కళాపరిషత్ పురస్కారాలు - -

Ghazal Srinivas Kala Puraskaralu

హీరో నరేష్, నటులు ప్రదీప్ మరియు 'షాడో' మధుబాబు లకు గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ పురస్కారాలు
ప్రఖ్యాత హీరో నరేష్ ను "హాస్య బ్రహ్మ జంధ్యాల ఆత్మీయ పురస్కారం" తోను, ప్రముఖ టీవీ నటులు ప్రదీప్ ను "ఆంధ్ర దిలీప్ చలం పురస్కారం" తోను మరియు ప్రఖ్యాత డిటెక్టివ్ నవలా రచయిత 'షాడో' మధుబాబు ను "పినిశెట్టి శ్రీరామమూర్తి పురస్కారం" తోను మార్చ్ 2 వ తారీఖు సాయంత్రం 6 గం. లకు శ్రీ బొండాడ వెంకటరాజు గుప్త మున్సిపల్ ఓపెన్ ఎయిర్ దియేటర్, పాలకొల్లు లో జరిగే నాటకోత్సవాల ప్రారంభోత్సవ సభలో సత్కరించనున్నట్లు గజల్ శ్రీనివాస్ పాలకొల్లు కళాపరిషత్ సంస్థ అధ్యక్షులు శ్రీ మేడికొండ శ్రీనివాసరావు చౌదరి, కార్యదర్శి మానాపురం సత్యనారాయణ పత్రికా ప్రకటనలో తెలిపారు.

మార్చ్ 2,3,4 తారీఖులలో నాటకోత్సవాలు జరగనున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీ కె జి శంకర్, విశిష్ట అతిదిగా శ్రీమతి ఎం విజయ నిర్మల,  కమీషనర్, సమాచార హక్కు కమీషన్, గౌరవ అతిధులుగా శ్రీ లగడపాటి రాజగోపాల్, పార్లమెంట్ మాజీ సభ్యులు, నాట్స్ అధ్యక్షులు శ్రీ దేసు గంగాధర్, నాట్స్ చైర్మన్, ట్రస్ట్ బోర్డు డా. మధు కొర్రపాటి, ప్రఖ్యాత సినీ సంగీత దర్శకురాలు శ్రీమతి ఎం ఎం  శ్రీలేఖ, ప్రముఖ సినీ నటి కుమారి గీతాసింగ్ లు పాల్గోనున్నట్లు తెలిపారు.

మరిన్ని వ్యాసాలు

Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్
మహరాజా నందకుమార్ .
మహరాజా నందకుమార్ .
- బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - nallu - eega
పంచతంత్రం - నల్లు - ఈగ
- రవిశంకర్ అవధానం
రాజస్తాన్ రాష్ట్రము లోని  కుంభాల్‌గఢ్‌ కోట
రాజస్తాన్ రాష్ట్రము లోని కుంభాల్‌గఢ్‌ కోట
- కుందుర్తి నాగబ్రహ్మాచార్యులు
వీరపాండ్య కట్టబొమ్మన.
వీరపాండ్య కట్టబొమ్మన.
- బెల్లంకొండ నాగేశ్వరరావు