ఆశలు వదులుకుంటున్న అసమర్ధుడు - GUDISE VINAYKUMAR

ఆశలు వదులుకుంటున్న అసమర్ధుడు

ఎందుకో వెనక పడుతున్నట్టుఉంది సంబంధం లేని కోర్సులు చేస్తూ
ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియని జాబులు చేస్తూ !
ముంచుకొస్తున్న మాంద్యాన్ని ఆలోచిస్తూ
తెలియని పనిని తెలుసు అనుకుంటూ చేస్తూ ఎందుకో వెనకపడినట్టు ఉంది !
ప్రాణం లేని పైసల కోసం ఇష్టంలేని జాబ్ చేసుకుంటూ
ఇంట్లోని సమస్యలను చూస్తూ తీర్చలేని నన్ను నేనే చూస్తుంటే ఎందుకో వెనకపడినట్టు ఉంది !
సమాజం లో ఇంకొకరి మెప్పు కోసం మనసు నచ్చినట్టు చేయలేక
ఇంకొకరి లాగ జీవించాలని అనుకుంటూ ఎందుకో వెనకపడినట్టు ఉంది !
కనికరించని కంపెనీల మధ్య ఆశయాలను కలల్లో కంటూ
కన్నోళ్ల ఆశలను తీర్చలేనందుకు ఎందుకో వెనకపడినట్టు ఉంది!
జీవితం బాగుండాలని అనే స్థాయి నుండి జీతం వస్తే చాలు అనే స్థాయి దాకా
రంగులు మార్చే మనుషుల మధ్య నటిచలేనందుకు ఎందుకో వెనకపడినట్టు ఉంది !
ఆప్యాయంగా పలకరించే పెదాల నుంచి అసూయా పడేలా మారిన మనసుల దాకా
వ్యక్తిని ప్రేమించే స్థాయి నుంచి వ్యసనానికి బానిసయ్యే స్థాయిని చూస్తుంటే ఎందుకో వెనకపడినట్టు ఉంది!
ఆ కాలం లో ప్రేమలు ఆలోచిస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో అనిపిస్తూనే ఇప్పటి ప్రేమలు చూస్తూ ఎందుకో వెనకపడినట్టు ఉంది !
ఎంతో వేగంగా ఆలోచించే మెదడే ఈ బాహ్య ప్రపంచంలో జరుగుతున్నవి చూస్తుంటే ఎందుకో వెనకపడినట్టు ఉంది!
ఈ వెనకబాటు తనానికి కారణం నేనా లేక నా మెదడులో జరుగుతున్న ఆలోచనల లేక నన్ను ఇలా మారుస్తున్న సమాజమా !!!