మరుపు - బన్ను

marupu

ర్చిపోవటం మనిషికి దేవుడిచ్చిన గొప్పవరం అన్నాడో పెద్దమనిషి. నిజమే! 'మరుపు' అనేది లేకపోతే మనం బ్రతకటం చాలా కష్టం.

ప్రతీదీ గుర్తు పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అది తప్పు. నిజానికి అవసరం లేదు! అదేమిటో మంచి విషయాలు కన్నా చెడు విషయాలనే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటూంటాం. అందుకేనేమో... స్నేహితులకన్నా, శత్రువులే ఎక్కువ గుర్తు వస్తూంటారు. నా మాటలతో మీరు ఏకీభవించకపోయినా... గమనించి చూడండి - ఇది అక్షర సత్యం!

ఏదన్నా విషయం మన మనస్సుని బాధపెడితే అదే విషయం పదే పదే గుర్తొస్తుంది. అక్కదే మన నిగ్రహ శక్తిని పెంపొందించుకోవాలి.. మర్చిపోవటానికి ప్రయత్నించేకన్నా... మన మనసుని వేరేవైపు మళ్ళించాలి. మన మనసుని మళ్ళించిన పని వైపు 'శ్రద్ధ' పెంచుకోవాలి. అలా మనం పాత చెడు జ్ఞాపకాలని మర్చిపోతాం... ఎందుకంటే... కొత్త మంచి అనుభూతులొస్తాయి కాబట్టి! 'చెడు' ని మరచి, 'మంచి' ని గుర్తుపెట్టుకుంటే... మనం పైకొస్తాం!