ధృతరాష్ట్రుని వ్యక్తిత్వం .[మహాభారతంలో వ్యక్తులు2. ]
మహాభారతంలోని రెండవ హీరో ఇతడు. ఈయన కౌరవుల తండ్రి, హస్తినాపుర ‘రాజుకానిరాజు.’
ఆయన వ్యక్తిత్వంలో మంచి లక్షణాలకంటే కొన్ని బలహీనతలు ఎక్కువ ఉన్నాయి.
ధృతరాష్ట్రుని వ్యక్తిత్వం చిత్రాతి చిత్రమైనది -
ఈతనికి గుడ్డివాడైనందున రాజ్యపాలనచేసే అధికారం, అవకాశం లేవు. పాండురాజు యుద్ధానికి వెళుతూ కేవలం ఇంచార్జ్ గానియమిస్తాడు.ఆసింహాసనం అతడికి ఆకర్షించి, ఆగౌరవము రుచి మరిగి , పదవీ వ్యామోహం పెరిగి, తనను రాజు కాకుండా అనర్హుడిని చేసిన తల్లిని కూడా దూషించుకుంటాడు. ,ద్వేషించుకుంటాడు. ఆమెకళ్ళూమూసుకోటాన తనకు అంధత్వం కలిగిందని తల్లిని మనస్సులోనైనా కోపించడం నేరం.
ఆధికారదాహం వలన తానే రాజుగా కొనసాగాలనీ, తన తర్వాత తన కుమారులే రాజ్యం ఏలాలనీ ఆకాంక్షించాడు.
1. పుత్రవాత్సల్యం (కొడుకులపై అత్యధిక ప్రేమ)
అదే ధృతరాష్ట్రప్రేమ అనే నానుడు ఏర్పడింది. అనుచితాన్ని అంగీకరించడం కానిదాన్నికోరుకోడం, అన్యాయాన్ని ఉపేక్షించడం,సుఖాన్ని ఆశించడం , ఉచితానుచితాలు ఆలోచించకపోడం.
ధృతరాష్ట్రుడు తన కుమారులైన కౌరవులపై ఎంతో మక్కువ చూపాడు. ముఖ్యంగా దుర్యోధనుడిపై అతనికి ఎక్కువ ప్రేమ. ఈ అంధమైన ప్రేమ వల్ల ఆయన ధర్మాన్ని పాటించలేక పోయాడు.
2. శారీరక అంధత్వం – నైతిక అంధత్వం.
ఆయన జన్మతః అంధుడు. కానీ మహాభారతంలో ఇది కేవలం శారీరక అంధత్వమే కాదు, ధర్మాన్ని గుర్తించలేని మనోఅంధత్వానికి కూడా ప్రతీకఐంది.
3. రాజ్యకాంక్ష
తాను రాజుగా ఉండాలని, తన కుమారులు రాజ్యం ఏలాలనీ ఆయన ఆశించాడు. పాండవులదే ధర్మబద్ధమైన రాజ్యమనీ ,వారే వారసులనీ వారే రాజుకావాలనీ తెలిసినా, వారికి న్యాయం చేయలేదు. కొడుకుమీది ప్రీతి అన్యాయాన్ని చేసే లాగా ప్రోత్సహించింది .
4. బలహీన స్వభావం
ధృతరాష్ట్రుడు చాలా సార్లు సత్యం తెలుసుకున్నా , దుర్యోధనుడి పై ప్రేమకు సత్యాన్ని బలిచ్చాడు. వాని మాటలకు, చేతలకూ లోబడిపోయాడు.
సభలో ద్రౌపది అవమానించబడుతున్నప్పుడు కూడా ఆయన వెంటనే అడ్డుకోలేకపోయాడు. కళ్ళుమాత్రమే లేవుకానీ ధర్మ సూత్రాలు బాగా తెలుసు. చివరకు ఆపతివ్రత శపిస్తుందని భయపడి ఆమెకు వరాలిచ్చి ఆమెను ఆపాడు.
5. ధర్మజ్ఞానం ఉన్నా ఆచరణలో పెట్టలేకపోయాడు. ఆశాపాశ బంధనానికి లోబడ్డాడు. అతనికి ధర్మం తెలుసు. విదురుడు ఎప్పటికపుడు అన్నీ చెప్తూనే ఉన్నా మనసుకు పట్టించు కోలేదు. వీనీ విననట్లే ప్రవర్తించాడు .వందమంది పుత్రుల నూ పోగొట్టుకున్నాడు. భీష్మని సలహాలు వినలేదు. అధికార అహంకారం.
ధృతరాష్ట్రుడు అంధత్వానికి ప్రతీక.
మమకారం (నా – నా అనే భావం) మనిషిని ధర్మం నుండి దూరం చేస్తుంది. అమిత పుత్రాసక్తి,,పుత్రులను గద్దె నెక్కించాలనే అత్యాశవలన ,ధర్మం తెలిసినా అమలు చేయలేకపోయాడు..
దుర్యోధనుని పైనున్న అమిత గుడ్డి ప్రేమ ప్రభావానికి లోనయ్యాడు.ధృతరాష్ట్రుని ఈ స్వభావమే మహాభారత యుద్ధానికి దారితీసింది.
మనిషికి శారీరక అంధత్వం కంటే మమకారం, స్వార్థం వల్ల వచ్చే మానశిక అంధత్వం వినాశనానికి దారితీస్తుంది.
ధృతరాష్ట్రుని స్వార్థబుద్ధి -
ధృతరాష్ట్రుడు రాజు అయినప్పటికీ నిజమైన ధర్మబద్ధమైన రాజు కాదు. ఆయనకు రాజ్యాన్ని కాపాడే బాధ్యతమాత్రమే ఉంది. కానీ ఆయన ఎక్కువగా “నా కొడుకులు – నా రాజ్యం” అనే భావంలోనే ఉండిపోయాడు.దుర్యోధనుడు చేసిన తప్పులన్నీ ఆయనకు బాగా తెలుసు.
విదురుడు, భీష్ముడు ఎన్నో మార్లు హెచ్చరించారు.
అయినా ధృతరాష్ట్రుడు కుమారుని తప్పులను అడ్డుకోదు, పుత్రప్రేమవల్లే.
దుర్యోధనుడు హస్తినాపురంలో పాండవులపై అసూయతో ఎన్నో కుట్రలు చేస్తున్నాడని గ్రహించిన విదురుడు ధృతరాష్ట్రుని ఇలా చెప్పాడు:
“రాజా! మీ కుమారుడు తప్పు మార్గంలో వెళ్తున్నాడు.
ఇప్పుడు ఆపకపోతే రాజ్యం నాశనం అవుతుంది.”
ధృతరాష్ట్రుడు ఆ మాటలు విన్నాడు. అతనికి నిజం తెలిసింది.కానీ తనకుమారుడైన దుర్యోధనుని మంద లించలేదు. అతడి కుట్రలను అపలేదు.ఆ మమకారం వల్ల ఆయన న్యాయం చేయలేకపోఅయాడు..తండ్రిగా ప్రేమ ఎక్కువై, రాజుగా బాధ్యత తగ్గిపోయింది.చివరికి మహాభారత యుద్ధం జరిగి కౌరవుల నాశవానికి దారితీసింది.
కుమారులంతా మరణించినా , తానూ, తనకుమారులూ పాండవులపై ఎన్నో అఘాయిత్యా లు చేసిన వారు రాజ్యం ఏలుతుంటే వారి చెంత సిగ్గు విడచి రాజభోగాలు అనుభ విస్తూ గడిపాడు.చివరకు విదురుని బలవంతం మీద ఆర్థరాత్రి కారడవులకు భార్యతో కలసి వెళ్ళి అక్కడ అగ్నిలో భస్మమై జీవితం చాలించాడు.
ధృతరాష్ట్రుడు చివర్లో ఎంత పశ్చాత్తాపంపొందినా ఫలితం సూన్యం.అందుకే తనది కానిదికోరే వారినీ, బిడ్డలపై అతిప్రేమచూపేవారినీ ధృతరాష్ట్రునితో పోలుస్తారు.
మనిషి జీవితంలో మూడు విషయాలు ప్రమాదకరం:
1మమకారం (నా – నా అనే భావం) 2 అధర్మాన్ని చూసి మౌనం ఉండటం 3బాధ్యతను నిర్వర్తించక పోవడం ధృతరాష్ట్రుని జీవితం మనకు చెప్పే పాఠం:
“ధర్మం ముందు బంధుత్వం కాదు; న్యాయం ముందు మమకారం కాదు.”
ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ
కిమకుర్వత సంజయ ॥
కురుక్షేత్ర యుద్ధ ప్రారంభాన సంజయుని ధృతరాష్ట్రు ఇలా అడగడం వెనుక అతడి పుత్ర వాత్సల్యం ,వారు అధర్మ పరులైనా జయిచాల నేకోరికా కనిపిస్తాయి. యుద్ధ భూమికి వెళ్ళిన వారు యుధ్ధంచేయక కబుర్లాడుకుంటారా? గోలీలాడుకుంటారా? ఆశ. ఆశ అలా అడిగించింది.
కనికుడుఅనే మరొక ధృతరాష్ట్రుని మంత్రి ఉండేవాడు
కపటబుద్ధి, క్రూరుడు ఐన కుళ్ళు రాజకీయమనస్తత్వం గల అతని మాటలే వినేవాడు .ధర్మంతో కాకుండా శత్రువులను ఏ విధంగానైనా నాశనం చేయాలి అనే అతని సలహాలను పాటించాడు. అందుకే అంతమయ్యాడు, దుష్టులమాటలు అంతానికి తీసుకెళతాయి
ఇతరుల ఆస్థిపాస్తులు కోరుకుంటే అన్యాయార్జితం చేస్తే, ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులలా సర్వనాశనమవు తారని గుర్తుంచుకుని న్యాయార్జితంతో ఆనందంగా జీవించాలని గమనించాలి.

