
సినిమాల్లో అప్సరసల నృత్య గీతాలు.
స్వర్గంలో దేవతలను తమ నాట్య గానాలతోఅలరించేందుకు, అవసరమైతే మహర్షుషుల తపోభంగం కలిగించేటందుకు నియనించబడినవారు అప్సరసలు. అందంగా ఉన్నవారిని గురించి పొగడాలనుకుంటే ఎవరైనా అప్సరసలాగా ఉన్నావని అంటారు. పురాణాల ప్రకారం రాసిన గ్రంథాల ద్వారా అస్సరసలు అనే వారు దేవలోకంలో ఉన్నారని లేదా ఉండేవారని తెలుసుకుంటున్నాం. అసలు అప్సరసలు ఎంతమందో చాలామందికి తెలియకపోవచ్చు. అప్సరసలు అనగానే గుర్తుకి వచ్చేది కేవలం ఒక నలుగురు పేర్లు మాత్రమే చెబుతారు.చాలామందికి తెలిసిన అప్సరసలు నాలుగు, ఐదు మాత్రమే.బ్రహ్మ పురాణం ప్రకారం 31 మంది అప్సరసలు ఉన్నారు. వీరిని ఏకత్రింశతి అప్సరసలు అని అంటారు. అప్సరస శబ్దమునకున్న అనేక వ్యుత్పత్తులలో 'అద్భ్యః సరంతీతి అప్సరసః'-జలమునందు పుట్టినవారు అనునదొకటి.ఇది వారి పుట్టుకకు సంబంధించినది. జలముకాక మరి 13 జన్మస్థానములు బాణుని కాదంబరిలోఅప్సరసల జన్మవృత్తాంతము ,పాండురంగ మహత్యమున తెనాలి రామకృష్ణుడు అప్సరసల జన్మస్థానములనిట్లు వివరించాడు.
నాల్గుకోట్లప్సరసలు... శివరాత్రి మహత్యము
శ్రీనాధుడు ఈఅప్సరసల జన్మస్థానములను చెప్పుటలో కాదంబరిని పూర్తిగా అనుసరించలేదు.కాదంబరిలో చెప్పబడిన పవనమును శ్రీనాధుడు చెప్పలేదు.దాని స్థానమున దక్షప్రజాపతిని పేర్కొనినాడు . కాదంబరి పేర్కొనిన మృత్యువును శ్రీనాధుడు మృత్యుదేవత నోరి మెరుగుబండ్లుగా చిత్రించినాడు. అమృతమునకు బదులుగా శ్రీనాధుడు అమృతమునకు పుట్టినిల్లైన దుగ్దాంభోది అని చెప్పినాడు.
రంభ,ఊర్వశి,మేనక,తిలోత్తమ,ఘృతాచి,సహజన్య,నిమ్లోచ,వామన,
మండోదరి,సుభగ,విశ్వాచి,విపులానన,భద్రాంగి,చిత్రసేన,ప్రమ్లోచ,
మనోహరి,మనోమోహిని,రామ,చిత్రమధ్య,శుభానన,కేశి (సుకేశి), నీలకుంతల, మన్మధోద్దపిని, అలంబుష,మిశ్రకేశి,పుంజికస్థల, క్రతుస్థల,వలాంగి,పరావతి,మహారూప,శశిరేఖ వంటివారు .
మరి మన సినిమాల్లో....
* విడుదలైన సువర్ణ సుందరి.చిత్రంలో 'పిలువకురా అలుగకురా ' గీతం పి.సుసీల పాడగా ఇంద్ర సభలో రంభగా అంజలిదేవి లాస్యం చేసారు. సంగీతం ఆదినారాయంరావు,సాహిత్యం సముద్రాల.
* విడుదలైన పాండురంగ మహత్యం చిత్రంలో 'కనవేర మునిరాజమౌళి' గీతం పి.లీల ఆలపించగా లాస్యం రీటా చేసారు సముద్రాల సాహిత్యం,టి.వి.రాజు సంగీతం.
* 1961విడుదలైన సీతారామ కల్యాణం చిత్రంలో ' సరసాల జవరాలను ' గీతం లీల ఆలపించగా నర్తకి కుచల కుమారి రంభగా లాస్యం చేసారు.సముద్రాల రచన గాలిపించెల సంగీతం.
* 1958లో విడుదలైన ఏ.వి.యం వారి భూకైలాస్ చిత్రంలో రావణుని తపోభంగాని వచ్చిన నర్తకి హెలెన్ ' సుందరాంగా అందుకోరా ' గానం సుసీల,సముద్రాల రచన,సుదర్సనం ఆర్ .గోవర్ధనం సంగీతం.
* 1963 లో విడుదలైన రాజ్యం పిక్చెర్స్ వారి నర్తనశాల చిత్రంలో ఇంద్రసభలో' నరవరా ఓకురువరా ' అని జానకి ఆలపించగా ప్రియదర్శిని లాస్యం చేయగా గాలిపెంచల వారి సంగీతం సముద్రాలవారి సాహిత్యం.ౌశశడ
* 1967లో విడుదలైన ఏ.వియం వారి భక్త ప్రహ్లద చిత్రంలో ' అందని సురసీ నీదేనోయి ' అని సుసీల,జానకి,శులమంగళం రాజ్యలక్ష్మి ఆలపించగా రంభా,,మేనక,తిలోత్తమ లుగా అనురాధ,గీతాంజలి,విజయలలిత,వెన్నెలరాడై నీర్మల లాస్యంచేసారు. సాలూరివారిసంగీతం,సముద్రాలవారి రచన.ఞఞఞ
* 1977 లో విడుదలైన యమగోల చిత్రంలో ' ఆడవె అందాల సురభామిని ' గీతాన్ని బాలు,సుసీల ఆలపించగా రంభా,ఉర్వసి,మేనకలపై చిత్రికరించారు.సాహిత్యం వేటూరి,సంగీతం చక్రవర్తి.