భీష్ముని వ్తక్తిత్వం - ఆదూరి.హైమావతీశ్రీనివాసరావు

Bheesmuni vyaktitwam

భీష్ముడు మహాభారతంలో మైన్ హీరో. అసలు భీష్ముని జననం ,మరణం మధ్యలో ఆయన జీవన విధానం మనం లోతుగా ఆలోచిస్తే చాలా చిత్రం అనిపిస్తుంది.భీష్ముడు మహావీరుడు, శూరుడు. పండితుడు, వివేకవంతుడు, వేదాంతి, మహా విలువిద్యాసంపన్నుడు అతడిని జయించడం ఎవ్వరికీ సాధ్యంకాదు.

అసలు భీష్ముడు ఎవరో ఒకమారు చూద్దాం. బ్రహ్మ ప్రజాపతి పుత్రులు, ప్రకృతి తత్వానికి ప్రతికలు ఐన వారు అష్టవసువులు.

అష్టవసువులు - ధరుడు,ధృవుడు, సోముడు, అహుడు, అనిలుడు అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు.వీరు ప్రకృతిలోని భూమి, నీరు అగ్ని,గాలి సూర్యుడు, అకాశము, చంద్రుడు, నక్షత్రాల కు ప్రతీకలు. వీరు ఇంద్రునికి సహాయకులుగా ఉండేవారు.

.వశిష్ట మహర్షి ఆశ్రమసమీపంలో గంగానదిలో భార్యలతోకూడి జలకాలాడుతూ ఉండగ అవీరి భార్యలకఒరికమేరకు వశిష్ట మహర్షి ఆస్రమంలోని కామధేనువును అపహరిస్తారు. ఆయన దివ్యదృష్టితో గ్రహించి వీరినిభూలోకంలో జన్మించమని శపిస్తాడు.వారంతా మన్నించమని ప్రార్థించగా మొదటి ఏడుగురూ సహకరించారు కనుక వారిని పుట్టాక కొద్దికాలానికి గంగలో మునిగిశరీరం వదలితే శాప విముక్తి కలుగుతుందని చెప్తాడు .

గోవును అపహరించడంలో ప్రముఖపాత్ర వహించిన ప్రభాసునుని దీర్ఘకాలం మానవలోకంలో జీవించి శాప విముక్తిపొందుతావని చెప్తాడు. వీరంతా కూడా భూమిమీద జన్మించవలసి వస్తుంది.

 

వారంతా గంగాదేవిని, మానవ రూపం ధరించి ఎవరైనా రాజుల వివాహమాడి తమకు జన్మనిచ్చి తిరిగి గంగాజలంలో ముంచు వేసి శాపవిముక్తి కలిగించమని కోరుతారు. అలా పుట్టిన వెంటనే నదిలో పారేయమని చెప్తారు .అందుకు గంగ అంగీకరిస్తుంది. శంతనుడు గంగా తీరంలో విహరిస్తుండగా మానవ రూపంలో ఉన్నగంగామాతను మానవాకారంలో ఉండగా చూస్తాడు.ఆమెను వివాహమాడమని కోరగా ఆమె తాను ఏ పని చేసినా అడ్డు చెప్పకూడదని, అలాచెప్తే తాను రాజును విడచి వెళ్లిపోతాననీ చెప్తుంది .

దానికి అంగీకరించి శంతనుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. పుట్టగానే ఏడుగురిని వరుసగా తీసుకెళ్లి గంగా నదిలో పడేస్తుంది .ఆఏడుమంది వసువులకూ శాపవిముక్తి అవుతుంది. ఎనిమిదవ బిడ్డని కూడా పడేస్తుండగా ,తనతర్వాత రాజ్యపాలన చేయను ఈ ఒక్కడినీ ఉంచమని శంతనుడు ఆమెను అడ్డుకుంటాడు.తనని అడ్డుకున్నందువలన అతడిని విడిచేసి బిడ్డత్నుతీసుకుని విద్యాబుధ్హ్దులు నేర్పి తెచ్చి ఇస్తానని చెప్పి వానితోపాటుగా అంత ర్థానమైపోతుంది .అతడే దేవవ్రతుడు .విద్యలన్నీ నేర్పి 18 సం, రాలనవయువకుని శంతనునికి గంగామాత ఇస్తుంది .

ఎక్కువకాలం కాలం భూమి మీద జీవించాలనే శాపానికి గురైన అష్టమవసువు.వ్యాస మహర్షి పరాశర మహర్షికి మస్త్యగంధికి కృష్ణ ద్వీపంలో జన్మిస్తాడు. నల్లటి ఆకారంతో ఉండటం వలన కృష్ణ ద్వైపాయనుడు అని ఇతనికి పేరు. ఇతడు పుట్టగానే యవ్వనంతో ఉండి తపసు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు.మస్త్యగంధి ఐన సత్యవతి చేపల వాసన పోగొట్టి యోజన గంధిగా యోజనం వరకు సువాసన వెదజల్లే లాగా పరాశాడు వరం ఇవ్వడంతో సత్యవతి యోజన గంధి అవుతుంది.

శంతనుడు సత్యవతిని చూసి వివాహమాడాలను కున్నపుడు ఆమె తండ్రి దాసరాజు ఒక షరతు విధిస్తాడు.తనకుమార్తెకు పుట్టినబిడ్డే రాజుకావాలని .తండ్రికి ఆనందం కలిగించడంకోసం 18 సం. యువరాజైన దేవవ్రతుడు ఆ షరతులకుఅంగీకరించి ఆమరణాంతం బ్రహ్మచర్యం అవలంబిస్తానని ప్రతిజ్ఞచేసి భీష్ముడు అవుతాడు. శంతనుని మరణం తర్వాత వారి కుమారులైన న చిత్రాంగదుడు విచిత్ర వీరుడు గంధర్వుల చేతిలో అకాల మరణం చెందుతారు. భరత వంశం వారసులను కోల్పోయిందని సత్యవతి వ్యాసుని పిలుస్తుంది వ్యాసుడు వచ్చి తల్లి కోరిక మేరకు అంబికకు ధృతష్ట్రుని అంబాలికకు పాండురాజుని దాసీకి విదురుని ప్రసాదించి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వ్యాసుడు గాంధారికి గర్భశ్రావం జరగడంతో అక్కడికి వచ్చి మృత పిండాన్ని 101 నేతి కుండల్లో పెట్టి వాటిని రక్షించగా వందమంది పుతృలుకౌరవులు ,ఒక కుమార్తె దుశ్శలా జన్మిస్తారు .

ధృతరాష్ట్రుతుడు గుడ్డివాడైనందున, పాండురాజు అకాలమరణం చెందటాన , భీష్ముడు వారందరికీ రక్షకుడౌతాడు.ధృతరాష్ట్రుని సిమ్హాసనం మీద కేవలం ఒక ఇంచార్జ్ వ్యక్తిగా కూర్చోబెట్టి తానే అంతా చూస్తుంతాదు భీష్ముడు. ధృతరాష్ట్రునికి రాజభోగాలు అలవాటై రాజ్య కాంక్ష పెరిగి , అతనికుమారుడు రాజుకావాలనేకోరిక పెరిగి, దుర్యోధనుడు తానె అకానునన్రాజని అరాచకాలు చేయడం తెలిసీ సిమ్హాసనమ్మీద్ అకూర్చున్న గుడ్డిరాజు తెలిసీ మౌనంవహించగా అన్నీ చూస్తూకూడా భీష్ముడు మౌనం వహించడం ధర్మ విరుధ్ధం.

అలా భీష్ముడు అధర్మపుబాట పట్టాడు. చూసీ చూడనట్లు ఉదాసీనభావంతో వ్యవహరించి అన్యాయాన్ని సమర్థించి దొంగతనం చేసి జన్మించిన వాసన వీడక అన్యాయాలకు ఆశ్రయమిచ్చాడు.

 

భీష్ముడి వ్యక్తిత్వాన్ని చాలా ఉన్నతంగా, ధర్మానికి ప్రతీకగా అంతా భావిస్తాం . భీష్ముడు “వ్రతనిష్ఠ, గురుభక్తి, రాజధర్మం” ఆచరించడంలో ప్రధముడనికూడా అనుకుంటాం.

సాధారణంగా పైకి కనిపించే భీష్ముని వ్యక్తిత్వం.

1️⃣ అచంచల వ్రతనిష్ఠ

 

తన తండ్రి శంతనుని సంతోషం కోసం బ్రహ్మచర్య వ్రతం స్వీకరించాడు. ఒకసారి మాటిచ్చాక జీవితాంతం దాన్ని నిలబెట్టుకున్నాడు.

2️⃣ త్యాగ స్వభావం-రాజుగా ఉండక తండ్రి కోరిక నెరవేర్చాడు. ఇది స్వార్థరహిత ప్రేమకు ఉదాహరణగా చెప్పుకుంటాం.

3️⃣ ధర్మబద్ధ జీవనం-మహాభారతం లో భీష్ముడు ధర్మాన్ని ఆలోచించినా కానీ పూర్తిగాపాటించలేదు.ఉదాసీన వైఖరి వహించాడు.అన్యాయ అక్రమ స్వార్థప్రవర్తను లైన కౌరవుల పక్షంలో యుద్ధం చేశాడు. వద్దనుకుంటే ఎవ్వరిపక్షానా ఉండక డక బలరామునిలా ఎక్కడికైన వెళ్ళిపోవచ్చు. “ధర్మం తెలుసుకోవడం ఒకటి, ఆచరించడం మరొకటి. ఇక్కడ భీష్ముడు ధరం తెలిసినాపాటించలేదు.

4️⃣ గురుభక్తి - విధేయత-గురువులకు, రాజుకు విధేయత చూపాడు.ఇక్కడ నిజనైకి రాజు ధృతరాషృతుడుకానేకాదు దుర్యోధనుడు యువరాజూకాదు .కానీ అన్నీ తెలిసికూడావారి వైఖరిని ఆపలేదు భీష్ముడు. అధర్మం జరిగేటప్పుడు మౌనంగా ఉండటం ఆయన వ్యక్తిత్వానికి పెద్ద దెబ్బ.

5️⃣ ఇచ్ఛామరణం – ఆత్మనియంత్రణ

భీష్ముడికి ‘ఇచ్ఛామరణం’ వరం ఉండేది. ఇది మనస్సు, ఇంద్రియాల మీద సంపూర్ణ నియంత్రణకు సూచిక.

అంతాభావించేది భీష్ముడు మహోన్నత వ్యక్తిత్వంకలవాడని.త్యాగమూర్తి అనీ.

వ్రతనిష్ఠకు చిహ్నం అనీనీ.కానీ “ధర్మసంకటంలో మౌనం” వహించడం వలన ఆయన వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు.ధర్మం తెలిసీ ఉదాసీనంగా ఉండటం అంటే అధర్మాన్ని ఆచరించినట్లే.

భీష్ముడు చేసిన తప్పుల్లో మొదటిది.

శక్తి, వీరత్వ బల గర్వాలతో స్వయంవరంలో ఉన్న ముగ్గురు కన్యలను వారి ఇష్టానికి వ్యతిరేకంగా బలగర్వంతో మిగతారాజులను ఎదిరించి ఒకరకంగా కన్యలను అపహరించి తీసుకువెళ్లి తన తమ్ములకు వివాహంచేయతలచడం. దానిలో అంబ అనే యువరాణి జీవితాన్ని అనుకోకుండా నాశనం చేశాడు.

అంబ శాల్వుని ప్రేమించింది, అతనినే వరించాలని వరమాల పట్టుకుని ఉండగా భీష్ముడు బలాత్కారంగా తెచ్చాడు. కానీ స్వయంవర సమయంలో భీష్ముడు ఆమెను మరియు ఆమె సహోదరీలను అపహరించి హస్తినాపురానికి తీసుకువచ్చాడు.

 

తరువాత అంబా తన మనసు శాల్వుడిపై ఉందని చెప్పగా, భీష్ముడు ఆమెను శాల్వుడి దగ్గరకు పంపించాడు. అయితే శాల్వుడు “నిన్ను భీష్ముడు గెలిచాడు” కనుక నిన్ను స్వీక్రించను అని ఆమెను అంగీకరించలేదు.ఆమె భీష్ముని వివాహమాడమని కఒరగ అతాను ప్రతిజ్ఞచేశానంటాడు.అంబ ఎటూకాకుండా జీవితం దుర్భరమవుతుంది. ఒక కన్య జీవితాన్ని నాశనంచేశాడు భీష్ముడు.

 

అంబా తపస్సుచేసి భీష్ముని మరణా నికి కారకురాలయ్యే వరంపొందుతుంది . ఇలాభీష్ముడు చేసిన మొదటి ఘోరమైన తప్పిదం ఇది. ఆమెను అపహరించి తీసుకువచ్చిన తర్వాత,

ఆమె కోరి వరించదలచిక పరిస్థితులు సంక్లిష్టమయ్యాయి.

ఆమె ప్రతీకార వ్రతం చివరికి భీష్ముని మరణానికి కారణమైంది.

2. భీష్ముడు చిన్నవయసునుండే దుర్యోధనుడు, శకునితోకలసి చేసే ప్రతి దుర్మార్గమూ తెలిసికూడా తన బలమూ, అధికారమూ వినియోగించి అపగలశక్తి ఉన్నాకూడా మౌనం వహించడం వలన పాండవులు అసలు రాజ్యాధికారులైనా అష్టకష్టాలూ పడ్దారు. లంకాగృహంసంగతి తెలిసీ భీష్ముడు ఉదాసీనవైఖరి అవలంబించాడు. ఇది ఒకపాపం.

3. మాయాజ్యూతాని తెలిసీ ఆపేశక్తియుక్తులూ బలమూ ఉన్నాకూడాఉదాసీనం వహించడం వలన పాండవులు పడరాని పాట్లు అడ్దారు. అడవుల్లో నివసించారు.

4. అన్నిటికన్నా భీష్ముడు చేసినపాపం

ద్రౌపదీ వస్త్రాపహరణ సమయంలో మౌనం వహించడం. ఇంటికోడలు అసలైన మాహారాణి ఐన ద్రౌపది వలువలు ఒలుస్తు,టే ఒక్క ధనుర్భాణం వేసి అందరినీ ఆపి ఆమెను పంపవచ్చు. ఉదాసీనం ఉదాసీనం భీష్ముని వ్యక్తిత్వాన్ని సర్వనాశనం చేసింది.

చివరకు ఉత్తరగోగ్రహణ సమయంలో కూడా కాలం లెక్కలు చెప్పాడేతప్ప , అన్యాయమనీ తగదనీ చెప్పలేదు.

చివరకు దురాశాపరులు, అన్యాయ ప్రవర్తకులూ .దుర్మార్గులూ ఐన కౌరవుల 11 అక్ష్వొహిణుల సైన్యానికి ప్రధాన అధికారిగా యుధ్ధం చేయడం అదీ 116 ఏళ్లవయసులో అవసరమా, అన్నీ వదిలేసి తనకున్న ఇచ్చామరణాన్ని ఎందుకు పొందలేదూ అంటే అహం తన విలువిద్య వీరత్వం, శౌర్యం చూపే అవకాశం వదులుకోలేక పోయే ఉదాసీన వైఖరి.

ఇలా చివరివరకూ దుర్మార్గులకు అండగానిల్చి పోరాడి పాండవులకు వ్యతిరేకంగా జీవితాన్ని ంలచ్కుని వ్యవహరించాడు. తనకు తాను విధించుకున్న శిక్ష మాత్రమే . తన గత జీవితపు గొంగతనం కరం ఫలితం. ఆవాసనపోక అనూఅయపరులతరఫున జీవితాన్ని సాగించి చివరకు శిఖండి వలన యుధ్ధం మానేసి అంపశయ్యమీద 56 రోజులు ఉండి శరీరంలో రక్తమంతా పోయాక ఉత్తరాయణ పుణ్యకాలం వరకూ జీవించి ఏకాదశిరోజున ప్రాణం వదిలాడు.

ఎంతటి వారికైనా అన్యాయమూ అక్రమమూ చేసీ వారి పక్షం వహించడం ఆదుర్మార్గాలు చేసిన ఫలితాని అందిస్తుందనీ ఉదాశీన వైఖరి తగదనీ భీష్ముని జీవితం మనకు చెప్తున్నది.ఇదే భీష్ముని అంటే శాప వశుడైన ప్రభాసుని గాధ. బ్రహ్మమీకిచ్చి పంపును బరువుమాల కర్మలన్నియు చే ర్చిన కంఠమాల -అని మనం చేసే మంచిచెడు కర్మలన్నీ మనవెంత వద్దన్నా వస్తాయి కనుక మంచి కర్మలను చేయను ప్రయత్నిద్దామా!

 

 

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - ethuku pi ethu
కాశీ ప్రయాణ కథలు - ఎత్తుకు పైఎత్తు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు