ఇక మా ఇంట్లో యుద్ధం మొదలు - Lakshmi Sowjanya

Ika maa intlo yuddham modalu

"ఎప్పుడూ ఆ క్రికెట్ Worldcup హైలైట్స్ చూడటమేనా? కింద స్క్రోలింగ్ చూడండి" అని భార్య అరుపుకు ఏమిటా అని టీవీ లో ముఖం దూర్చి చూసాడు కుమార్.

"వంట గ్యాస్ సరఫరా లో జాప్యం, వాహనాల కు ఇంధన సర్ఫరా పై కేంద్రం ఆంక్షలు...." బిరా బిరా సాగుతున్న స్క్రోలింగ్ ని అంతే కంగారుగా పెద్ద గా చదివాడు కుమార్. ఎక్కడో యుద్ధం ఇక్కడ ఇంట్లో వేడి పుట్టిస్తోందని గ్రహించాడు.

చెమటలు తుడుచుకుంటూ ఇప్పుడే గ్యాస్ book చేస్తాను లే అన్నాడు. కానీ బుకింగ్ కావడానికి ఇంకా 15 రోజులు పడుతుందని రిప్లై చూసి ఆలోచనలో పడ్డాడు కుమార్ . ఈ లోగ కూతురి స్కూల్ యూనిఫామ్ పై వున్నా హోలీ రంగులు చూసి ," రంగుల పండు గ ఇంకా నడుస్తోందా బుజ్జి ?" అని కూతుని ని అడిగాడు .

"లేదు నాన్న , ఈ రంగులు పోవాలంటే వేడి నీళ్ల లో ఉడక బెట్టాలిట, ఇప్పుడు గ్యాస్ మన వంటకీ సరిపోతుందిట, అందుకని అమ్మ తర్వాత బాగు చేస్తా అన్నది".

ఈ లోగ ఆఫీస్ కి టైం అయిందని బండి తీస్తే, అందులో గ్యాస్ తక్కువ వున్నది. నెమ్మది గా బంక్ కి చేరే సరికి పెద్ద క్యూ చూసి ముందున్న వ్యక్తి ని అడిగితే, యుద్ధం వల్ల ఇంధనం సరిపడా సరఫరా లేదని చెబుతున్నాడు ట బంక్ యజమాని .

ఈ కష్టాలు గట్టెక్కి ఆఫీస్ కి వెళ్లే సరికి ఆలస్యం - బాస్ తన సీట్ ముందు ఉండటం తో తన ఆలస్యం కి కారణం చెప్పాడు.

"నీ ఆలశ్యపు కథలకి యుద్ధం జోడించావే .. సరేలే, అదె యుద్ధం వల్ల నెక్స్ట్ వీక్ నీ ఫారిన్ ప్రోగ్రాము cancel అయ్యింది", boss ప్రకటించాడు

దానితో నిరాశ పడ్డ కుమార్ ని ఓదార్చడం కోసం Work From Home శాంక్షన్ చేశాడు.

" ఇంటినుంచి పని చెయ్యడమే ? వామ్మో ! ఇక యుద్ధం నా ఇంట్లో మొదలు అవ్వబోతుందా ? గ్యాస్ లేని కారణం తో కట్టెల పొయ్యి తో వంట చేయిస్తుందా తన భార్య " అని తలచుకొని ఇంటి దారి పట్టాడు.

మరిన్ని కథలు

Raanunna kaalam
రానున్న కాలం
- మద్దూరి నరసింహమూర్తి
Tana kopame tana shatruvu
తన కోపమే తన శత్రువు!
- - బోగా పురుషోత్తం
Bongaram
బొంగరం
- సూర్య. మండా (MS)
Vellanu
వెళ్ళను
- isun finn
Punyakoti
పుణ్యకోటి
- కామేశ్వర రావు రాపాక
Prema.. O maaya
ప్రేమ.. ఓ మాయ
- డా:సి.హెచ్.ప్రతాప్
Doutya vijayam
దౌత్య విజయం
- డా:సి.హెచ్.ప్రతాప్
Teeru marchina reelu
తీరు మార్చిన రీలు
- ప్రభావతి పూసపాటి