మన సినిమాల్లో నారద పాత్రధారులు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

మన  సినిమాల్లో నారద పాత్రధారులు .

మన సినిమాల్లొ నారద పాత్రధారులు.

మన పురాణాల్లొ చదువుల తల్లిగా భావించే సరస్వతి వీణ పేరు 'కచ్చపి'

గంధర్వ గాయకుడైన తుంబురుని వీణ పేరు ' కళావతి '

ముల్లోకాలు తిరుగుతురుగాడే నారద మహర్షి వేణపేరు ' మహతి ' నారదుని పాత్ర ధరించిన సిని కళాకారుల గురించి తెలుసుకుందాం!

* 1931/ జనవరి /31 .న విడుదలైన శోభనాచలా పిక్చర్స్ వారి ' భక్త ప్రహ్లద ' చిత్రంలో టి.రామకృష్ణ శాస్త్రి నారద పాత్ర ధరించారు.

* 1967/ జనవరి /14 .న విడుదలైన ఏ.వి.యం.వారి భక్త ప్రహ్లాద ' చిత్రంలో నారదుని పాత్ర మంగళంపల్లి బాలమురళి కృష్ఞ ధరించారు.

* మూడు పర్యాయాలు నిర్మించబడిన' సతీ సావిత్రి ' లొ వరలక్ష్మి బేనర్ పై 12/1/1957.విడుదలైన చిత్రంలో పువ్వుల సూరిబాబు నారద పాత్ర ధరించారు.

* 4/1/1978 .న విడుదలైన ' సతీ సావిత్రి ' లో కాంతారావు నారద పాత్ర ధరించారు.

* 16/11/1935. న విడుదలైన షాలిని సిని టోన్ వారి 'హరిశ్చంద్ర ' చిత్రంలో ఆకుల నరసింహరావు నారద పాత్ర ధరించారు.

 

* 1975 లో విడుదలైన ' యశోద కృష్ణా ' చిత్రంలో ' చంద్రమోహన్ 'నారదపాత్ర ధరించారు.

 

* 12/4/1935 న విడుదలైన కాళీ ఫిలింస్ వారి ' శ్రీకృష్ణ తులాభారము ' ఈ చిత్రంలో కపిలవాయి రామనాథ శాస్త్రి నారదునిగా నటించారు.

* 3/12/1955 న విడుదలైన శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెని వారి

' శ్రీకృష్ణ తులాభారం ' చిత్రంలో పువ్వుల సూరిబాబు నారదుని పాత్ర ధరించారు.

* 25 /8/1966 న విడుదలైన సురేష్ ప్రోడక్షన్స్ వారి 'శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో కాంతరావు నారదుని పాత్ర ధరించాడు.

* 6/7/1935 న విడుదలైన రాధా ఫిలిం కంపెని వారి 'భక్త కుచేల ' చిత్రంలో పులిపాక వెంకటప్పయ్య నారదుని పాత్ర ధరించారు.

* 4/10/1935 న విడుదలైన ' ఆరోరా ఫిలిం కార్పోరేషన్ వారి ' సతీ అనసూయ ' చిత్రంలో తుంగల చలపతి రావు నారద పాత్ర ధరించారు.

* 8/5/1936 న విడుదలైన ఈస్టిండియా ఫిలిం కంపెని వారి ' సతీ అనసూయ 'చిత్రంలో సూర్యనారాయణ నారదుడిగా నటించారు.

* 25/10/1957 న విడుదలైన రాజశ్రీ ప్రొడక్షన్స్ వారి 'సతీ అనసూయ 'చిత్రంలో పద్మనాభం నారదుడిగా నటించాడు.

* 4/6/1971 న విడుదలైన శ్రీకాంత్ అండ్ శ్రీకాంత్ ఎంటర్ ప్రైజెస్ వారి ' సతీ అనససూయ ' చిత్రంలో నారదుని పాత్ర శోభన్ బాబు ధరించారు.

* 7/3/1959 న విడుదలైన సుజనా ఫిలిమ్స్ వారి 'సతీ తులసి ' చిత్రంలో పద్మనాభం నారద పాత్ర పోషించారు.

* 1937 లో విడుదలైన నేషనల్ మూవిటోన్ వారి 'మోహినీ రుక్మాంగద ' చిత్రంలో పరబ్రహ్మ శాస్త్రి నారదుడుగా నటించాడు.

* 13/1/1962 న విడుదలైన భాస్కర్ ప్రొడక్షన్స్ వారి 'మోహినీ రుక్మాంగద ' చిత్రంలో కాంతారావు నారదుడిగా కనిపిస్తారు.

* 17/6/1938 న విడుదలైన కుబేరా ఫిలిమ్స్ వారి 'భక్త మార్కండేయ ' చిత్రంలో టి. రామకృష్ణ శాస్త్రి . నారద పాత్ర పోషించారు.

* 1956 లో విడుదలైన విక్రమ్ ప్రొడక్షన్స్ వారి 'భక్త మార్కండేయ ' చిత్రంలో రఘరామయ్య నారదుని పాత్రలో కనిపిస్తారు,

* 1982) విడుదలైన భరణి పిక్చెర్స్ వారి బాలల 'భక్తధృవ మార్కండేయ 'చిత్రంలో బాల నారదుడిగా మాస్టర్ సాయి కుమార్ నటించారు.

* 4/3/1978 న విడుదలైన ఫెమస్ ఫిలిమ్స్ వారి ' వెంకటేశ్వర మహత్యం 'చిత్రంలో మద్దూరి బుచ్చన్న శాస్త్రి నారదుని పాత్రధరించాడు.

* 9/1/1960 న విడుదలైన పద్మశ్రీ పిక్చెర్స్ వారి 'శ్రీ వెంకటేశ్వర మహత్యం ' చిత్రంలో పువ్వుల సూరిబాబు నారదునిగా కనిపిస్తారు.

* భీష్మ చిత్రంలో రేలంగి నారదుని పాత్రలో కనిపిస్తారు.

* జయంతి వారి ' శ్రీకృష్ణార్జున యుధ్ధం ' చిత్రం లో నారదుడుగా కాంతారావు కనిపిస్తారు.

* 28/10/1979 న విడుదలైన రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి

'శ్రీ తిరుపతి వెంకటేశ్వర కల్యాణం ' చిత్రంలో నారదుడుగా నందమూరి బాలకృష్ణ కనిపిస్తారు.

* 14/12/1940 .న విడుదలైన సరస్వతి సిని ఫిలింస్ వారి

' భూకైలలాస్ ' చిత్రంలో ఆర్ .నాగేంద్రరావు నారదుడిగా కనిపిస్తారు.

* 20/3/1958న విడుదలైన ఏ.వి.యం వారి ' భూకైలాస్ 'చిత్రంలో అక్కినేని నారదుడుగా కనిపిస్తారు.

* 10/1/1941న విడుదలైన ప్రతిభా పిక్చెర్స్ వారి 'పార్వతి కల్యాణం ' చిత్రంలో పారుపల్లి సత్యనారాయణ నారదుడుగా నటించారు.

* 26/12/1962 న విడుదలైన భాస్కర్ ప్రేడక్షన్స్ వారి 'పార్వతి కల్యాణం ' చిత్రంలో రమణారెడ్డి నారదుని పాత్రలో కనిపిస్తారు.

* 1/5/1941 న విడుదలైన శోభనాచల పిక్చర్స్ వారి ' దక్షయజ్ఞం '

చిత్రంలో రామకృష్ణ శాస్త్రి నారదుడుగా కనిపిస్తారు.

* 10/5/1962 న విడుదలైన వరలక్ష్శిపిక్చెర్స్ వారి దక్షయజ్ఞం ' చిత్రంలో రఘరామయ్య నారదుడుగా కనిపిస్తారు.

* 27/3/1943 న విడుదలైన ఫేమస్ ఫిలింమ్స్ వారి 'కృష్ణ ప్రేమ '

చిత్రలో నారదుడుగా టంగుటూరి సూర్యకుమారి కనిపిస్తారు.

* 12/5/1961 న విడుదలైన మహేంద్రా పిక్చర్స్ వారి ' కృష్ణ ప్రేమ '

చిత్రంలో నారదుడిగా పద్మనాభం కనిపిస్తాడు.

* 9/4/1958 న విడుదలైన బి.ఏ.ఎస్ .ప్రొడక్షన్స్ వారి ' చెంచులక్ష్మి '

చిత్రంలో రేలంగి నారదుడుగా కనిపిస్తారు.

* 9/2/1963 న విడుదలైన జూపిటర్స్ పిక్చర్స్ వారి ' వాల్మికి ' చిత్రంలో రఘరామయ్య నారదుడిగా కనిపిస్తారు.

* 9/5/198 న విడుదలైన కాశీనాద్ ప్రొడక్షన్స్ వారి ' శ్రీరామాంజనేయ యుధ్ధం ' చిత్రంలో నారదుడిగా రఘరామయ్య నటించారు.

* 10/1/1975 న విడుదలైన శ్రీలక్ష్శి నారాయణ ఫిలిమ్స్ వారి

' శ్రీ రామాంజనేయ యుధ్ధం' చిత్రంలో కాంతరావు నారదుడిగా కనిపిస్తాడు.

* 1960 లో వచ్చిన అశ్వరాజ్ వారి దీపావళి చిత్రంలో నారదుడిగా కాంతారావు కనిపిస్తారు.

* 1946 లో వచ్చిన జగన్ మోహిని వారి ' నారద నారది 'చిత్రంలో సూరిబాబు నారదుడుగా కనిపిస్తారు.

* 1933 లో వచ్చిన సరస్వతి సినీటోన్ వారి ' ఫ్రుద్విపుత్ర ' చిత్రంలో, ' నాగుల చవితి ' చిత్రంలో నారదుడుగా రఘరామయ్య నటించారు.

* 1972 లో వచ్చిన వీనస్ మహిజా వారి ' ' చిత్రంలో హరినాధ్ నారద పాత్రలో కనిపిస్తాడు.

ఇలా ఎందరో నటులు నారద పాత్రధారులుగా తమగాన, నటనా ప్రతిభతో మనల్ని మెప్పించి ఆనంద పరిచారు.

బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .

9884429899

మరిన్ని వ్యాసాలు