మన అంచనా ఎందుకు తప్పుతుంది? - పిళ్లా కుమారస్వామి

మన  అంచనా ఎందుకు తప్పుతుంది?

‌‌అతిగా అంచనా వేయడం : మనం వాస్తవానికి మించి అంచనా వేయడం. బలానికి మించి అంచనా వేయడం, ఉన్న బలహీనతల్ని అతిగా అంచనా వేయడం, ఒక కామ్రేడ్ శక్తిసామర్థ్యాలను అతిగా అంచనా వేయడం పొరపాటు అవుతుంది. ఉదా: 1967లో నక్సలైట్లు విప్లవానికి ప్రజల సంసిద్ధతను' అతిగా అంచనా వేశారు. తక్కువగా అంచనా వేయడం : ఉన్న శక్తి సామర్ధ్యాలను తక్కువగా అంచనా వేయడం. ప్రజలు పోరాటాల్లోకి దిగే సందర్భాన్ని తక్కువగా చూడటం, శత్రువు బలాన్ని తక్కువగా చూడటం. ప్రజల బలాన్ని తక్కువగా చూడటం. సంఘటనల సంసిద్ధతులను తక్కువగా చూడటం. ఇవన్నీ తక్కువగా అంచనా చేయడం కిందకు వస్తాయి. కమ్యూనిస్టు పార్టీలు 1983లో టి.డి.పి బలాన్ని తక్కువగా చూసింది. పాక్షికంగా అంచనా వేయడం : పాక్షికమైన పరిశీలనతో ప్రారంభించి అంచనా వేయడం సరికాదు.ఇది ఒక ఉద్యమం. బలాన్ని, బలహీనతల్ని రెండింటిని గుర్తించి నిర్ణయానికి రావాలి. అంతేగాని ఒకదాన్నే చూసి నిర్ణయానికి రాకూడదు. కార్యకర్తలలోని మంచి చెడులను సాపేక్షంగా చూడాలి. పైపైన అంచనా వేయడం : కార్యకర్తల పైపై మాటలు వేషభాషలను బట్టి వారిని అంచనా వేయరాదు. వారిలో అంతర్గతంగా వున్న కమ్యూనిస్టు సారం ఎంత ఉందనే దాన్ని బట్టి అంచనా వేయాలి. విడివిడిగా అంచనా వేయడం : విడివిడి ఘటనలను బట్టి వ్యక్తులను, కార్యకర్తలను మంచివాడనో చెడ్డవాడనో గుర్తిస్తాము. కొంతమంది మనల్ని నమ్మించేందుకుగాను ఒక్కొక్కసారి నటిస్తారు. అందువలన తొందరపడి అంచనాకు రాకూడదు. చారిత్రకమైన అంచనా : ఏ విషయాన్నైనా గతాన్ని బట్టో, ప్రస్తుత పరిస్థితిని ఐట్టో అంచనా వేయరాదు. గతాన్ని వర్తమానాన్ని రెండింటినీ మేళవించి నిర్ధారణకు రావాలి. ఉదా : ఒక కార్యకర్తకు రెండు సంవత్సరాల క్రితం ఉన్న ఉత్సాహం, విజాయితీ ఈ రోజు లేదనుకోండి. అతనిలో వచ్చిన మార్పుల్ని అభివృద్ధి క్రమంలో పరిశీలించాలి.