మన సినీ కీర్తిశిఖరాలు టి.వి.రాజు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

మన సినీ కీర్తిశిఖరాలు టి.వి.రాజు.


మన సినీ కీర్తిశిఖరాలు.

తోటకూర వెంకట రాజు (టి.వి.రాజు) (జ: 1921 - మ: ఫిబ్రవరి 20, 1973) తెలుగు-తమిళ సినిమా సంగీత దర్శకుడు. ఈయన కన్నడ సినీ రంగములో కూడా పనిచేశాడు. ఈయన అంజలీదేవి నృత్యప్రదర్శనలకు హార్మోనియం వాయించేవాడు.

తోటకూర వెంకటరాజు రాజమహేంద్రవరం తాలూకా రఘుదేవపురంలో జన్మించాడు. స్వగ్రామంలోనే నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారి వద్ద సంగీతాన్ని అభ్యసించాడు. మాస్టర్ వెంకటరాజు అన్న పేరుతో రంగస్థల నటునిగా మద్రాసులో స్థిరపడ్డాడు. నటించిన సినిమాలు : పల్లెటూరి పిల్ల (1950)లో గూఢచారిగా, పిచ్చి పుల్లయ్య (1953)లో న్యాయమూర్తిగా, బంగారుపాప (1954)లో డాక్టర్‌గా, పాండురంగ మహాత్మ్యం (1957)లో ‘కృష్ణా ముకుందా మురారి’ అనే పాటలో భక్తునిగా కనిపిస్తారు.

ఈయనకు 33వ యేట సావిత్రితో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు. పెద్దవాడు వెంకట సత్య సూర్యనారాయణ రాజు, ఈయన గిటారిస్ట్. రెండవ కుమారుడు తోటకూర సోమరాజు (రాజ్ గా తెలుగు సినీరంగంలో ప్రసిద్ధి చెందాడు), రాజ్-కోటి ద్వయంలో ఒకడు. కోటి నుండి విడివడి సిసింద్రీ వంటి చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించాడు.

సినీ ప్రస్థానం.

1950లో విడుదలైన పల్లెటూరి పిల్ల సినిమాలో సంగీతదర్శకుడు పి.ఆదినారాయణరావుకు సహాయకునిగా పనిచేశాడు. సంగీతదర్శకునిగా వెంకటరాజు తొలి సినిమా 1952లో బి.ఎ.సుబ్బారావు దర్శకత్వం వహించిన టింగురంగ. 70వ దశకపు తొలినాళ్లలో యోగానంద్, వేదాంతం రాఘవయ్య, కమలాకర కామేశ్వరరావు, ఎన్టీయార్, కె.విశ్వనాథ్‌ల సినిమాలకు సంగీతం సమకూర్చాడు. టీవీ రాజు సంగీతదర్శకత్వం వహించిన చిత్రాలలో జయసింహ, పాండురంగ మహత్యం, శ్రీకృష్ణపాండవీయం, గండికోట రహస్యం, మంగమ్మ శఫదం, పిడుగు రాముడు, విచిత్ర కుటుంబం, కథానాయకుడువంటి చిత్రాలున్నాయి.

సినిమాలు.

ధనమా దైవమా (1973)
శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972)
చిన్ననాటి స్నేహితులు (1971)
మారిన మనిషి (1970)
రైతే రాజు (1970)
కోడలు దిద్దిన కాపురం (1970)
తల్లా పెళ్ళామా (1970)
భలే మాస్టారు (1969)
నిండు హృదయాలు (1969)
కదలడు - వదలడు (1969)
తారా శశాంకము (1969)
బందిపోటు భీమన్న (1969)
కర్పూర హారతి (1969)
కథానాయకుడు (1969)

గండికోట రహస్యం (1969)
వరకట్నం (1969)
భలే తమ్ముడు (1969)
సప్తస్వరాలు (1969)
విచిత్ర కుటుంబం (1969)
బాగ్దాద్ గజదొంగ (1968)
మన సంసారం (1968)
నేనే మొనగాణ్ణి (1968)
తిక్క శంకరయ్య (1968)
దేవకన్య (1968)
కలిసొచ్చిన అదృష్టం (1968)
వరకట్నం (1968)
చిక్కడు - దొరకడు (1967)
నిండు మనసులు (1967)

భామా విజయం (1967)
చదరంగం (1967)
కాంభోజరాజు కథ (1967)
శ్రీ కృష్ణావతారం (1967)
ఉమ్మడి కుటుంబం (1967)
రాజిసూయం (1966)
పిడుగు రాముడు (1966)
భీమాంజనేయ యుద్ధం (1966)
శ్రీ కృష్ణ పాండవీయం (1966)
శ్రీసింహాచల క్షేత్ర మహిమ (1965)
విశాల హృదయాలు (1965)
మంగమ్మ శపధం (1965)
సవతి కొడుకు (1963)
టాక్సీ రాముడు (1961)

ఋష్యశృంగ (1961)
సతీ సులోచన (1961)
బాల నాగమ్మ (1959)
రేచుక్క-పగటి చుక్క (1959)
రాజ నందిని (1958)
శ్రీ కృష్ణ మాయ (1958)
పాండురంగ మహత్యం (1957)
శ్రీగౌరీ మహత్యం ( ఓగిరాల రామచంద్రరావుతో) (1956)
చింతామణి (1956)
జయసింహ (1955)
తోడు దొంగలు (1954)
నిరుపేదలు (1954)
పిచ్చి పుల్లయ్య (1953)
టింగు రంగ (1952)

ఈయన ఒకే ఒక సినిమాను నిర్మాతగా తీసారు. ఒకప్పటి రూమ్ మేట్స్ అయిన ఎన్.టి.ఆర్, ఎస్.వి.ఆర్ తో కలిసి "బాల నాగమ్మ" (1959) సినిమాను నిర్మించారు.

సేకరణ.