చెట్లే మన ప్రాణ దాతలు. బాలల లఘ నాటిక. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

చెట్లే మన ప్రాణ దాతలు. బాలల లఘ నాటిక.

చెట్లే మన ప్రాణదాతలు . ( బాలల లఘ నాటిక )

రంగ అలంకరణ : తరగతి గది, కుర్చిలో టీచర్ ,ఎదురుగా కొందరు పిల్లలు.గోడలకు ప్రముఖ స్వాతంత్య సమరయోధుల పోటోలు.

( తెర లేవడంతో ...)

టీచర్ : బాలలు ఈరోజు మీకు చెట్లవలన మానవాళికి కలిగే ప్రయోజనం తెలియజేస్తాను. మీకు పర్యావరణంపైన అవగాహన కలిగించాలి అనుకుంటున్నాను.పర్యావరణంపై ఎవరికైనా సందేహలు ఉంటే అడగవచ్చు.

విద్యార్ధి : పర్యవరణ పరిరక్షణ అంటే ఏమిటి?

టీచర్ : పర్యావరణ పరిరక్షణ అంటే మనల్నిమనం రక్షించుకోవడమే. నేడు మనం యింత ఎండలను భరిస్తున్నాము అంటే అదిమన స్వయంకృత అపరాధం విచక్షణారహితంగా చెట్లు నరకటం వలన ఈపరిస్ధితి ఏర్పడింది.

మనం నివసించే భూమిపై మూడు వంతులు చెట్లు ఉండేలా చూసుకోవాలి. అలాఉంటేనే సకల ప్రాణకోటికి క్షేమం.లేదంటే అంతా క్షామం. మనిషి తనఅవసరాలకు చెట్లను కొట్టడం వలన ప్రకృతి సమతుల్యత సన్నగిల్లింది.మనిషి ఒకరోజుకు 12 నుండి 15కిలోల ప్రాణవాయువును శ్వాసిస్తాడు.ప్రతిమనిషి ఒక రోజుకు మూడు ఆక్సిజన్ సలిండర్ల ఆక్సిజన్ పీలుస్తాడు, ఓకఆక్సిజన్ సిలిండర్ వెల 700/-అయితేమూడుసిలిండర్ల వెల 2100/-అవుతుంది. అంటే.ప్రతి సంవత్సరం ఆక్సిజన్ కోంటే 7,66,000/-కర్చు అవుతుంది.మనిషి సగటు ఆయుష్షు65సం" అనుకుంటే అతను ఆక్సిజన్ కొనడానికి దాదాపు రూ"5 కోట్లుకావాలి .

అలాగే మనవాహనాల్లో ఇంధనం మండటానికి కూడా ప్రాణవాయువు కావాలి. ఒక లీటర్ పెట్రొలు మండటానికి దాదాపు ముఫైకిలోల ప్రాణవాయువు అవసరం అవుతుంది.

విద్యార్ధి : మరి ఈప్రాణవాయువు మనకు ఉచితంగా ఎలాలభిస్తుంది.

టీచర్ : మనకు చెట్లవలన ప్రాణవాయువు ఉచితంగా లభిస్తుంది. యిలా మనకు ప్రాణదాతలైన చెట్లను మనం ప్రాణప్రదంగా పెంచాలి. చెట్టు పుట్టుక దాదాపు 41కోట్ల50లక్షల సంవత్సరాలుకుపూర్వం జరిగింది.భూమండలంపై రమారమి4,25,000 రకాల చెట్లు ఉన్నాయి. నేడు ప్రపంచం అంతటా నిమిషానికి 500 ఎకరాల అడవిక్పోతున్నాం, అడవులు నరకడం ద్వారాకాని, అగ్నిప్రమాదాల వలన ఇలా జరుగుతుంది.ఈభూభాగంపై33శాతం అడవి ఉండాలనే నిభంధన ప్రపంచం అంతటాఉంది.యిలా మనుషులు అడవులు నరకడం వలన వన్యప్రాణుల జీవనం కష్టతరంగామారింది . వాహనాలనుండి వెలువడే పొగ వాతావరణానికి ప్రమాదంగా మారింది. కర్మాగారాలనుండి వెలువడే

రసాయనాలు నదులలోని నీటిని కలుషితం చేస్తున్నాయి. మట్టికూడా అతి ఎరువుల వాడకంతో తన సహజత్వాని కోల్పోతుంది.మట్టికూడా పకృతి పరిరక్షణలో భాగమే .

 

 

 

 

 

విద్యార్ధి:మన దేశంలో ఏటా ఎంత అడవి తగ్గిపోతుంది.అలాగే ప్రకృతిలో మట్టి ఎలాభాగమౌతుంది.

టిచర్ : ప్రకృతి సిధ్ధంగా ఒకఅంగుళం మెత్తటి సారవంతమైన నేల రూపొందడానికి 300 నుండి 1000 ఏళ్ళు పడుతుంది.భారతదేశంలో ఏడాదికి 600 కోట్ల టన్నుల సారవంతమైన మట్టి సముద్రం పాలు అవుతుంది. దీన్నినివారించగలిగితే పంటలు దిగుబడి అధికం అవుతుంది. మనదేశంలో ఏటా దాదాపు 15లక్షల హెక్టార్ల అడవి నాశనం అవుతుంది. నేడు 33శాతం ఉండవలసిన అడవులశాతం 17 శాతానికి దిగిపోయింది అంటే మానవాళికి ఎంతటి ముప్పు పొంచిఉందో ఊహించండి.

విద్యార్ధి : ఇలా అడవులు తగ్గడంతో మనుషులకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుంది. అసలు చెట్లవలన లాభం ఉందా.

టీచర్ : ఈకారణంగా భూమిపై ఎడారి శాతం వేగంగా పెరుగుతుంది.నేడు మనం 45 దాకా ఎండ వుష్ణోగ్రతన చూస్తున్నాం ,ఈపరిస్ధితి ఇలాగే కొనసాగితే మరో పదేళ్ళకు మనం ఎంత తీవ్రమైన ఎండలు ఎదుర్కోనాలో ఊహించండి.

పూర్తిగా ఎదిగిన చెట్టు ప్రత్యక్షంగాకాని పరోక్షంగాకాని మనకు ఎన్నోలక్షల లాభాన్ని చేకూరుస్తుంది. ఒకచెట్టు సగటున 1500 కుపైగా విభిన్నజాతులకు చెందిన పక్షులకు ,కీటకాలు, సరీసృపాలు, పరాన్నజీవులు,క్షీరదాలు తదితరాదులకు జీవనాధారంగా నిలుస్తుంది. ఒకచెట్టు తన55ఏళ్ళజీవితకాలంలో 5.3 లక్షలవిలువైన ప్రాణవాయువు అందిస్తుంది.6.4 లక్షలవిలువైన భూసారాన్నికాపాడుతుంది.10.5 లక్షల విలువైలన గాలినిశుభ్రపరుస్తుంది.5.5 లక్షలవిలువైన పండ్లు. పూలు అందివ్వడమేకాకుండా పకృతిసమతుల్యతను కాపాడు తూ వాతావరణాన్ని తన పరిసరాలను అహ్లదపరుస్తుంది.వర్షంకురిసే సమయంలో చెట్టు గాలిలోని తేమను నియంత్రిస్తుంది.ఇలా చివరకు చెట్టు వంటచెరకుగానో కలపగానో మనకు వినియోగపడుతుంది. చెట్టుపైభాగమేకాకుండా దానివేర్లు భూమిలోనికి చొచ్చుకువెళ్ళి నేలకోతను అరికడతాయి.అలాభూమిలోసారత్వ పరిరక్షణ ఏర్పడుతుంది.

విద్యార్ధి : మొక్కలు ,చెట్లు పెంచడం ద్వారా పర్యావరణానికి సేవచేస్తూ మనం ఆదయం సమకూర్చుకోగలమా.

టీచర్ : చెట్లుపెంచడం ద్వారా పండ్లు,కూరగాయలు,తేనె,గింజలు, ఓౌషదాలు,లక్క,జిగురు,కుంకుళ్ళు వంటి వాటిని మనంపొందవచ్చు.సకాలంలో వర్షలు పడటానికి చెట్లు ఎంతో వినియోగపడతాయి.అలాసరైన సమయంలో వర్షలుపడితే పంటలు బాగాపండి ప్రజలు అందరు సుఖంగా ఉంటారు.పల్లెల్లో పాడి పంటలు బాగుంటే పల్లెప్రజలు పట్నాలకు వలసపోరు.యిలా ఎన్నో లాభాలు చెట్లుపెంచడంవలన ఉన్నాయి.మనిషి ఆర్ధికతను ఓవిధంగాచెట్లే నిర్ణయిస్తాయి.సుడిగాలిమొదలు సునామిలవరకు వచ్చే ఆపదలను నివారించేశక్తి చెట్లకుమాత్రమే ఉంది.రేపటి తరం భావిపౌరులుగా రాబోఏ ప్రమాదాన్ని నివారించే శక్తి మీచేతుల్లోఉంది.చక్కటి ఆరోగ్యకరమైన అహ్లదకర వాతావరణం ప్రకృతి మనకు ప్రసాదించింది. దాన్నికాపాడుకోవలసిన బాధ్యత అవసరం నేడు మనఅందరిపైన ఉంది.కనుక బాలలు వీలైనన్ని చెట్లునాటి చక్కగా వాటికి మన స్వాతంత్యస మరయోధుల పేర్లోలేక మీపెద్దల ,మిత్రుల,మీకు యిష్టమైన వారి పేర్లుపెట్టి పెంచండి.ఎవరైనా చెట్లు నరుకుతుంటే వారికి చెట్లవిలువ తెలియజేయండి.మన ఇంట జరిగే ప్రతి కార్యక్రమానికి ఓచెట్టు నాటి పెంచి,భవిష్యత్తులో మనబిడ్డలు ఆఫలాలు ఆరగించేలా చేయండి.నాడు-నేడు-ఏనాడు చెట్లు మనప్రాణదాతలేఅని మరువద్దు" నేడు దేశభవిష్యత్తు మీరుతీసుకునే నిర్ణయంపై ఆధార పడిఉంది." "అలాగే టీచర్ ఇంటింటామొక్క-ఊరూరవనం తప్పకచేపడతాం మావంతుగాప్రకృతి పరిరక్షణకు నిలబడతాం చెట్లను విరివిగా పెంచుతాం"అన్నారు పిల్లలంతా ముక్తకంఠంతో.

( తెర దిగుతుంది )

డా. బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .

9884429899

మరిన్ని వ్యాసాలు

పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి
కల్యాణ వైభవం.
కల్యాణ వైభవం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Sri Sai Leelamrutham
శ్రీ సాయి లీలామృతం
- సి.హెచ్.ప్రతాప్