దర్శక నిర్మాత. సాగర్ . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

దర్శక నిర్మాత. సాగర్ .

రామానంద్ సాగర్ . మనకీర్తి శిఖరాలు .

(29 డిసెంబర్ 1917 – 12 డిసెంబర్ 2000) (జన్మనామం చంద్రమౌళి చోప్రా) ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు. దూరదర్శన్‌లో ప్రసారమై విశేష జనాదరణ పొందిన ధారావాహిక "రామాయణ్"ను ఇతడు నిర్మించాడు. 78 భాగాల ఈ టెలివిజన్ ధారావాహిక భారతీయ పురాతన ఇతిహాసం రామాయణం ఆధారంగా తీయబడింది. ఈ సీరియల్‌లో రామునిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికాలియా నటించారు. భారత ప్రభుత్వం ఇతడిని 2000వ సంవత్సరంలో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

రామానంద్ సాగర్ లాహోర్ సమీపంలోని అసల్ గురు గ్రామంలో జన్మించాడు. ఇతడి ముత్తాత లాలా శంకర్ దాస్ చోప్రా కాశ్మీర్‌కు వలస వెళ్ళాడు. ఇతని అమ్మమ్మకు మగ సంతానం లేనందువల్ల ఇతడిని దత్తత తీసుకుంది. ఆ కారణంగా ఇతని పేరు చంద్రమౌళి చోప్రా నుండి రామానంద్ సాగర్‌గా మార్చబడింది. ఇతని తల్లి మరణానంతరం ఇతని తండ్రి మరో పెళ్ళి చేసుకున్నాడు. విదు వినోద్ చోప్రా ఇతని సవతి తల్లి కుమారుడు. రామానంద్ సాగర్ పగటిపూట ప్యూన్‌గా, ట్రక్కు క్లీనర్‌గా, కంసాలి వద్ద సహాయకుడిగా పలు పనులు చేస్తూ రాత్రి పూట డిగ్రీ చదువుకున్నాడు.

1942లో ఇతడు పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి సంస్కృతం, పర్షియన్ భాషలలో బంగారు పతకాలను పొందాడు. డైలీ మిలాప్ అనే పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు రామానంద్ చోప్రా, రామానంద్ బేడీ, రామానంద్ కాశ్మీరీ అనే కలం పేర్లతో ఎన్నో కథలు, నవలలు, కవితలు, నాటికలు రచించాడు. 1942లో క్షయ వ్యాధి సంక్రమించినప్పుడు ఇతడు లాహోర్ నుండి వెలువడే ఆదాబ్ - ఎ- మష్రిఖ్ అనే పత్రికలో "డైరీ ఆఫ్ ఎ టి.బి. పేషెంట్" అనే శీర్షిక క్రింద తన అనుభవాలను అక్షరబద్ధం చేశాడు.

1932లో రామానంద్ సాగర్ రైడర్స్ ఆఫ్ ద రైల్ రోడ్ అనే మూకీ చిత్రానికి క్లాపర్ బాయ్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించాడు. దేశవిభజన అనంతరం 1949లో ఇతడు ముంబైకి తన మకాం మార్చాడు.

1940లలో పృథ్వీరాజ్ కపూర్ ఆధీనంలోని పృథ్వీ థియేటర్స్ లో ఇతడు అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాడు. కపూర్ పర్యవేక్షణలో కొన్ని నాటకాలకు దర్శకత్వం వహించాడు.

కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతో పాటు ఇతడు రాజ్ కపూర్ సూపర్‌హిట్ సినిమా బర్సాత్కు కథ, స్క్రీన్‌ప్లే అందించాడు. ఇతడు సాగర్ ఫిల్మ్‌స్ (ప్రైవేట్ లిమిటెడ్) అనే సినిమా, టెలివిజన్ నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. బాజూబంద్, మెహమాన్ వంటి సినిమాలను దర్శకత్వం వహించి నిర్మించాడు కానీ అవి అంతగా విజయవంతం కాలేదు.

ఎస్.ఎస్.వాసన్ దర్శకత్వంలో దిలీప్ కుమార్ , వైజయంతిమాల, రాజ్‌కుమార్‌లు నటించిన పైగమ్ చిత్రానికి ఇతని 1960లో ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంభాషణల రచయిత అవార్డ్ లభించింది.

ఇతడు 1960వ దశకంలో ఘుంఘట్, అర్జూ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 1964లో రాజేంద్ర కుమార్, వైజయంతిమాల, పృథ్వీరాజ్ కపూర్, రాజ్‌కుమార్‌లు నటించిన జిందగీ అనే కళాత్మక చిత్రానికి దర్శకత్వం వహించాడు. 1968లో ధర్మేంద్ర, మాలా సిన్హా జంటగా నిర్మించిన స్పై థ్రిల్లర్ సినిమా ఆంఖేఁ చిత్రం ఇతనికి ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డ్‌ను సంపాదించి పెట్టింది.[8] 1970వ దశకం తొలి దశలో ఇతని సినిమాలు గీత్, లల్‌కార్ విజయవంతం కాలేదు. 1976లో ధర్మేంద్ర, హేమా మాలిని జంటగా చరస్, 1979లో రాజేష్ ఖన్నా, రేఖ, మౌసమీ చటర్జీలు నటించిన ప్రేమ్‌బంధన్ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం నెరిపాడు. 1982లో ధర్మేంద్ర, హేమా మాలిని, రీనా రాయ్‌లు నటించి ఇతడు దర్శకత్వం వహించిన భాగవత్ సినిమా ఘనవిజయాన్ని తెచ్చిపెట్టింది.

1985లో ఇతడు దర్శకుడిగా పనిచేసిన సల్మా చిత్రం సంగీతపరంగా జనాదరణ లభించినా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది.

1985లో ఇతడు టెలివిజన్ రంగంలోకి ప్రవేశించాడు. మోతీ సాగర్ దర్శకత్వంలో దాదా దాదీకి కాహానియాఁ సీరియల్‌ను నిర్మించాడు. అది మొదలు ఇతని సంస్థ సాగర్ ఆర్ట్స్ భారతీయ చరిత్రకు సంబంధించిన టెలివిజన్ సీరియళ్లను నిర్మించడం ప్రారంభించింది. ఇతడు దర్శకత్వం వహించిన రామాయణ్ దూరదర్శన్‌లో 1987 జనవరి 25న మొదటి ఎపిసోడ్ ప్రసారమయ్యింది. దీని తరువాత కృష్ణ, లవ్ కుశ్ టెలీసీరియళ్ళను నిర్మించి దర్శకత్వం వహించాడు. 1988లో ఇతడు విక్రమ్‌ ఔర్ భేతాళ్ అనే సీరియల్‌కు దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత అలీఫ్ లైలా, సాయిబాబా టెలీసీరియళ్లను తీశాడు.

రామాయణ్ ధారావాహికను మొదట 52 వారాలలో ప్రసారం చేయడానికి నిర్మించాడు. అయితే ఆ ధారావాహికకు వచ్చిన ప్రజాదరణ దృష్ట్యా మూడుసార్లు పొడిగించి చివరకు 78 వారాలు ప్రసారం చేశారు.

ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చిన అభ్యర్థన మేరకు ఇతడు లవ్ కుశ్ సీరియల్‌ను నిర్మించాడు.

భారత పాకిస్తాన్ విభజన సమయంలో తన అనుభవాలను వివరిస్తూ హిందీ - ఉర్దూ భాషలలో ఔర్ ఇన్సాన్ మర్ గయా అనే పుస్తకాన్ని 1948లో ప్రచురించాడు.

2000లో భారతప్రభుత్వం ఇతడిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇతడు తన 88వ యేట అనారోగ్య కారణాలతో ముంబైలోని తన స్వగృహంలో 2005, డిసెంబర్ 12న మరణించాడు.

ఇతని జీవితచరిత్రను "ఏన్ ఎపిక్ లైఫ్: రామానంద్ సాగర్ ఫ్రమ్‌ బర్సాత్ టు రామాయణ్" అనే పేరుతో ఇతని కుమారుడు ప్రేమ్‌సాగర్ 2019 డిసెంబర్‌లో వెలువరించాడు. ఇందులో అట్టడుగు స్థాయి నుండి గొప్ప ఫిల్మ్‌మేకర్‌గా ఎదిగడానికి జీవితంలో ఇతడు ఎదుర్కొన్న కష్టాలను వివరించబడింది.

పద్మశ్రీ –2000 1960 – ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సంభాషణల రచయిత అవార్డ్ పైగమ్‌ చిత్రానికి. 1969 – ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డ్ ఆంఖేఁ చిత్రానికి. నామినేట్ చేయబడినవి 1966 – ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ కథారచయిత అవార్డ్ అర్జూ చిత్రానికి. 1966 – ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డ్ అర్జూ చిత్రానికి. 1969 – ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ కథారచయిత అవార్డ్ ఆంఖేఁ చిత్రానికి.
ఫిల్మోగ్రఫీ

సంవత్సరం

పేరు

సినిమా/టి.వి.సీరియల్

పాత్ర(లు)

విశేషాలు

2005

సాయిబాబా

టి.వి.సీరియల్

దర్శకుడు

1993

అలీఫ్ లైలా

టి.వి.సీరియల్

దర్శకుడు

1993

కృష్ణ

టి.వి.సీరియల్

దర్శకుడు

1988-89

లవ్ కుశ్

టి.వి.సీరియల్

దర్శకుడు

1987-88

రామాయణ్

టి.వి.సీరియల్

దర్శకుడు
నిర్మాత
రచయిత

1985-86

విక్రమ్‌ ఔర్ భేతాళ్

టి.వి.సీరియల్

దర్శకుడు
నిర్మాత

1985

సల్మా

సినిమా

దర్శకుడు
నిర్మాత

1983

రొమాన్స్

సినిమా

దర్శకుడు
నిర్మాత

1982

భాగవత్

సినిమా

దర్శకుడు
నిర్మాత

1981

ఆర్మాన్

సినిమా

నిర్మాత

1979

హమ్‌ తేరే ఆషిక్ హైఁ

సినిమా

సంభాషణల రచయిత
స్క్రీన్‌ప్లే రచయిత

1979

ప్రేమ్‌ బంధన్

సినిమా

దర్శకుడు

1976

చరస్

సినిమా

దర్శకుడు
నిర్మాత
రచయిత

1973

జల్తే బదన్

సినిమా

దర్శకుడు
నిర్మాత
రచయిత

1972

లల్కార్

సినిమా

దర్శకుడు
నిర్మాత
రచయిత

1970

గీత్

సినిమా

దర్శకుడు
నిర్మాత

తెలుగులో ఆరాధన పేరుతో పునర్మించబడింది

1968

ఆంఖేఁ

సినిమా

దర్శకుడు
నిర్మాత
రచయిత

1965

అర్జూ

సినిమా

దర్శకుడు
నిర్మాత
రచయిత

1964

జిందగీ

సినిమా

దర్శకుడు
నిర్మాత

తెలుగులో ఆడబ్రతుకు పేరుతో పునర్మించబడింది.

1964

రాజ్‌కుమార్

సినిమా

సంభాషణల రచయిత
స్క్రీన్‌ప్లే రచయిత

1960

ఘుంఘట్

సినిమా

దర్శకుడు

1959

పైగమ్‌

సినిమా

సంభాషణల రచయిత

1958

రాజ్ తిలక్

సినిమా

రచయిత
సంభాషణల రచయిత

1956

మేమ్‌ సాహిబ్

సినిమా

సంభాషణల రచయిత

1954

బాజూబంద్

సినిమా

దర్శకుడు

1952

సంగ్దిల్

సినిమా

సంభాషణల రచయిత
స్క్రీన్‌ప్లే రచయిత

1953

మెహమాన్

సినిమా

దర్శకుడు

1950

జాన్ పెహచాన్

సినిమా

సంభాషణల రచయిత
స్క్రీన్‌ప్లే రచయిత

1949

బర్సాత్

సినిమా

రచయిత
సంభాషణల రచయిత
స్క్రీన్‌ప్లే రచయిత