ధర్మము అంటే ఏమిటి? - ambadipudi syamasundar rao

ధర్మము అంటే ఏమిటి?

ధర్మము అంటే మానవత్వాన్ని రక్షించే గుణము. హిందూ దేశానికి ధర్మక్షేత్రం పేరు. సకల ప్రాణికోటికి మానవ జన్మ ఉత్తమమైనది. ఇలాంటి మానవత్వాన్ని పరిరక్షించే విషయంలో మానవ జాతి ఒక్కటే సమర్థమైనది. ఇతర ప్రాణులకు లేని బుద్ధి విశేషముగా ఉండటమే దీనికి కారణం. ఆహార భయ నిద్రా మైథునములు అన్ని ప్రాణుల యందు సమానమైన, కేవలం యుక్తాయుక్త విచక్షణ, ఆలోచనకు రూపమీయ గల ప్రజ్ఞ బుద్ధి ద్వారా సాధ్యమై ఈ ఉత్తమ గుణాన్ని సాధించవచ్చును.అందుచేతనే మానవుడు ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మానవుడిని కాపాడుతుంది ఈ ధర్మం అనేక సందర్భాలలో అనేక రకాలుగా ఉంటుంది అని సమాజంలో మనిషి వేరు వేరు పాత్రలు నిర్వహిస్తూ ఉంటాడు ఆ పాత్రను బట్టి పాటించవలసిన ధర్మం ఉంటుంది.
ప్రస్తుతం మనము కలియుగము లో ఉన్నాము ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద ఉండదు అందువల్ల సమాజంలో అనేక అకృత్యాలు జరుగుతూ ఆధారము రాజ్యమేలుతూ ఉంటుంది. ముందుగా ఎవరెవరు ఎటువంటి ధర్మాన్ని పాటించాలి అని తెలుసుకుంటే ఆ విధంగా పాటించక పోవటం వల్ల జరిగే అనర్ధాలు అర్ధమవుతాయి.
ముందుగా పురుష ధర్మం తెలుసుకుందాము సోమరితనం లేకుండా కష్టపడి పనిచేయడం పురుష ధర్మం కానీ నేటి సమాజములో కష్టించి పని చేయకుండా అడ్డదారులు తొక్కి త్వరగా సంపాదించాలి అనే కోరిక పెరిగింది దానికి తోడు సుఖ జీవనానికి అలవాటు పడి కష్టపడి పనిచేయడం నవీన సమాజములో పౌరులు మర్చిపోతున్నారు. రెండవది విద్యాభ్యాసంలో శిష్యుడిగా పాటించవలసిన దారము భయభక్తులతో విద్యను అభ్యసించడం ఇప్పుడు శిష్యుడు అంటే విద్యార్థి గురువుల పట్ల ఎంత భయభక్తులతో మెకాగుతున్నాడో చూస్తున్నాము అలాగే విద్యను బోధించే గురువు ధర్మం తనకు తెలిసిన విద్యను దాచుకోకుండా ఏ విధమైన పక్షపాత ధోరణి లేకుండా విద్యను భోధించడం ప్రస్తుతం విద్య కొనుక్కునే స్థితిలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి గురువులు కూడా విద్యను అమ్ముకొనే స్థితిలో ఉన్నారు.విద్యార్జన సమయములో మిత్రులతో మెలిగే టప్పుడు పాటించవలసిన ధర్మం నమ్మిన మిత్రునికి అపకారము చేయకుండా ఉండటం స్నేహ ధర్మాన్ని కదా దాకా పాటించడం నిజమైన స్నేహితుడు అవసరమైన ఆడుకోవటం చేయాలి
వివాహం చేస్తున్నప్పుడు పాటించవలసిన ధర్మం అగ్నిసాక్షిగా ధర్మ బద్దముగా పెండ్లాడిన భార్యను మోసం చేయకుండా పరాయి స్త్రీలతో సంబంధం పెట్టుకోకుండా ఉండటమే వివాహ ధర్మమూ భార్య కూడా తన భర్త అందవిహీనమైన స్థితిమంతుడు కాకపోయినా నమ్మి ఉండడం భార్య ధర్మమూ.గృహస్థుగా ఉన్నప్పుడు యజమాని హోదాలో ఉన్నప్పుడు న్యాయ మార్గములో సంపాదిస్తూ సంసారాన్ని పోషించటం యజమానిగా పురుషుని ధర్మం భార్య ఇల్లాలిగా గొంతెమ్మ కోరికలు కోరకుండా భర్తను వేధించకుండా భర్త మనసు ఎరిగి భర్త సంపాదనతో సక్రమముగా గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మము.అలాగే బిడ్డగా తల్లిదండ్రులను ఆదరించి వృద్ధాప్యములో పోషించటం కొడుకు ధర్మము ,తండ్రిగా తానూ జన్మనిచ్చిన సంతానాన్ని ప్రయోజకులుగా చేయడం తండ్రి ధర్మము.బిడ్డలా ధర్ము కన్నవారికి పేరు ప్రతిష్టలు తేవటం బ్రతకటానికి ప్రతి వాడు ఏదో ఒక వృత్తి స్వీకరించాలి వృత్తిని స్వీకరించాక ఆ వృత్తి ఎటువంటిది అయినా గౌరవించి ఆ వృత్తికి న్యాయం చేయడం వృత్తి ధర్మము సంసారిగా పాటించవలసిన ధర్మం తాను సంపాదించిన దాన్ని పంచుకొని తింటూ కుటుంబములోని సభ్యుల బాగోగులను పర్యవేక్షించడం సంసారి ధర్మము
రాజు న్యాయముగా పరిపాలిస్తూ ప్రజల సంక్షేమాన్ని కాపాడటం, ఏ విధమైన ఆశ్రిత పక్షపాతం చూపుకుండా పరిపాలించడం రాజు ధర్మము సైనికుడుగా ఉండి దేశాన్ని ప్రజలను కాపాడటం సైనిక ధర్మం ఈ విధంగా సమాజంలో అన్ని వర్గాల వారు వారి వారి ధర్మాన్ని పాటిస్తే ధర్మము నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది రామ రాజ్యం అంటారు.