మన సినిమాల్లో దెయ్యాల గీతాలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

మన సినిమాల్లో దెయ్యాల గీతాలు. సినిమాల్లో దెయ్యాలు పాటలు . శాస్త్రీయంగా నిరూపింపబడకపోయినప్పటికి దెయ్యం భూతం, పిచాశం,రాక్షసుడు వంటి పలు పాత్రలు మన జానపద, పౌరాణిక, సాంఘీక సినిమాల్లో మనం బాల్యంనుండి చూస్తూనే ఉన్నాం. ఈజానపద, పౌరాణిక సినమాల్లో మాయలు ,మంత్రాలకు కొదవే లేదు. ప్రేక్షకులుకూడా వీటి పట్ల బాగా ఆకర్షితులు అయ్యేవారు. ఇక్కడ మనం చెప్పుకోబోయే విషయం ఏమిటంటే సాంఘీక చిత్రాలలో కూడా ఈదెయ్యాల పాత్రలు ఏదోఒకవిధంగా ప్రవేశపెట్టారు మన సినిమా వాళ్ళు. నాణానికి రెండు ముఖాలు ఉన్నట్లే సినిమాకి రెండు ముఖాలు ఉంటాయి.మొదట ముఖం సినిమా వ్యాపారమే ! రొండో ముఖం కళాసేవగా మనం అనుకోవచ్చు.

అశాస్త్రీయం అనీ తెలిసికూడా వారు సినిమాల్లో దెయ్యాల పాత్రలను ప్రవేశ పెట్టారు, వాటిని భారతీయ సినీ ప్రేక్షకులు ఆదరించారు.

చనిపోయిన వ్యక్తిని పోలినవి. దెయ్యాలు వాటికి సంబంధించిన, చనిపోయిన ప్రదేశాలలో కనిపిస్తాయి లేదా వానికి సంబంధించిన వ్యక్తులకు కనిపిస్తాయి. దెయ్యాలు చనిపోయిన వ్యక్తుల ఆత్మలకు సంబంధించినవిగా కూడా భావిస్తారు. ఇవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్ని హాంటెడ్ (Haunted) ప్రదేశాలు అంటారు. ఇవి కొన్ని వస్తువుల్ని ప్రేరేపిస్తాయి; కానీ ఇలాంటివి ఎక్కువగా యువతులలో కనిపించే మానసిక ప్రవృత్తికి సంబంధిచిన విషయాలుగా కొందరు భావిస్తారు. దెయ్యపు సైన్యాలు, జంతువులు, రైళ్ళు, ఓడలు కూడా ప్రచురించబడ్డాయి.

అయితే దెయ్యాలు ఉన్నది లేనిదీ చాలా సంధిగ్ధంగా ఉన్నాయి. ఇవి ఉన్నాయని నమ్మేవాళ్ళు, నమ్మనివాళ్ళూ ప్రపంచమంతా ఉన్నారు. దెయ్యాల గురించి ప్రాచీనకాలం నుంచి నమ్మకాలు బలంగా నాటుకున్నాయి. అయితే 19వ శతాబ్దంలో మానసిక శాస్త్ర పరిశోధనలు కూడా జరిగాయి. దీనికి సంబంధించిన భూత వైద్యులు దెయ్యాల్ని వదిలించడానికి ప్రయత్నించి సఫలీకృతులయ్యారు. హేతువాదులు దెయ్యాల ఉనికిని నమ్మరు. కొన్ని కారణం తెలియని విషయాలకు దెయ్యాలుగా ప్రచారం చేస్తారని వీరు భావిస్తారు. అయితే ప్రపంచవ్యాప్తంగా రెండింటికీ కూడా బలమైన నిరుపణలు లేవు. అమెరికాలో 2005 సంవత్సరంలో జరిపిన సర్వే ప్రకారం సుమారు 32% మంది దెయ్యాలు ఉన్నాయని నమ్మారు.

హిందూ మతంలో చాలా మంది దెయ్యాలని నమ్ముతారు. కొంతమంది దెయ్యాలను నమ్మరు అలాగే దేవుడిని కూడా నమ్మరు. కొంతమంది దెయ్యాలు వుంటే దేవుడు కూడా ఉంటాడని, లేకపోతే దేవుడు వుంటే దెయ్యాలు కూడా ఉంటాయని నమ్ముతారు. సదా దేవుడు దెయ్యాల నుంచి రక్షిస్తూ ఉంటాడని నమ్ముతారు.

ఏదైనా ఒక మంచి పనిచేస్తున్నపుడు దుష్టశక్తులు అడ్డుకుంటూ ఉంటాయని నమ్ముతారు, ఇక్కడ దుష్ట శక్తులు అంటే దెయ్యాలే. అసలు ఇంతకి దెయ్యాలు ఉంటాయా అన్న ప్రశ్నకి మాత్రం ఇప్పటిదాకా కచ్చితమైన సమాధానం లేదు. ఎవైన కొన్ని వింత విషయాలు చెడ్డవి జరిగితే అది దెయ్యాల ప్రభావమేనని నమ్ముతారు. కానీ కొన్ని విషయాలను శాస్త్రవేత్తలు ప్రయోగపూర్వకంగా నిరూపించిన సంఘటనలు కూడా కొన్ని సమయాలలో చోటు చేసుకున్నాయి. కొన్ని పల్లెటూర్లలోని ప్రజలు దయ్యం తమతో ప్రవర్తించిన తీరును చెప్తుంటారు. దేవ ఘడియలో జన్మించిన వారికి దయ్యం కనిపిస్తుందని ప్రజల్లో ఒక అభిప్రాయం ఉంది. ఎవరైనా ఆయుష్షు తీరకుండా చనిపోతే దయ్యలై తిరుగుతూ ఉంటారని నమ్ముతారు. అలాగే ఎవరైనా కోరికలు తీరకుండా చనిపోయినా కూడా వారి ఆత్మ దెయ్యం రూపంలో తిరుగుతుందని చెప్తారు కానీ హిందూ పురాణాల ప్రకారం ఎవరైనా చనిపోతే ఒక సంవత్సరం పాటు వారి ఆత్మకు శాంతి ఉండదని ఆ సంవత్సరం కాలం పాటు ఆత్మ ఘోషిస్తూ ఉంటుందని పండితులు చెప్తారు.

మన సినిమాల్లో దెయ్యం పాత్రలకు జోడించిన కొన్నిపాటలు వివరంగా తెలుసుకుందాం!

ఈదెయ్యాల పాటలకు ప్రాణం పోసేది దర్శక, కెమెరామాన్ అనుకోవచ్చు. ఉదాహరణకు అంతస్తులు చిత్రంలో పాట చిత్రికరణ గుమ్మడి గారి నటనకు మనం బాగా ఆకర్షితులం ఔతాము.

1965.లోవిడుదలైన అంతస్తులు చిత్రంలో 'నిను వీడని నీడను నేనే ' గీతం ఆత్రేయ గారు రాయగా,కె.వి..మహదేవన్ స్వరపరచారు,పి.సుసీల ఆలపించారు.

1965.లో విడుదలైన తోడు నీడ చిత్రంలో ' ఎందులకీ కన్నిరు ఎందుకిలా ఉన్నారు ' గీతం ఆత్రేయ రాయగా,కే.వి. మహదేవన్ స్వరపరచారు, పి.సుసీల ఆలపించారు.

1966 లో విడుదలైన ఆమె ఎవరు? చిత్రంలో ' ఓనారాజా రావా రావా ' దాశరధి గీతానికి,వేదా స్వరపరిచారు. పి.సుసీల ఆలపించారు.

1974 లో విడుదలైన గుండెలు తీసిన మొనగాడు చిత్రంలో ' ఈజ్వాల ఆరేది కాదు ' పాట యస్ .జానకి పాడగా, సత్యం స్వరపరిచారు.

1979 లో విడుదలైన వేటగాడు చిత్రంలో ' ఇది పువ్వులు పూయని తోట ' వేటూరి గీతాన్ని,చక్రవర్తి స్వరపరిచారు.

ఇలా పలుగీతాలు ,పలుభాషల్లో భారతీయ సినీ ప్రేక్షకుల మన్ననలు పొందాయి.

సేకరణ : బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .

9884429899