ఆరోగ్యం - ఆయుష్షు - బన్ను

Health is wealth - Health : Age

ఆరోగ్యం వేరు ... ఆయుష్షు వేరు. కొందరికి ఆరోగ్యం బాగోకుండా సంవత్సరాల పాటు వ్యాధులతో బాధపడుతూ వుంటారు. కానీ ప్రాణం పోదు. అంటే ఆయుష్షు మిగిలివున్నదన్నమాట ! కొందరు ఆరోగ్యం గా వుంటారు .... కానీ ఠపీమని పోతారు. ఆయుష్షు లేదు ... ఐపోయింది !!

మనిషి పుట్టినప్పుడే దేవుడు వీడిన్ని గింజలు తినాలి .... ఇన్ని నీళ్ళు తాగాలి .... ఇంత గాలి పీల్చాలి అని రాసిపెడతాడు అంటారు. ఆయుష్షు వుండీ 'గింజలు' తినాల్సినవి తినేసుంటే వాడికి తినలేని రోగం వస్తుందని కూడా అంటారు. అదెంతవరకు నిజమో నాకు తెలీదు కానీ ... ఆయుష్షు కేవలం పైవాడి చేతుల్లోనే వుంది - ఆరోగ్యం మాత్రం కొంత మనచేతుల్లోనూ వుందని గమనిద్దాం !

సర్వే జనా సుఖినో భవంతు !!

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు