అదృష్టవంతులు - యు.విజయశేఖర రెడ్డి

Adrustavanthulu

అంధుడు శివయ్య వెదురుతో చక్కగా బుట్టలు అల్లేవాడు అవిటి వాడు చంద్రయ్య కావలసిన వెదురును సమకూర్చి తను కూడా బుట్టలు అల్లడంలో శివయ్యకు సాయం చేసేవాడు అలా వారిద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు.

ఒక రోజు అల్లిన బుట్టలను శివయ్య తల మీద పెట్టుకోగా చంద్రయ్య శివయ్య చేతిని ఒక చేత్తో మరో చేత్తో కర్రను సాయం చేసుకుని కుంటుతూ సీతాపురం సంతలో అమ్మాలని రామాపురం పొలిమేర దాటి వెళుతుండగా దారిలో ఒక పాము కనిపించింది. చంద్రయ్య పామును చూసి పక్కగా నడుస్తూ చంద్రయ్యను కూడా పక్కకు లాగాడు, అయినా ఆ పాము శివయ్య పాదం మీద కాటు వేసింది. “అబ్బా..” అని శివయ్య కింద పడిపోయి మరణించాడు.

“ఓ నాగరాజా! కళ్ళు లేని నా ప్రాణ మిత్రుణ్ణి కాటు వేశావు..అతడు లేకుండా నేను జీవించలేను..నన్ను కూడా కాటు వెయ్యి” అని దీనంగా వేడుకున్నాడు చంద్రయ్య. “అయ్యో! నేను గమనించ లేదు. నాకు హాని జరుగుతుందేమోనని కాటు వేశాను..అదిగో అటు పక్కగా నా పుట్ట ఉంది. దాని మీద ఒక మణి ఉంటుంది, దానిని తీసుకునిరా” అంది పాము.

“అలాగే” అని చంద్రయ్య మణిని తెచ్చి పాము వద్దకు వచ్చాడు. “ఆ మణిని నీ మిత్రుడి పాదం మీద పెట్టు” అంది పాము. చంద్రయ్య అలాగే చేశాడు, శివయ్య లేచి కూర్చున్నాడు. “నాగరాజా! నీకు అనేక ధన్యవాదాలు” అన్నాడు చంద్రయ్య. “ఆ మణిని అతని కళ్ల మీద పెట్టు” అంది పాము. చంద్రయ్య అలాగే చేశాడు, శివయ్యకు కళ్ళు వచ్చాయి. “మిత్రమా! నాకు చూపు వచ్చింది” అని చంద్రయ్యను ఆలింగనం చేసుకున్నాడు శివయ్య.

“ఆ మణిని నీ అవిటి కాలి మీద పెట్టు” అంది పాము, “చంద్రయ్య అలాగే చేశాడు. చంద్రయ్య అవిటితనం పోయి కాలు వచ్చింది. “నీకు ఎంతో ఋణపడి ఉన్నాము” అన్నారు. శివయ్య,చంద్రయ్యలు. “ఈ మణిని మీ వెంట తెసుకెళ్ళండి..మీకు మంచి జరుగుతుంది” అని అంది పాము. ఇద్దరూ పాముకు నమస్కరించారు.పాము పొదలలోకి వెళ్లింది.

శివయ్య,చంద్రయ్యలు బుట్టలు చెరి సగం తీసుకుని తలమీద పెట్టుకుని సంతోషంగా అక్కడ నుండి వెళుతూ “ఈ మణి మన వద్ద ఉండడం మంచిది కాదు. బుట్టలు సంతలో అమ్మి అక్కడ నుండీ కోటకు వెళ్ళి రాజు గారికి ఈ మణిని ఇద్దాము” అని అనుకుని కోటకు చేరుకుని రాజు గారికి జరిగింది చెప్పి ఆ మణిని ఇచ్చారు.

“ఈ మణి చాలా విలువైంది..మీ నిజాయితీని మెచ్చుకుంటున్నాను..మీకు ధనం కావాలా? లేక నా వద్ద కొలువు కావాలా?” అన్నాడు రాజు. “మహారాజా! మాకు మీ వద్ద కొలువు ఇవ్వండి” అన్నారు ఇద్దరూ. రాజు వెంటనే వారిని కొలువులో చేర్చుకున్నాడు.***

మరిన్ని కథలు

Adarsha kutumbam
ఆదర్శ కుటుంబం
- డా:సి.హెచ్.ప్రతాప్
Vennante Kallu
వెన్నంటే కళ్లు
- కందర్ప మూర్తి
Manchi Donga
మంచి దొంగ
- చలసాని పునీత్ సాయి
Naanna
నాన్న
- డా:సి.హెచ్.ప్రతాప్
The game changer
ది గేమ్‌ చేంజర్
- హేమావతి బొబ్బు
Adrustam kalisoste
అదృష్టం కలిసొస్తె...
- కందర్ప మూర్తి
Illaale Devatha
ఇల్లాలే దేవత
- డా:సి.హెచ్.ప్రతాప్