డప్పు గీతాలు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

డప్పు గీతాలు.

డప్పు గీతాలు. ప్రతి పండుకు ఒకరుచి ఉన్నట్లే ,ప్రతి సంగీత వాద్యానికి మధురమైన ధ్వని ఉంటుంది.

దాన్ని ఆస్వాదించగలిగినవారు తన్మయానందం పొందుతారు. సహజంగా మనసుకు ఇష్టమైన సంగీతం,గానం మనకు వినీపించగానే మనకుతెలియకుండా తల, కాళ్ళు ఊపుతుంటాం మరికొందరు ఆపాటకు తమగొంతుకను జోడిస్తారు.

నేటికి గ్రామాలలో దండోరా వేయాలంటే డప్పుదే ప్రముఖ పాత్ర.

డప్పు అనేది ఒక రమైన సంగీత వాద్యం. దీనిని కొన్ని ప్రాంతాలలో పలక ,తప్పెట అని కూడ అంటారు. డక్కి లాంటి ఆకారమె కలిగి వుంటుంది. కాని పెద్దది. రెండడుగులు వ్యాసం కలిగి వుంటుండి.పూర్వం ఏ శుభకార్యం జరిగినా డప్పు వాయించేవారు. లకు వాయిస్తారు. కొన్ని సందర్భాలలో అమ్మవారి జాతరలలో కూడా వాయిస్తారు. అదేవిదంగా దండోరా వేయడానికి పల్లెల్లో దీనిని గతంలో ఎక్కువగా వాడేవారు. ఈ డప్పును పూర్వకాలంలో మాదిగ కులస్తులు ఎక్కువగా వాయించేవారు. వారు జంతువుల చర్మాలతో ఈ డప్పును తయారుచేసేవారు. "పెళ్లైనా, చావైనా డప్పుదెబ్బ పడాల్సిందే" అనే నానుడి గ్రామాలలో ఉంది. చిందు భాగవతము లో డప్పు వాయిద్యాన్ని ఉపయోగిస్తారు. ఆదిమానవుడు వంటరి గా అడవిలో ఉన్నపుడు తన ఉనికిని మరొకరికి తెలియజేయడానికి, క్రూర జంతువులను లేదా తాను వేటాడదలుచుకున్న జంతువులను భయ పెట్టడానికి కాని, అందరు ఒకచోట చేరడానికి సంకేతంగా కాని, ప్రమాద హెచ్చరిక చేయడానికి గాని డప్పును ఉపయోగించుకున్నారు.

చింత లేదా వేప చెట్టు చెక్కతో వృత్తాకార ఫ్రేం తయారు చేస్తారు. దీణిని తెలంగాణలో "గుండు" అనీ, ఆంధ్రప్రదేశ్ లో "పలక" అని అంటారు. ఈ ప్రేం కు టాంజరిన్ కలపతో శుద్ధి చేయబడిన బంతువుల చర్మాన్ని బిగుతుగా కట్టి ఉంచుతారు. ఈ చర్మం చెక్క చట్రానికి అతికించడానికి జిగురును వాడుతారు. ఈ జిగురును చింతపిక్కల నుండి తయారుచేస్తారు. చట్రానికి చర్మాన్ని బిగుతుగా అతికించి సన్నని దారంతో బింగించి కడతారు. తరువాత చర్మంతో తయారుచేసిన డప్పును మంట వద్ద వేడిచేస్తారు. దీనివల్ల చర్మం బిగుతుగా మారుతుంది. ఈ డప్పును రెండు కర్రలతో వాయిస్తారు. అందులో లావుగా, పొట్టిగా ఉన్న కర్రను కుడి చేతితో పట్టుకుంటారు. దీణిని సిర్రా అంటారు. ఇది డప్పులో క్రింది వైపు కొట్టడానికి వాడుతారు. సన్నగా, పొడవుగా ఉన్న కర్ర "సిట్టికెన్న పుల్ల" ను ఎడమ చేతితో పట్టుకుంటారు. దీనిని డప్పుపై పై భాగంగా వాయించడానికి ఉపయోగిస్తారు. అందులో "సిర్రా" లయను సృష్టించగా, "సిటికెన్న పుల్ల" లయ వేగాన్ని నియంత్రిస్తుంది.

నృత్యంలో మాంచి ఊపును అందించే కొన్ని డప్పు గీతాలు తెలుసుకుందాం...

' ఏరువాక సాగారోరన్నో ' రోజులు మారాయి.(1955)

' చిన్నకత్తి పెద్దకత్తి నాదేనయా ' హరిశ్చంద్ర . ( 1956) ' యమునాతీరమున ' జయభేరి.(1959) ' ఉందిలే మంచికాలం ' రాముడు భీముడు. (1964) ' ముద్దబంతి పూవులో 'ముగమనసులు. (1964) ' కులము ఏముందిరా సోదరా ' హరిశ్చంద్ర. (1965) ' ఎర్రబుగ్గల మీద మనసైతే ' గుఢాచారి 116. (1966) ' ఆడవే అడవే గుర్రమా ' భూలోకంలో యమలోకం . (1966) ' వెన్నెవేళ ' రంగులరాట్నం (1967) ' వానకాదు వానకాదు వరదరాజా 'భాగ్యచక్రం (1968) వినవయ్య రామయ్య' కథానాయకుడు . (1969) ' ఝుంమ్మంది నాదం ' సిరిసిరి మువ్వ . (1976) '

సేకరణ:

 

మరిన్ని వ్యాసాలు

పిల్లనగ్రోవి పిలుపు...
పిల్లనగ్రోవి పిలుపు...
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మన  సినిమాల్లో నారద పాత్రధారులు .
మన సినిమాల్లో నారద పాత్రధారులు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Neti telangana lo desi chandassu ki adyudu
నేటి తెలంగాణ లో దేశీ ఛందస్సుకు ఆద్యుడు
- డాక్టర్ ఎల్మల రంజిత్ కుమార్
అశ్వతి
అశ్వతి
- డాక్టర్ వై వి కె రవికుమార్