కాశీ ప్రయాణ కథలు - గడ్డివామి దగ్గర కుక్క.
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు. ఈరోజు మనం గడ్డివామి దగ్గర కుక్క కథ గురించి తెలుసుకుందాం అన్న సరస్వతి చెప్పడం ప్రారంభించింది.
"కాశీరాజ్యం సమీపంలోని అడవి ఒకరోజు నక్క ఆహరం వెదుకుతూ బయలుదేరింది ఎంతవెదికినా ఆహరం దొరకక పోవడంతో నిరాశతో దాహం తీర్చుకోవడానికి సమీపంలోని చెరువు వద్దకు వెళ్ళింది నీళ్ళు తాగుతున్న
నక్కకు చచ్చిన ఒక పెద్ద చేప నీటిపై తేలి ఒడ్డుకు వస్తూ కనిపించింది అలావా వచ్చిన చెపను నోటితో పట్టుకుని ఓచెట్టునీడన తినడానికి సిధ్ధమైయిది, అదిచూసిన ఆపరిసరాలలోని కాకులు తాముకూడా చేపను తినడానికి వచ్చాయి తన ఆహరాన్ని తినడానికి వచ్చిన కాకులను చేపను తాకకుండా తరమసాగింది నక్క. ఎంత తరిమిన కాకులు మరలా మరలా రాసాగాయి.
"నక్కబావ మమ్మల్ని ఆహరం ముట్టనీయకుండా తరమడం నీకు అలసట కలిగిస్తుంది , నీకు ఓకథ చెపుతానువిను...
ఇద్దరు వ్యక్తులు పెద్ద పనసకాయ తమ ముందు ఉంచుకుని ఇదినాది అంటే నాది అని వాదులాడుకోసాగారు. అదేమార్గంలో వెళుతున్ని ఓవ్యక్తి 'అమాయకులారా వాదనలువద్దు అది ముదిరితే ఘర్షణ అవుతుంది ఘర్షణ వలన ఇరువురికి గాయాలు తప్పవు పనసపండు మీలో ఎవరూ పూర్తిగా తినలేరు కనుక పండును ఇరువురు సమంగా పంచుకు తినండి అని చెప్పాడు,మధ్యవర్తిగా అతను చెప్పిన మాటలు విని ఆఇద్దరు వ్యక్తులు పనస పండును రెండు భాగాలు చెసి తమ ఆకలి తీర్చుకున్నారు, ఇప్పుడుకూడా మనం ఈచేపను సమంగా పంచుకుంటే అందరికి ఆహరం లభిస్తుంది 'అన్నదికాకి.
ఆహరం వెదుకుతూ అటుగా వచ్చిన ఎలుగుబంటు చెట్టుకింద ఉన్న చేపను నోట పట్టుకుని అడవిలోనికి పరుగుతీసింది. జరిగిన సంఘటన చూసి నక్కతోపాటు కాకులు నివ్వెరపోయాయి ' నక్కబావ నువ్వు గడ్డివామి దగ్గర కుక్కలాంటివాడివి అంతపెద్ద చేప నువ్వు ఒక్కడివే తినలేవుకదా ,మమ్మల్నికూడా తినడానికి అనుమతించి ఉంటే మనందకి ఆహరం లభించేది నీదురాశ కారణంగా చేతికి అందిన ఆహరం నోటికి అందకుండా చేసి అందరికి ఆహరం లేకుండా చేసావు ' అన్నది కాకి .
"నిజమే మిమ్మలను ఆహరం దగ్గరకు రాకుండా తరుముతూ సమయం వృధా చేసుకున్నాను ఆసమయంలో మిజోలికి వెళ్ళకుండా నాకడుపు నింపుకుంటే సరిపోఏది అంతానాకే కావాలి అనే అత్యాశ, ఓర్వలేనితనం వలన ఏంజరుగుతుందో అనుభవ పూర్వకంగా తెలుసుకున్నాను ఇదినాకు మంచి గుణపాఠం ఇటువంటి తప్పు మరలా నాజీవితంలో ఎన్నడూ చేయను చేసిన తప్పుకు సిగ్గు పడు తున్నాను "అని తలవంచుకుని వెళ్ళిపోయింది నక్క " అన్నది.
కథ ముగియడంతో అందరూ నిద్రకు ఉపక్రమించారు.

