జీవిత ప్రవాహాని ఎడురీడినైద్దరు మహిళల నిజమైన గాధ..!! - కుమార్.కూనపరాజు.

జీవిత ప్రవాహాని ఎడురీడినైద్దరు మహిళల  నిజమైన గాధ..!!

జీవిత ప్రవాహాన్ని ఎదురీదిన ఇద్దరు మహిళల నిజమైన గాధ.....!!

చాలారోజుల క్రితం fb లో ఓ ప్రకటన చూసాను. "అనాచ్ఛాదిత కథ" నవల ఆవిష్కరణ సభ గురించి. డిజైన్ చేసింది, బంగారు బ్రహ్మం. ఆయన కవర్ డిజైన్లు బాగుంటాయి. కేవలం ఈ అందమైన కవర్ కోసం ఆ సభకు వెళ్ళాను. ఈ సభలో రచయిత్రి తప్ప చాలా మంది తెలుసు. పుస్తకం కొన్నా ఎక్కడో కలిసి పోయింది. కానీ నెలరోజులు ముందే ఝాన్సీ గారు ఏదో పనిమీద ఫోన్ చేశారు. ఆవిడ fb స్నేహితురాలే. ఇప్పుడు మరల పునః పరిచయం. ఆవిడ రాసిన మూడు పుస్తకాల trilogy పంపించారు. మొదటి పుస్తకం ఈ 'అనచ్చాదిత కథ '. గ్రామం లోని అత్యంత కష్ట పరిస్థితుల నుండి బయిట పడి కొత్త జీవితాన్ని నిర్మించుకున్న సాహస వనిత 'నళిని'. డబ్బు, ఇల్లు, పిల్లల చదువు, వీటిని సాధించ కలిగింది కానీ కుటుంబం తోటి మనుషుల ఈర్ష్య ద్వేషాలు అగ్ని సెగలై కాల్చి వేసాయి. ఈమె కూతురే 'జానకి'. మంచి తనం, చదువు ఈమె ఆభరణాలు. విధి వ్రాతకు సమాజ ఈర్ష్య కు బలైయ్యింది. అయినా నిలబడింది. వీరిద్దరి వీరిచిత గాధ.. ఈ నవల. ఆపకుండా చదివించే గుణం బాగావుంది. 90 శాతం నిజజీవిత ఘటనలే ఈ నవలకు ప్రేరకాలు అని రచయిత్రి అంటున్నారు. జరుగుతున్న నిజాన్ని చెప్పగలగడం గొప్ప విషయమే. ఈ నవలను తప్పక చదవండి. జీవిత అనుభూతులను పొందండి.

---------------------------------------------------------------------
ఈ పుస్తకం కోసం, పాలపిట్ట బుక్స్, (హైదరాబాద్) ను సంప్రదించండి. ఫోన్ : 040 27678430
---------------------------------------------------------------------

మరిన్ని వ్యాసాలు

నయనాల నీలాలలో నిదుర.
నయనాల నీలాలలో నిదుర.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు.
Kaashi Prayana Kathalu - Anthima Pariksha
కాశీ ప్రయాణ కథలు - అంతిమ పరిక్ష
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
పల్నాటి యుధ్ధం.
పల్నాటి యుధ్ధం.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
కాటమ రాజు కథ.
కాటమ రాజు కథ.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Bhuvi nundi diviki
భువినుండి దివికి
- తాళ్ళూరి చంద్రశేఖర్
లాక్డౌన్ స్మృతులు
లాక్డౌన్ స్మృతులు
- మండా. సూర్యనారాయణ
Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు