అంతరిక్షం - రవిశంకర్ అవధానం

ANthariksham

"రోహన్ , ఏంటి ఆటకు వెళ్ళలేదు ? టీవీ కి అతుక్కు పోయావ్ ?" అన్నాడు నరసింహం మెట్లు దిగుతూ. కింద ఫ్లాట్ కిటికీ అవతల కూర్చున్న 14 ఏళ్ళ  మనవడి తో .

"మదర్ డైరీ ప్రక్కనున్న ప్లేగ్రౌండ్ లో ఏదో రిపేర్ జరుగుతుంది తాత. ప్లస్ టీవీ లో స్పేస్ X రాకెట్ లాంచ్ చూస్తున్న తాత . This is world changing event !"అన్నాడు కళ్ళు పెద్దవిగా చేస్తూ.

"ఓహ్ , ఏంటి అంత పెద్ద ఈవెంటా ?" అన్నాడు నరసింహం ఉత్సాహంగా .

"తాతా మాములుగా రాకెట్ లాంచెస్ చాల జెరిగాయి గత 40 ఏళ్ళ గా , కానీ ఇది రీయూసబుల్   లాంచర్ . స్పేస్ క్యాప్సూల్ ని స్పేస్ లో వదిలి మళ్ళీ లాంచింగ్ పాడ్ కి వచ్చేస్తుంది, దీన్ని మళ్ళీ-మళ్ళీ లాంచింగ్ కి ఉపయోగించవచ్చు . దీని వల్ల కాస్ట్-అఫ్-ప్రొడక్షన్ అండ్ కాస్ట్-అఫ్-ట్రావెల్ బాగా తగ్గిచేస్తుంది" అన్నాడు రోహన్.

"ఓహ్ shuttle లాగా? అన్నాడు నరసింహం.

"ఇంచుమించు , అలాగే తాత , ఇది లాంచర్ మాత్రమే . స్పేస్ ట్రావెల్  ని ఇది రెవొల్యూషనైజ్ చేస్తుంది" అన్నాడు రోహన్.

"ఓహ్ ! స్పేస్ ట్రావెల్? ఈ సర్వీసెస్ కూడా ఉన్నాయా ?" అడిగాడు నరసింహం .

"ఎస్ తాత ! స్పేస్ X , బ్లూ ఒరిజిన్ , వర్జిన్ గేలిక్టిక్ లాంటి సంస్థలున్నాయి.ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల ఊహాశక్తిని మరియు పర్సులను, ఆకర్షించింది. ధనికులు ఇప్పుడు అక్షరాలా ప్రపంచానికి అతీతమైన అనుభవాన్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉన్న పరిశ్రమగా మారింది! బిలియనీర్లు, కంపెనీలు ఎటువంటి ప్రయాణాల్లో ఉన్నారు, ఆసక్తికరమైన ఆర్థిక వాస్తవాలు మరియు కొన్ని హాస్యాస్పదమైన భావనలు కూడా ఉన్నాయి.

"ఇంట్రెస్టింగ్ రోహన్ ! అవి ఏంటి చెప్పూ " అన్నాడు రోహన్ పక్కన కూర్చుంటూ.

"తాత , SpaceX ప్రైవేట్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో అగ్రగామిగా ఉంది, రీయూసబుల్ రాకెట్లు అభివృద్ధి చేస్తూ, స్టార్షిప్ ప్రాజెక్ట్తో మార్స్ మిషన్లను ముందుకు తీసుకెళ్తుంది, కానీ ప్రస్తుతం, కస్టమర్లకు 11 నిమిషాల స్పేస్ రైడ్ అందిస్తున్నారు.అంతరిక్షాన్ని అతి ధనవంతులకు అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించింది" అన్నాడు రోహన్.

"స్పేస్కు టిక్కెట్ ధర  ఎంత ఉంటుంది రోహన్ ?" అన్నాడు.

" మొబైల్ లో చెక్ చేస్తూ, "తాత , ₹ 4 క్రోర్స్ నుంచి 5 క్రోర్స్ దాకా ఉంటుంది " అదే మూన్ దాకా వెళ్లాలంటే ₹ 150 క్రోర్స్  ఉండొచ్చట."

"అబ్బో ! ఎవరు కొంటారు రా ? ఇంత డబ్బు పెట్టి " అన్నాడు ఆశ్చర్యంగా నరసింహం.

"అయ్యో తాత , బ్లూ ఒరిజిన్ , వర్జిన్ గేలిక్టిక్, మరియు SpaceX వందల వేల (లేదా కొన్ని మిలియన్ల) ధరకు టిక్కెట్లను విక్రయించాయి. ఒక దశలో తక్కువ ధరతో "ఎకానమీ" టిక్కెట్లు అందించాలనే మాట్లాడుతున్నారు తాత !"

"ఇంత డబ్బు పెట్టి , ఎక్స్పరిమెంట్ స్టేజ్ లో చాల రిస్క్ కదా , రోహన్ ?"

" కరెక్ట్ తాత ! పలు కంపెనీలు ఇప్పుడు అంతరిక్ష ప్రయాణ బీమా అందిస్తున్నాయి, ఆస్వాదకుల ఆరోగ్యం లేదా జీవన సమస్యలపై బీమా కవరేజ్.

బ్లూ ఒరిజిన్ , వర్జిన్ గేలిక్టిక్, ప్రయాణికులు రిస్క్ను అంగీకరించే సంతకాలతో ముందుకు వెళ్లాలి"

" ఇది భలే ఉందిరా ! ప్రతి స్పేస్ ట్రిప్కు రివార్డ్ పాయింట్లు రావడం , పది ప్రయాణాల తర్వాత, ఉచిత చంద్రుడి ల్యాండింగ్ అంటారేమో, ఇంకా పిచ్చి ముదిరి సాధారణ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో  బీచ్లో సెల్ఫీలు పెడితే; బిలియనీర్లు ఆర్బిట్లో తీసుకున్న ఫోటోలను పెడతారెమో ? "అన్నాడు నరసింహం నవ్వుతు.

"తాత , ఆల్రెడీ మార్స్ లో రియల్ ఎస్టేట్  అనికూడా వింటున్నాం ఇంటర్నెట్లో " అన్నాడు రోహన్ కూడా నవ్వేస్తూ.

"సరే , ఈ స్పేస్ వాక్ దేవుడెరుగు నాయన ! నా ఈవెనింగ్ వాక్ కి టైం అయింది " అంటూ రోహన్ తల నిమురుతూ వెళ్ళిపోయాడు నరసింహం.

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం