పూరి జగన్నాధ రథ యాత్ర . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

పూరి జగన్నాధ రథ యాత్ర .


పూరి జగన్నాధ రథయాత్ర.
రథయాత్రకు రెండు రోజులు ముందుగా అమావాస్య నాడు, నూతన దేవతామూర్తుల నేత్రోత్సవం జరుగుతుంది. యథావిధిగా పూజలు మొదలవుతాయి. మరుసటి రోజు ప్రజలకు నవయవ్వన దర్శనం (జులై 17) లభిస్తుంది. ఆషాఢ శుక్ల విదియనాడు పాండాలు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి 'మనిమా' (జగన్నాథా...) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తూ విగ్రహాల్ని కదిలిస్తారు. ఆనందబజారు, అరుణస్తంభం మీదుగా అత్యంత కోలాహల వాతావరణంలో ఊరేగిస్తూ రథం వెనక భాగం నుంచి తీసుకువచ్చి రత్నపీఠం మీద అలంకరింపజేస్తారు. ఈ ఉత్సవాన్ని 'పహండీ' అంటారు. ఆ దశలో కులమత భేదాలకు తావుండదు. గుండిచా ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమైన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై ఉండగా... 'ఇలపై నడిచే విష్ణువు'గా గౌరవాభిమానాల్ని అందుకునే పూరీ రాజు పల్లకీలో అక్కడికి చేరుకోవడంతో సంరంభాలు మిన్నంటుతాయి. పరమాత్ముని ముందు సేవకుడిగా మారిన ఆ మహారాజు బంగారపు చీపురుతో రథాల లోపల ఊడుస్తాడు. దీన్నే 'చెరా పహారా' అంటారు.
రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేదపండితులు శాంతి నిర్వహించాక.... జాగ్రత్తగా నరికి 1,072 కాండాలను పూరీకి తరలిస్తారు. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప అవసరం. ప్రధాన పూజారి నేతృత్వంలోని శిల్పుల బృందం అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది. ముందు వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం, 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం, 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు. జగన్నాథుడి రథం నందిఘోష. ఎత్తు సుమారు 46 అడుగులు, పదహారు చక్రాలుంటాయి. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు. సారథి పేరు దారుక. బలభద్రుడి రథం తాళధ్వజం. సుభద్రాదేవి రథం దేవదళన్‌. నిర్మాణం పూర్తయ్యాక రథాల్ని యాత్రకు ఒకరోజు ముందుగా...ఆలయ తూర్పు భాగంలోని సింహ ద్వారం దగ్గర నిలబెడతారు. లాగేందుకు అనువుగా ఒక్కో రథానికీ 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉన్న తాళ్లను కడతారు.
ఘోషయాత్ర.
రథానికున్న తాళ్లను లాగడంతో ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర ఆ సమయంలో స్వామిని 'పతితపావనుడు' అంటారు. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న లక్షలాది భక్తులు ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు దూకుతారు. మిన్నుముట్టే జయజయధ్వానాల మధ్య రథాలు భారంగా కదులుతాయి. సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. గుండిచా వనానికి చేరుకున్నాక, ఆ రాత్రి ఆలయం బయట రథాల్లోనే మూలవిరాట్టులకు విశ్రాంతినిస్తారు. మర్నాడు పొద్దున మేళతాళాలతో గుడిలోపలికి తీసుకువెళతారు. స్వామి అక్కడ ఏడురోజుల పాటూ ఉంటాడు. ఐదోరోజున ఓ ఆసక్తికరమైన విశేషం జరుగుతుంది. ఆలయంలోకి తనతోపాటూ తీసుకెళ్లలేదని స్వామిపై అలిగిన లక్ష్మీదేవి, గుండిచా గుడి బయటి నుంచే జగన్నాథుడిని ఓరకంట దర్శించి.. పట్టలేని కోపంతో స్వామి రథాన్ని కొంతమేర ధ్వంసం చేసి వెనక్కి వెళ్లిపోతుంది. ఈ ముచ్చట అంతా అమ్మవారి పేరిట పూజారులే జరిపిస్తారు. ఆ రోజును 'హీరాపంచమి' అంటారు. వారంపాటూ గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన సుభద్ర, జగన్నాథ, బలభద్రులు దశమినాడు తిరుగు ప్రయాణం చేస్తారు. దీన్ని 'బహుదాయాత్ర' అంటారు . జగన్నాథుడు మాత్రం దారిలో 'అర్థాసని' ('మౌసీ మా'గా ప్రసిద్ధి) గుడి దగ్గర ఆగి తియ్యటి ప్రసాదాల్ని ఆరగిస్తాడు. మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకుంటాయి. తరువాత రోజు, ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో (సునాబెష) అలంకరించి దర్శనానికి అనుమతిస్తారు ఆ దృశ్యం అద్వితీయం. ద్వాదశినాడు మళ్లీ విగ్రహాలను రత్నసింహాసనంపై ప్రతిష్ఠించడంతో రథయాత్ర పూర్తవుతుంది. స్వామిలేక చిన్నబోయిన పూరీ, జగన్నాథుడి రాకతో కొత్తకళ సంతరించుకుంటుంది.
పద్యము.
"త్వయి సుప్తే జగన్నాథ! జగత్సుపం భవేదిదం 1
విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్యం స చరాచరమ్" 2
తాత్పర్యము.
ఓ జగన్నాథ..! జగమును పాలించే విష్ణు భగవానుడా! అంటూ పై శ్లోకముతో శ్రీహరిని స్తుతించి, ప్రతి నిత్యం తమకు వీలైన నైవేద్యంతో పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు.ప్రతి సంవత్సరం జూలై నెలలో పూరీలో జగన్నాథ రథయాత్ర ప్రారంభం మవుతుంది.
విశ్వాసం.
• పూరీలో 12 రోజుల పాటు జరిగే జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథయాత్ర సమయంలో ఆ యాత్రలో పాల్గొనే భక్తులు గానీ, లేదా పూరీకి వెళ్లలేని భక్తులు తమ గృహమందే ప్రతి నిత్యం విష్ణుమూర్తినిపై మంత్రముతో కొలిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.
• రథయాత్ర జరిగే 12 రోజులు, లేదా 7, 9 రోజుల పాటు ఒంటి పూట భోజనం చేసి, శుచిగా స్వామివారిని స్తుతిస్తే సకలసంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. అలాగే రథయాత్ర జరిగే 12 రోజుల్లో మీకు అనుకూలించే 3, 5, 7, 9 రోజుల్లో.. ప్రతినిత్యం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో సమీపంలోని నారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని నేతితో రెండు దీపాలు వెలిగిస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
• ఇంకా నేతితో ప్రతిరోజూ దీపమెలిగించి చివరి రోజు స్వామివారికి అర్చన చేసి, ఐదుగురికి లేదా తొమ్మిది మందికి పసుపు, కుంకుమ, చక్కెర పొంగలిని దానం చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి, సుఖసంతోషాలు చేకూరుతాయి.
ఒకానొకప్పుడు ఈ ప్రదేశాన్ని సందర్శించటానికి ప్రజలు తండోపతండాలుగా కొన్ని వందల మైళ్ళ నుండి అనేక వ్యయ ప్రయాసలకోర్చి కూడా దుర్గమ పర్వతారణ్యాలను, పొంగి పారే నదుల్ని దాటుకుంటూ ఉత్సాహంగా వచ్చేవారు యాత్రాగమనాభిలాషులయి వస్తుండేవారు. కాని ఇప్పుడా శ్రమేం అక్కరలేదు. దేశంలో అతి పవిత్రస్థలాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. అనేక పురాణాల్లో పుస్తకాల్లో మత గ్రంథాల్లో ఈ దేవాలయం యొక్క, ఇందున్న శ్రీ జగన్నాధస్వామి మహత్యాన్ని గురించి ప్రశంసిస్తూ ఉంటాయి. శ్రీ జగన్నాధునికి తోడుగా ఈ ఆలయంలో స్వామివారికి అన్నగారైన బలరాముడు చెల్లెలు సుభద్ర విగ్రహాలు ఈ బ్రహ్మండమైన దేవాలయంలో ప్రతిష్ఠించబడినవి. ఎత్తు సుమారు 214 అంగులాలు ఉంటుంది దీనికి మొదట 8వ శతాబ్దం చివరన ఏలిన గంగా వంశపు రాజు రెండవ మహాశివ గుప్త యయాతి కట్టించాడని ప్రతీతి. కాని కొంతమంది చరిత్ర కారుల నిర్ణయం ప్రకారం 12వ శతాబ్దంలో ఇదే వంశావళికి చెందిన చోడ గంగదేవ నిర్మించాడని చెప్పుకొంటారు. మొత్తం మీద ఈ దేవాలయ నిర్మాణం ఎలా జరిగింది అనే దానికి ఒక కథ ప్రచారంలో ఉంది. శ్రీ జగన్నాథ స్వామి రథ యాత్ర వీడియో ఇందు ఆలయం ప్రతిష్ఠించబడిన విగ్రహాలు అంతకు ముందు నుండే ఉన్నాయి ఎప్పటివో మొట్టమొదట ఈ ఆలయ నిర్మాణం ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించాడని అంటారు. ఆయనకు స్వామివారి ఉనికి నిస్పష్టంగా ఎక్కడో ఉన్నట్లు అనిపించడం మొదలు పెట్టింది. అక్కడ దగ్గరలోనే ఎక్కడో నివాసం ఏర్పరుచుకుని ఉంటాడనే భావంతో కనుక్కోవటానికి కొంతమందిని వినియోగించాడు. వారిలో ఒకరు విద్యాపతి అనే యువ బ్రాహ్మణుడు. ఆయన అన్వేషణలో కొన్నాళ్ళు ఒక తెగకు రాజైన విశ్వావసు వద్ద అడవిలో అతిధిగా ఉన్నాడు. విశ్వావసుకు లలిత అనే అందమైన కుమార్తె ఉంది. విద్యాపతీ, లలిత ప్రేమించుకుని దగ్గరయ్యారు. ఫలితంగా వారిద్దరికి వివాహం కూడా అయింది. కొంత కాలానికి విశ్వావసు రహస్యంగా ఒక దేవుని ఆరాధించే విశేషం కనుగొన్నాడు విద్యాపతి. భార్య లలిత ద్వారా ఆ గుహను కనుక్కోగలిగి అక్కడికి చేరాడు. విద్యాపతి ఆ గుహలోచేరి భగవానుని చూసేటప్పటికి ఇన్నేళ్ళ తన అన్వేషణ ఫలించినట్లు, ఆ దేవదేవుని అక్కడే కనుగొన్నట్లుగా అతనికి స్పురించింది. తన అన్వేషణ పూర్తయింది. ఒకానొక రోజు ఆ మూర్తిని దొంగిలించి పరారయి పూరీ చేరాడు.
తరువాత ఇది రాజాజ్ఞ ప్రకారం జరిగిందని ఇంద్రద్యుమ్న మహారాజే విశ్వావసునికి క్షమాపణ చెప్పుకున్నాడు. మూర్తిని అతను కట్టించిన ఆలయంలో ప్రతిష్ఠించటానికి విశ్వావసు కూడా వొప్పుకొన్నాడు. కాని స్వామి స్వప్నంలో కనిపించి తన మూర్తి వేరు విధంగా కొయ్యలో మలచమని ఆనతిచ్చాడు. విగ్రహాన్ని మలచటానికి ఒక వృద్ధమూర్తి తనంత తానుగా రాజ సమ్ముఖానికి వచ్చాడు. కలలో స్వామివారు సెలవిచ్చిన శిల్పరూపం ఆయనలో చూచి రాజు వొప్పుకున్నాడు. అయితే ఒక షరతు పెట్టాడు వృద్ధమూర్తి ఒక గది తలుపులు మూసి తను తెరువమనేంతవరుకు తెరిచి చూడకూడదనే నియమం విధించాడు శిల్పి. అందుకు వొప్పుకున్నారు.
కొన్నాళ్ళ తరువాత ఇంద్రద్యుమ్న మహారాజు గారి పట్టమహిషి రాణి గుండీచ ఓర్పు వహించలేక పోయింది. అసలు ఈ ముసలాయన ఏం చేస్తున్నాడు. ఎలా వున్నాడు చూడాలనే ఉత్కంఠ ఆమెను నిలవనీయలేదు. పర్యవసానంగా ఆమె తటాలున తలుపు తీసింది. శిల్పి అదృశ్యుడయ్యాడు. అసంపూర్తిగా వదిలివేసిన విగ్రహాలు అక్కడ ఉన్నాయి ప్రస్తుతం ఆలయంలో మనకు కనిపించే విగ్రహ నమూనాలు అవే:
అయితే దీనిని గురించి, వీని ప్రభావం గురించి అనేక రకాలయిన కథలున్నాయి. ఆ సంగతి యాత్రికులు స్వయంగా విని ఆనందించే భాగ్యం వారికే వదిలివేస్తున్నాం.
ఆగమ, జ్యోతిష, గ్రహగతుల లెక్కల ప్రకారం ఈ మూర్తులను ఖననంచేసి అలాంటివే కొత్తవి వాటిస్థానే చేర్చటం జరుగుతుంది. అయితే జగన్నాధుని నాభిపద్మం మాత్రం పాతవాటి నుండి కొత్త విగ్రహాలకు మార్చబడుతుంది కాని తీసి వేయటం జరుగదు. మరి అందులోని మహత్యం ఏమిటి? రహస్యం కొంతమంది చరిత్రకారుల వూహలు, ఆలోచనల ప్రకారం ఆ నాభి పద్మంలో బుద్ధుని దంతం ఉందని చెప్తారు. కాని ఒక రకంగా చూస్తే శ్రీ జగన్నాధుడంటే దశావతారల్లోని కృష్ణుని ఆవతారమునకు మూల కారణమైన శ్రీ మహావిష్ణువే కదా జగాలన్నిటికీ నాధుడు గనుక శ్రీ జగన్నాధుడుగా పేరు సార్థకంగా ఉంటుంది కూడా.
అయితే ఇది హిందువులకు కుల విచక్షణ లేకుండా దర్శనీయం. ఇతర మతస్థులు విదేశీయులను లోనికి రానీయరు. అటువంటివారు దగ్గరనే వున్న రఘునందన లైబ్రరీ భవనాలపై నుండి ఆలయమును చూడవచ్చు, ఆలయమంతా కనబడుతుంది.
'ఆలయ నిర్మాణ విశేషాలు':
ఆలయం చతురస్రంగా ఉంది. ఒక్కొక్క భుజము సుమారు 200మీ. ఉంటుంది. చుట్టూ ఉన్న ప్రహరీ గోడలు ఆరు మీటర్లు ఎత్తుంటాయి ఈ విధంగా రెండు గోడలు ప్రహరీలుగా ఉన్నాయి. శంఖాకారంగా ఉన్న ఆలయ గోపురం గగన చుంబితంగా 58మీ. ఎత్తుంటుంది. ఆ గోపురం మీద ఒక జండా ఉంటుంది. జండామీద సుదర్శన చక్రం ఉంటుంది. ఇది కొన్నిమైళ్ళ దూరం పర్యంతం కానవస్తూ పూరీకి యాత్రికులను ఆహ్వానిస్తూన్నట్లుంటుంది. సింహద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది. ప్రధాన ద్వారం అక్షరాల సింహద్వారం-ద్వారానికి రెండు ప్రక్కల రెండు రాతి సింహాలున్నాయి. అవి ద్వార పాలకులులా భావించబడుతున్నాయి. కాని మధ్యలో చిన్న విగ్రహంగా అమరిఉన్న సుభద్రమూర్తికి మాత్రం హస్తాలు ఉండవు. ఇది ఆ అసంపూర్తిగా వదిలివేసిన దానికి తార్కాణంగా భావించవచ్చు. ఈ మూర్తులు ఆయా పరవడి దినాలలో విశేషాలంకారాలతో, ఎప్పుడూ వాడని పూలదండలతో అలంకరించబడి సాక్షాత్కరిస్తూ కనబడతాయి. ఈ ఆలయం నిర్వాహణంలో 20,000 వేల మంది తమ జీవనభృతిని పొందుతున్నారట. ఆలయ నిర్వాహకులను, 36 శ్రేణులుగా విభజించి 97 తరగతులుగా విభజించబడింది. రథయాత్ర:
పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాల విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగ పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందుప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి.
పూరి జగన్నాధుని రథయాత్ర లోక ప్రసిద్ధం ఈ ఉత్సవం ఆషాఢ మాసంలో జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కొన్ని లక్షల మంది యాత్రికులు వస్తారు. చాల విశేషంగా జరుగుతోంది. హిందూ దేశంలో జరిగే గొప్ప కమనీయమైన ఉత్సవాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ రథయాత్ర శ్రీకృష్ణ భగవానుడు గోకులం నుండి మధుర యాత్రగ పరిగణించబడుతుంది. ఆలయంలో బలభద్ర, జగన్నాధ, సుభద్రల విగ్రహాలను తెచ్చి ఈ రథమునందుప్రతిష్ఠించి రథయాత్ర జరుపుతారు. ఆలయం ముందు నుంచి మొదలయిన ఈ రథయాత్ర ఒక కిలో మీటరు దూరంలో ఉన్న గుండీచ మందిరం వరకు సాగుతుంది. ఈ జగన్నాధాలయంలోనే అనేక మందిరాలున్నాయి.
ఇక్కడే పంచ తీర్థాలున్నాయి. ఆలయంలోనే బడేకృష్ణ, రోహిణి తీర్ధాలు అమరి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలోనే మార్కండేయ తీర్థం ఉంది. సుమారు అరకిలో మీటరుంటుంది. మహారధి అనబడే స్వర్గద్వార్ సముద్ర తీరంలో ఉంది. ఇంద్రద్యుమ్న తీర్థం, వీటికితోడు నరేంద్ర తీర్థము అనే స్వచ్ఛ జలాలతో అలరారి యున్నవి. దీనిలో తప్పకుండా స్నానం చేస్తే మంచిది.
 

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Athi Sukumari
కాశీ ప్రయాణ కథలు - అతి సుకుమారి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.