశం దక్షణ భాగాన దాడిచేసి వారి పసు సంపదను హరించమని పంపుతాడు, అప్పుడు సుశర్మను ఎదుర్కొనేందుకు విరాటుడు తనసైన్యంతో వెళతాడు ఆసమయంలో మనందరం ఉత్తరగోగ్రహణం చేద్దాం అంటాడు. అప్పుడు ఉత్తర గోగ్రణాన్ని అడ్డుకొవడానికి ఉత్తరకుమారుడు బృహన్నలను సారధిగా చేసుకొని యుధ్ధరంగానికి వెళతాడు. అపారమైన కౌరవ సేనను,కర్ణుడు,భీష్ముడు, దుర్యోధనుడు,అశ్వత్ధమ వంటివీరులను చూసి ఉత్తరకుమారుడు తటపటాయించగా బృహన్నల వేషంలోని అర్జునుడు ఉత్తరకుమారుని సారధిగా చేసుకుని కౌరవులను తరిమాడు.ఇది అసలుకథ 'నర్తనశాల ' సినిమాలో మహావీరుడు అయిన కీచకుని మేనల్లుడు, సుదేష్ణ విరాటుల పుత్రిక ఉత్తర ఈమె అభిమన్యుని వివాహంచేసుకుంది. పుత్రుడు ఉత్తర కుమారుని పాత్ర హాస్యనటునితో వక్రీకరించబడింది. కేకయుడు అనే మహారాజుకు ఇద్దరు భార్యలు అందులో 'మాశవి ' అనేభార్యకు జన్మించినవాడు 'కీచకుడు' రెండోభార్యకు జన్మించినది సుధేష్ణ .ఈమె విరాటుని వివాహం చేసుకుంటుంది విరాటుని ప్రధమ పత్ని ' శ్వేత ' కోసల దేశపు రాజ పుత్రిక ఈమెమరణంతో విరాటుడు సుధేష్ణను చేపట్టాడు. ఉత్తర కుమారుని కుమార్తె ఇరావతిని పరీక్షిత్తు నకు వివాహము చేసాడు.
కురుక్షేత్ర సంగ్రామంలో ఉత్తరుడు పాండవుల పక్షాన యుద్ధం చేసి మొదటి రోజే శల్యుని చేతిలో మరణించాడు ఇది ఉత్తరకుమారునిచరిత్ర.
ఇలా పలు సినిమాలలో వక్రీకరణ మనం చుసాము.మరో ఉదాహరణ.నవ నందుల గురించి తెలుసుకుందాం!
నందులు : వారిని "నవ నందులు" అని సంభోధిస్తారు అనగా 9 మంది నంద రాజకుమారులు అని అర్ధము వీరు ఒక్కోక్క ప్రాంతములో రాజ్యపరిపాలన కొనసాగించేవాళ్ళు క్షత్రీయులకన్న మిన్నగా నంద రాజ వంశీయులు రాజ్య పరిపాలన చేయగలం అని నిరూపించారు.
నంద రాజకుమారులు .
● పందుక నంద(PANDUKA NANDA)
● పందుగతి నంద(PANDUGATI NANDA)
● భుతపాల నంద(BHUTAPALA NANDA)
● రాస్త్రపాల నంద(RASHTRAPALA NANDA)
● గోవిష్ణక నంద(GOVISHANAKA NANDA)
● దశసిద్ధక నంద(DASHASIDDHAKA NANDA)
● కైవర్త నంద(KAIVARTA NANDA)
● మహేంద్ర నంద(MAHENDRA NANDA)
● ధననంద(DHANANANDA) నవ నందులలో చివరివాడు. అఖీల భారతదేశాన్ని ఏకచత్రాధిపతిగా పాలించిన మహాపద్మనంద చనిపోయె నాటికి ఆయన వయస్సు 88 సంవత్సరములు.
దేశంకోసం సర్వశ్వంఒడ్డి పోరాడి వీరమరణం పోందిన మనజాతిరత్నాలు ఎందరో! పైన ఉదాహరించిన వీరులను ' చాణిక్య చంద్రగుప్త ' - ' శ్రీమద్ విరాటపర్వం ' వంటి చిత్రలలో ఎలా చూపించారు మీకు తెలిసినదే ఇక్కడ మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే మన చరిత్రను మనమే మార్చిచూపించడం భావితరాలకు మనం తప్పుడు సందేశం ఇచ్చినవారలం అవుతాము. విద్యరూపంలో, రాతల్లోకానివ్వండి, ప్రదర్శనలో కానివ్వండి ఏరూపిణా అయినా చరిత్రవక్రీకరణ ముమ్మాటికి తప్పే !!!.