రిస్కు - బన్ను

Risk

'రిస్క్ వర్సెస్ రివార్డ్' అన్నారు. రిస్క్ చేయకపోతే జీవించటమే కష్టం. 'రిస్క్' అనే పదం గుర్తు రాగానే మనకి పాతాళభైరవి సినిమాలో 'సాహసం సేయరా డింభకా...' వంటి డైలాగులు, 'ధైర్యే సాహసే లక్ష్మి' వంటి సూక్తులు గుర్తొస్తుంటాయి.

విమానం భూమ్మీదే వుంటే ప్రమాదం వుండదు. కానీ దాన్ని తయారుచేసింది అందుకు కాదు కదా! 'ఏరిస్కూ తీసుకోకపోవటమే అన్నిటికన్నా పెద్ద రిస్కు' అని ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అన్నారు.

జీవితంలో ఏదోక సందర్భంలో మనం 'రిస్క్' తీసుకోక తప్పదు. ఈమధ్య 'రిచ్ డాడ్ - పూర్ డాడ్' అనే ఆంగ్ల పుస్తకాన్ని చదివాను. అందులో ఒక వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది. "The Difference between RICH and POOR is... how they manage 'FEAR'!. గురి చూసి బాణం వేయటం కొంచెం 'రిస్కు', ఐతే కళ్ళు మూసుకుని బాణం వేయటం జూదం... అని నా అభిప్రాయం. ఈరోజుల్లో రిస్కులు మనం తీసుకోకుండానే, చేసే ప్రతీ పనీ 'రిస్క్'గా మారుతుంది. డ్రైవింగ్ చేయటం, రైలు/విమానంలో ప్రయాణాలు చేయటం... ఇలాంటి ఎన్నో రిస్కులు మన సామాజిక జీవితంలో ఇమిడిపోయాయి! అంచేత 'రిస్క్' గురించి... ఎక్కువగా ఆలోచించే 'రిస్క్' చేయనవసరం లేదు.