ఆకలి - బన్ను

aakali

డాదికి 7 వేలమంది ఆకలి చావులకు గురవుతున్న ఈ దేశంలో కేవలం నిర్వహణా లోపం వల్ల 50వేల కోట్ల విలువైన ఆహారం పాడైందనే విషయం తెలియగానే చాలా బాధనిపించింది.

తెలిసో... తెలియకో మనం కూడా చాలా ఆహారాన్ని వ్యర్థ పరుస్తున్నాము. కనీసం నా వ్యాసం చదివిన తర్వాతనైనా మీరు శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తాను. మనింట్లో మిగిలిన ఆహారాన్ని పనిమనిషికిస్తే... ఆమె తీసుకెళ్తుంటే మనకి సంతోషమే! 'ఆహారం' వ్యర్థం కాలేదు... మనం ఏదో రెస్టారెంటుకెళ్ళి ఏవో ఆర్డర్లిస్తాము. చాలా మిగిలిపోతుంది. దానికి విలువ మనం 'పే' చేశాము. మిగిలిన పదార్థాలని 'పేక్' చేయమని అడుగుదాం. వాడిచ్చే 'పార్శిల్' ని నామోషీ అనుకోకుండా తీసుకు వెళ్ళి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్దకొచ్చే  వాళ్ళకిద్దాం! మనవంతు కర్తవ్యం మనం చేద్దాం... అని నా భావన! మన పేరు చెప్పుకొని ఒకడు కడుపునిండా తింటే అంతకన్నా ఆనందం మరొకటుండదు. దయచేసి కొందరన్నా అలా అలవాటు చేసుకుంటే మనవంతు 'కర్తవ్యం' నిర్వహించినట్టే!!