వలపు తెచ్చిన తంటా కు కధా రూపమే .. మలుపు కధ !! (సమీక్ష )--డా. కె ఎల్ వి ప్రసాద్ . జీవితంలో ,విద్యా సమయం చాలా ముఖ్యమైనది . భవిష్యత్తును నిర్ణయించే సమయం అది . చదువులో మూడు ముఖ్యమైన చోట్ల జీవితం మలుపు తిరిగే అవకాశం వుంది . అందులో మొదటిది పద- వ తరగతి ,రెండవది ఇంటర్మీడియెట్ ,మూడవది డిగ్రీ సమయం . ఈ మూడింటిలో ఎక్కడ రైలు పట్టాలు తప్పినా ,భవిష్యత్ బ్రతుకు బోల్తా కొడుతోంది . అందుచేత ,ఈ మూడు సమయాల్లోనూ ,ఇటు - పిల్లలు ,అటు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండక తప్పదు చదువుకునే పిల్లల్లో ,పదవ తరగతిలో ఉండగానే యవ్వన ఛాయలు బహిర్గత మవుతుంటాయి ,ఇంటర్లో ప్రవేశించగానే యవ్వనం మెద– డును కెలకడం మొదలు పెడుతుంది . ఆడ-మగ పిల్లల్లో యవ్వనం అయస్కాంతంలా ఒకరినొకరు ఆకర్షించడం చిగురిస్తుంది . డిగ్రీలోని కి రాగానే ఇది తమకు తెలియకుండానే ఊపందుకుంటుంది .ఈ సమయంలో ఎలాంటి పొరపాటు జరిగినా దాని ప్రభావం భవిష్యత్తు మీద తప్పక పడుతుంది . సరైన నిర్ణయాలు తీసుకోకుంటే ,బ్రతుకే – బూడిద పాలు అవుతుంది . సరిగ్గా ఇదేవస్తువును తీసుకుని స్వర్గీయ అదృష్ట దీపక్ గారు 1970లో ఈ ‘ మలుపు అనే కథను రాశారు . బహుశః రచయితకు అదియవ్వ- న కాలం కూడా కావచ్చు . కాలేజీలో ఆడపిల్లల ప్రమేయంలేకుండా– నే ,ప్రేమిస్తున్నామనే భ్రమలో మగపిల్లలు తమలో తాము ఊహించు కోవడం ,మాట్లాడాలనే ఆశ వున్నా ,మాట్లాడే సాహసం చేయలేకపోవ డం ,అమ్మాయే తనతో మాట్లాడాలని ,తనవంక చూడాలనీ ,తనవంక చూసి నవ్వాలని ,తాను ప్రేమిస్తున్నానని అనుకున్న అమ్మాయితో మరో అబ్బాయితో మాట్లాడితే సహించలేకపోవడం ,సాధారణంగా జరిగే ,లేదా కనిపించే సన్నివేశాలే . అదృష్ట దీపఙ్కగారు తన ‘ మలుపు ‘ కధలో ,సత్యమూర్తి అనే అబ్బాయి ,రాజ్యాలక్ష్మి అనే అమ్మాయిని వలచినప్పుడు ,అతని ఊహకు భిన్నంగా ఆ .. ప్రేమ కధ ఎలా మలుపు తిరిగిందో ,అతను పూర్వాపరాలు తెలుసుకోకుండా ఎలా పప్పులో కాలేసాడో ,స్వయంగా కద చదివితే తప్ప అవగతం కాదు ,ఆ కొసమెరుపు ఎలావుంటుందో తెలియదు . స్వర్గీయ శ్రీ అదృష్ట దీపక్ మంచి కవిగానూ ,సినీ గేయరచయితగాను చాలా మందికి తెలుసును గానీ ,కథా రచయితగా చాలా మందికి తెలియదు . ఆయన రాసిన ‘ అదృష్ట దీపక్ కధలు ‘ కావాలనుకునే వారు ,ఈ క్రింది మొబైల్ ఫోన్ తో వివరాలు పొందవచ్చును . చరవాణి :94405 28155 వెల::50/-రూపాయలు స్థిరవాణి : 08857 243070 స్వరాజ్యం ప్రచురణ రామచంద్రాపురం.