పిల్లనగ్రోవి పిలుపు... - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

పిల్లనగ్రోవి పిలుపు...

పిల్లనగ్రోవి పిలుపు...

వేణువు, మురళి లేదా పిల్లనగ్రోవి ఒకరకమైన సంగీత వాయిద్యము. ఇంగ్లీషులో దీన్ని ఫ్లూట్ అంటారు. ఇది కర్ణాటక, హిందూస్థానీ సంగీతాలలో ఉపయోగించే వాద్యపరికరం. బాగా ఆరబెట్టిన వెదురుతో తయారు చేస్తారు. ఊదేందుకు పీకలాంటివి ఉండని వాద్యపరికరం ఇది. ఈ వెదురు గొట్టాన్ని ఒకవైపు తేరిచి మరొక వైపు మూసి ఉంచుతారు. పై బాగాన గాలి ఊదేందుకు రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రంతో పాటు స్వరాల మార్పుకొరకు, వేళ్ళతో మూసి తెరిచేందుకు కొన్నిట్లో మూడు మరికొన్నిట్లో ఎనిమిది రంద్రాలు కలిగి ఉంటాయి.

భారతీయ శాస్త్రీయ సంగీతంలో వెదురు వేణువు ఒక ముఖ్యమైన పరికరం. ఇది పాశ్చాత్య వేణువు కంటే భిన్నంగా, స్వతంత్రంగా అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణుడిని సాంప్రదాయకంగా వేణుగాన లోలుడని అంటారు. పాశ్చాత్య వేణువులతో పోలిస్తే భారతీయ వేణువులు చాలా సరళమైనవి. అవి వెదురుతో తయారవుతాయి. వాటిని ట్యూణు చేసేందుకు చెవులేమీ ఉండవు. భారతీయ వేణువులలో రెండు ప్రధాన రకాలు ప్రస్తుతం ఉపయోగంలో ఉన్నాయి. మొదటిది, బాస్సురి. దీనిలో వేళ్ళ కోసం 6 రంధ్రాలు, ఒక ఊదే రంధ్రం ఉంటాయి. దీనిని ప్రధానంగా ఉత్తర భారతదేశంలోని హిందూస్థానీ సంగీతంలో ఉపయోగిస్తారు. రెండవది, వేణువు లేదా పిల్లనగ్రోవి. దీనికి ఎనిమిది వేళ్ళ రంధ్రాలుంటాయి. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక సంగీతంలో ప్రధానంగా దీన్ని వాయిస్తారు. ప్రస్తుతం, క్రాస్-ఫింగరింగ్ టెక్నిక్‌తో ఎనిమిది రంధ్రాల వేణువు కర్ణాటక ఫ్లూటిస్టులలో చాలా సాధారణం. దీనికి ముందు, దక్షిణ భారత వేణువుకు ఏడు రంధ్రాలు మాత్రమే ఉండేవి. 20 వ శతాబ్దం ప్రారంభంలో పల్లడం శైలికి చెందిన శరభశాస్త్రి అభివృద్ధి చేసిన వేళ్ళ రంధ్రాల ప్రమాణంతో ఇవి ఉంటాయి వేణువు వెలువరించే శబ్ద నాణ్యత దానిని తయారు చేయడానికి ఉపయోగించే వెదురుపై కొంతవరకు ఆధారపడి ఉంటుంది. దక్షిణ భారతదేశంలోని నాగర్‌కోయిల్ ప్రాంతంలో ఉత్తమ వెదురు పెరుగుతుంది. భారతీయ నాట్య శాస్త్ర శరణ చతుష్టాయ్ ఆధారంగా, అవినాష్ బాలకృష్ణ పట్వర్ధన్ 1998 లో భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రస్తుతం ఉన్న పది 'థాట్స్' కోసం కచ్చితంగా ట్యూన్ చేసిన వేణువులను ఉత్పత్తి చేసే పద్ధతిని అభివృద్ధి చేశాడు. గుజరాతీలో పావో అని అంటారు. కొంతమంది ఒకేసారి రెండు వేణువులను (జోడియో పావో) వాయిస్తారు.

ఇటువంటి అహ్లదకరమైన ఈసంగీత వాద్యాన్ని మనసంగీత దర్శకులు, సినిమా కవులు మనసినిమాల్లో దీనికి సముచిత స్ధానం కలిగించిన కొన్ని పాటలు తెలుసుకుందాం .

' పిల్లనగ్రోవి పిలుపు ' శ్రీకృష్ణ విజయం (1971) ' వేయి వేణువులు మ్రోగేటి వేళ ' బుద్దిమంతుడు. (1969) ' వేణుగానమ్ము వినిపించెనే ' మురళి కృష్ణ . (1964) ' ఇకవాయించకొయి మురళి ' వీరకంకణం.(1957) వ్రెపల్లెయద ఝల్లున ' సప్తపది. (1981) ' నీమధు మురళీ ' భక్త జయదేవ్ .(1961) ' రేపల్లె వేచెను వేణువు వేచను ' శారదా.(1973) ' వేణుగాన లోలునిగన ' రెండు కుటుంబాల కథ.(1970) ' ఒక వేణువు వినిపించెను ' అమెరికా అమ్మాయి.(1976) ' మనసే అందాలబృందావనం ' మంచికుటుంబం .(1968) ' ఈపిల్లనగ్రోవి వెలఎంత ' మొరటోడు. (1977) ' తీయని వేణువు ' చింతామణి .(1956) ' మురళి గానమిదేనా ' సంతానం.(1955) ' వీణ వేణువైన ' ఇంటింటి రామాయణం ' (1979) .

ఇటువంటి వేణుగాన మాధుర్యాల వానలో అందరము తడిసి మురిసినవారలమే!!!

బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .

9884429899

 

మరిన్ని వ్యాసాలు