మీ పలుకు - పాఠకులు

mee paluku

సంచిక సంచికకి తేడా స్పష్టంగా తెలుస్తుంది. నాకు చాలా నచ్చింది. ఫాలో అవుతున్నాను. సాధారణంగా నేనెవ్వరికి ఇలా ఇ-మెయిల్ ఇవ్వను. థాంక్యూ అండ్ బెస్ట్ విషెస్ టు గోతెలుగు.
---బాబ్జీ, కెన్యా

ఏకశిలానగరం గురించిన వ్యాసం చాలా చక్కగా ఎంతో ఉపయోగకరంగా వచ్చింది. వరంగల్ చుట్టు ప్రక్కల ఉన్న చాలా ప్రదేశాల్ని చూసే అదృష్టం నాకు కలిగింది. నిజంగా ఈ ప్రదేశాలన్నీ చూడదగిన పర్యాటక ప్రాంతాలు. అలాగే సి. పి. బ్రౌన్  మరియు ఆదిశంకరాచార్యుల  వ్యాసాలు చాలా బాగున్నాయి
---భవరాజు మూర్తి, వర్జీనియా. USA

ఈ సారి సంచిక తో, నేను అడుగుదామను కున్న ప్రశ్నకి అడక్కుండానే సమాధానం దొరికింది. తెలుగో తెలుగు ఇక వారం వారం అన్న మాట. మూస పత్రిక కాదని రూఢి అయింది. కాని, మాస పత్రికా లేక పక్ష పత్రికా( అయితే మరి ఏ పక్షమో) అన్న అనుమానం తీరిపోయింది. గుడ్. హాసం పత్రిక తరువాత రాజా బొత్తిగా కనిపించటం మానేశారు. ఆయన దగ్గర్నించి సినిమాలగురించి అందు కోవాల్సింది చాలా వుంది. అవన్నీ జుర్రు కోవటం ఎలా అనేవారికి అందమైన సమాధానం మీ దగ్గర దొరికింది. ఆయన ఒక  నడిచే సంగీత, సినీ విజ్ఞాన సర్వస్వం. మీరు ఎంత వరుకు మా కడుపు నింపుతారో, మీ ఓపిక, మా అదృష్టం. చివర గా ఓ ఉచిత సలహా. నవ్వుకోడానికి కార్టూన్లు అంది స్తున్నారు, చాలా ఆనందం. అలాగే, తలుచు కుంటూ మురిసి పోడానికి తలో 'జోకు' కూడా అందించే ఆలోచన కూడా చేసి చూడండి .
---కృష్ణా రావు.

మనీషా పంచకం గురించి చాలా చక్కగా వ్రాసారు. ఇటువంటి వ్యాసాల్ని అందిస్తూ ఉండండి. మీ యొక్క ఈ మంచి ప్రయత్నాన్ని అభినందిస్తున్నా
---పెద్దల చలం

సినిమా వందేళ్ళ చరిత్రని కళ్ళకి కట్టినట్టు చూపించారు. నిజమైన కమ్యూనిజం ఎక్కడ వుందో తెలియ చెప్పారు. కవులు, కవిత్వము టెక్నాలజీ లో కొట్టుకు పోకుండా మళ్ళీ మళ్ళీ పుడుతోంది అని నిరూపించారు. మీకు వందనం
---లక్ష్మీ, ముల్పూరి