కృష్ణణ్ - పంజు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

కృష్ణణ్ - పంజు .

ఆర్.కృష్ణన్ (1909–1997), ఎస్.పంజు . మనకీర్తిశిఖరాలు .
(1915–1984), జంటగా కృష్ణన్ - పంజు పేరుతో పిలువబడే భారతీయ సినిమా దర్శకులు. ఈ జంట హిందీ, దక్షిణ భారతీయ భాషలలో 50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.
ఆర్.కృష్ణన్ తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై పట్టణంలో 1909, జూలై 18న జన్మించాడు. మొదట్లో ఇతడు కోయంబత్తూరులోని పక్షిరాజా స్టూడియో (అప్పట్లో కందన్ స్టూడియోగా పిలువబడేది) లో లాబొరేటరీ ఇన్‌ఛార్జిగా పనిచేశాడు. ఇతని కుమారుడు కె.సుభాష్ కూడా చలనచిత్ర దర్శకుడుగా పనిచేశాడు.
ఎస్.పంజు అసలు పేరు పంచాపకేశన్. ఇతడు కుంభకోణం సమీపంలోణి ఉమయాల్ పురంలో 1915, జనవరి 24న జన్మించాడు. ఇతడు దర్శకుడిగా మారడానికి పూర్వం పి.కె.రాజాశాండో వద్ద సహాయ ఎడిటర్‌గా, ఎల్లిస్ ఆర్. దంగన్ వద్ద సహాయ దర్శకునిగా పనిచేశాడు. ఇతడు పంజాబి పేరుతో కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా పనిచేశాడు.
వీరిరువురూ కందన్ స్టూడియోలో పి.కె.రాజా శాండో దర్శకత్వం వహించిన మనునీధి చోళన్ (1942) అనే తమిళ సినిమాలో పనిచేశారు. ఆ సమయంలో వీరిరువురూ మంచి మిత్రులుగా మారారు. వీరి పనితనాన్ని గమనించి రాజాశాండో తన తరువాతి ప్రాజెక్టు పూంపావై వీరికి ఆప్పజెప్పాడు. ఆ విధంగా పూంపావై (1944) దర్శకులుగా ఈ జంట మొదటి చిత్రం అయ్యింది. 1947లో ఈ జంట పైతియక్కరన్ అనే సినిమాకు దర్శకులుగా పనిచేశారు. 1949లో వీరు మిష్టర్ డీడ్స్ గోస్ టు టౌన్ అనే అమెరికన్ రొమాంటిక్ కామెడీ సినిమా ప్రేరణతో నల్లతంబి అనే సినిమాను తీశారు. ఆ సినిమాకు సి.ఎన్.అన్నాదురై స్క్రిప్ట్ వ్రాశాడు. ఇది అతని మొదటి సినిమా. తరువాతి కాలంలో ఇతడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1952లో వీరు దర్శకత్వం వహించిన పరాశక్తి సినిమాకు తమిళనాడుకు మరో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎం.కరుణానిధి సంభాషణలు వ్రాశాడు. వీరు భాభీ, షాదీ వంటి హిందీ సినిమాలు కుడా దర్శకత్వం వహించారు. వీరికి 1960లో కలైమామణి పురస్కారం లభించింది.
1984, ఏప్రిల్ 6వ తేదీన ఎస్.పంజు చెన్నైలో మరణించాడు. పంజు మరణం తర్వాత కృష్ణన్ ఏ సినిమాను తీయలేదు. అతడు 1997, జూలై 15వ తేదీన మరణించాడు.
ఫిల్మోగ్రఫీ.
సంవత్సరం సినిమా పేరు భాష బ్యానర్ మూలం
1944 పూంపావై తమిళ
లియో పిక్చర్స్
1947 పైతియక్కరన్ తమిళ ఎన్.ఎస్.కె.పిక్చర్స్
1949 నల్లతంబి తమిళ ఎన్.ఎస్.కె.ఫిలింస్ & ఉమా పిక్చర్స్
1949 రత్త్నకుమార్ తమిళ మురుగన్ టాకీస్
1952 పరాశక్తి
తమిళ నేషనల్ పిక్చర్స్
1953 కణగల్ తమిళ మోషన్ పిక్చర్స్ టీమ్
1954 రక్త కన్నీర్
తమిళ నేషనల్ పిక్చర్స్
1955 శాంతసక్కు కన్నడ
శ్రీ పాండురంగ ప్రొడక్షన్స్
1956 కులదైవమ్ తమిళ ఎస్.కె.పిక్చర్స్
1957 పుదైయల్ తమిళ కమల్ బ్రదర్స్
1957 భాభీ హిందీ
ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1958 మామియర్ మెచ్చిన మారుమగళ్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1959 బర్ఖా హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1960 తిలకమ్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1960 దైవపిరవి
తమిళ కమల్ బ్రదర్స్
1960 బిందియా హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1961 సుహాగ్ సిందూర్ హిందీ
1962 షాదీ హిందీ
1962 మన్-మౌజి హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1962 అన్నై
తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1963 కుంకుమమ్ తమిళ రాజమణి పిక్చర్స్
1964 వళ్కై వళ్వతర్కె తమిళ కమల్ బ్రదర్స్
1964 సర్వర్ సుందరం
తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1964 మేరే కసూర్ క్యా హై హిందీ
1965 కుళందయం దైవమమ్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1966 పెట్రల్తాన్ పిళ్ళైయ
తమిళ ఎమ్జీయార్ పిక్చర్స్
1966 లేత మనసులు
తెలుగు ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1966 లాడ్‌లా హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1968 దో కలియాఁ హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1968 వుయరంద మనిధన్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1969 అన్నయుం పితవమ్ తమిళ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1970 ఎంగల్ తంగమ్ తమిళ మేకల పిక్చర్స్
1970 అనాదై ఆనందన్ తమిళ ముత్తువేల్ మూవీస్
1971 మై సుందర్ హూఁ హిందీ ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1971 రంగరత్తినం తమిళ ఎస్.జె.ఫిలింస్
1972 పిళ్లైయొ పిళై తమిళ మేకల పిక్చర్స్
1972 ఇదయ వీణై తమిళ ఉదయం ప్రొడక్షన్స్
1972 అక్కా తమ్ముడు
తెలుగు
ఏ.వి.యం. ప్రొడక్షన్స్
1974 సమయల్‌కరన్ తమిళ మెరీనా మూవీస్
1974 షాన్‌దార్ హిందీ
1974 పత్తు మాద బంధం తమిళ శ్రీ నవనీత ఫిలింస్
1974 కలియుగ కన్నన్ తమిళ అజంతా ఎంటర్‌ప్రైజస్
1975 వాళంతు కాత్తుగిరెన్ తమిళ ఎస్.ఎస్.కె.ఫిలింస్
1975 కాశ్మీరు బుల్లోడు
తెలుగు
1975 అనయ విలక్కు తమిళ అంజుగం పిక్చర్స్
1976 వళ్వు ఏన్ పక్కం తమిళ ఎస్.ఎస్.కె.ఫిలింస్
1977 సొన్నతాయ్ సీవెన్ తమిళ
1977 ఇలయ తలైమురై తమిళ యోగచిత్ర ప్రొడక్షన్స్
1977 ఎన్న తావం సీతన్ తమిళ నలందా మూవీస్
1977 చక్రవర్తి తమిళ పి.వి.టి ప్రొడక్షన్స్
1978 పేర్ సొల్ల ఒరు పిల్లై తమిళ వాణి చిత్ర ప్రొడక్షన్స్
1978 అన్నపూర్ణి తమిళ విజయాంబిక ఫిలింస్
1979 వెల్లి రథం తమిళ అష్టలక్ష్మీ పిక్చర్స్
1979 నీల మలర్గల్ తమిళ శబరి సినీ క్రియేషన్స్
1979 నాదగమె ఉళగమ్ తమిళ విజయాంబిక ఫిలింస్
1980 మంగళ నాయగి తమిళ జె.సి.చౌదరి ఆర్ట్స్
1986 మలారం నినైవుగళ్ తమిళ మీనాక్షి ఫిలింస్

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Failure
వ్యాసావధానం - ఫెయిల్యూర్
- రవిశంకర్ అవధానం
సిని నారదులు.15.
సిని నారదులు.15.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన సినీనారదులు14.
మన సినీనారదులు14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.13.
సిని నారదులు.13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Vyasaavadhanam - Kalachakram
వ్యాసావధానం - కాల చక్రం
- రవిశంకర్ అవధానం