రామకృష్ణ పరమహంస అన్ని మతాల పట్ల సమధర్మం పాటిస్తూ, ప్రాపంచిక జీవితం పట్ల నిర్లిప్తత , ఉదాసీనతతో జీవించి సరికొత్త అద్వైతవాదాన్ని ప్రవేశ పెట్టాడు.ఇతను భావవాది అయినప్పటికీ ప్రపంచంలోని వివిధ మతాల మధ్య ఐక్యతను సాధించడానికి ప్రయత్నించారు. అదే పరిస్థితి నేడు జరిగి ఉంటే మత చాందసులు అతన్ని చంపేసేవారు.అన్ని మతాలలో ఉన్న సత్యం మరియు ధర్మం ఒకటేనన్నాడు. ఇది బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాదిగా నిలిచింది. అది వివేకానందుని ద్వారా దేశ వ్యాపితమైంది. రామకృష్ణ పరమహంస మానవ సమానత్వం కోసం నిలబడ్డారు మరియు కుల వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించారు. మైఖేల్ మధుసూదన్ దత్తా, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, దేవేంద్రనాథ్ ఠాగూర్ మరియు కేశవ్ చంద్ర సేన్ మొదలైన వారు రామకృష్ణ తాత్వికతకు ప్రభావితులయ్యారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస కు గొప్ప శిష్యుడయ్యాడు. భారతదేశం, యూరప్ మరియు అమెరికా అంతటా తన గురువు సందేశాన్ని తీసుకువెళ్లారు.ఇతని ప్రభావం తో అతని శిష్యుడు వివేకానందుడు చికాగో లో జరిగిన సర్వమత సమ్మేళనంలో అన్ని మతాల సారాంశం సోదరభావమేనని తన గురువు ప్రకటించిన తత్వాన్ని చాటాడు. సద్గురువు మార్గదర్శకత్వంలోనే సన్యాసి అయినా, గృహస్థు అయినా ఆధ్యాత్మిక పురోగతిని సాధించగలరు. అవివేకంతో అర్హత లేని గురువును ఆశ్రయిస్తే ఉన్న కష్టాలకు తోడు మరిన్ని ఆపదలు వచ్చిపడతాయి. ఉన్న సంశయాలు తీరకపోగా, కొత్త సందేహాలు జతకూడుతాయి. సద్గురువులను పరమహంస బోధ గురువులని,అర్హతలేని గురువులను బాధ గురువులని అనేవారు. "మతాన్ని గురించి మాట్లాడేవారు తరచు తమలో తాము దెబ్బలాడుకుంటూ ఉండటం నేను గమనిస్తున్నాను.హిందువులు, ముసల్మానులు, బ్రాహ్మసామాజికులు, శాక్తులు. వైష్ణవులు, శైవులు అందరూ తమలో తాము దెబ్బలాడు కుంటూ ఉంటారు. కృష్ణుడు అని పిలవబడేవాడే, శివుడనీ, ఆదిశక్తి అని, అతనినే జీపప్ అని, అల్లా అని పిలుస్తారని వారు. గ్రహించటంలేదు. రాముడు ఒక్కడే, అతనికి వేయి పేర్లు న్నాయి. సత్యం ఒక్కటే దానికి మారుపేర్లు ఎన్నో వ్యత్యాసమల్లా వాతావరణం, పేరు. అందరూ ఒకే సత్యాన్ని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఒక సరస్సుకు అనేకమైన ప్రవేశ మార్గాలుంటాయి. ఒక చోట నుండి హిందువులు నీరు తీసుకుంటారు. దాన్ని 'జలం' అంటారు. మరొక చోట నుండి ముసల్మానులు నీరు తీసుకుంటారు. దానిని 'పానీ' అంటారు. మరో చోటునుండి క్రైస్తవులు నీరు తీసుకుంటారు. దానిని 'వాటర్' (నీరు) అంటారు. ఎవరెనా ఒకరు ఇది 'జలం' కాదు. పానీ అని ఇది పానీ కాదు వాటర్ అని, ఇది వాటర్ కాదు జల్ అవి అంటే, ఈ వాదన హాస్యాస్పదంగా ఉంటుంది. కాని, సరిగ్గా ఇలాంటి వివాదం వివిధ శాఖల మధ్య తగాదాలకు కారణం వారి మధ్య ఘర్షణను సృష్టిస్తున్నది ఇదే. దాంతో ఒకరినొకరు చంపుకుంటున్నారు. ఇతరుల రక్తాన్ని చిందిస్తున్నారు. ఇది చాలా చెడ్డపని, అందరూ దేవుడ్ని చేరుకోవలసినవారే చిత్తశుద్ధి, దేవుని చేరుకోవాలనే కాంక్ష ఉంటే అందరూ తమ లక్ష్యాన్ని చేరుకుంటారు." అని మతం సామరస్యాన్ని ప్రబోధించాడు శ్రీరామకృష్ణ.