వాస్తు శాస్త్రము -- వాయువ్య దిశ - గుమ్మా రామలింగ స్వామి

vastu - north west
పశ్చిమ, ఉత్తరములందు వీధులు గల స్థలము వాయువ్య స్థలము గా భావించాలి. ఒక ఇంట్లో ఈ మూలను వాయువ్య మూలగా చెప్పవలెను. వాయువ్య మూలలో మరుగు దొడ్లు, స్నానాల  గదులు  కట్టుకోవాలి. వాయువ్య  స్థలములో ఇల్లు కట్టినప్పుడు  ఈ క్రింద  తెలిపిన  దోషాలు ఉండకూదు.

1)  పశ్చిమ మందు వాలు వరండాలు ఉంటే ఆ ఇంట్లో పురుషులు దుష్ఫలితాలు అనుభవిస్తారు. ఉత్తరము వైపు వాలు వరండాలు ఉంటె స్త్రీలు సుఖిస్తారు .

2) ఉత్తరపు అరగులు పశ్చిమ వైపు కంటే పల్లంగా ఉండాలి.

3) వాయువ్యమున నూతులు గాని నీతి తోట్టెలు గాని ఉంటే శత్రువులు అధిక మవుతారు. ప్రశాంతత లేని జీవితము పొరుగు వారితో విరోధము  కలుగును.

4) వాయువ్య  దిక్కు సంతానానికి సంభందించినది. అక్కడ దోషములు  పిల్లల పై ప్రభావము చూపును. కొన్ని ఇతర దోషములు కూడా ఉంటే, యజమానిరాలిపైనా  ఆదోషము  చూపును.

5) వాయువ్య దోషమునకు ఈశాన్య దోషము కూడా కలిసిన సంతతి పైనా పెద్ద కుమారుడు/కుమార్తె  పై కనుపించును.

6) ఉత్తర వాయువ్య దోషమున్న ఇంటికి దత్తు రావడమో ఇల్లరికము రావడమో జరుగును. వాయువ్య మందు బరువులు, ద్వారములు కిటికిలు లేకున్నా మూసి వున్నా భార్యాభార్తల అన్యోన్యత దెబ్బ తినును.

7) ఉత్తర వాయువ్యము దోషమైన, వాయువ్యము పల్లము గానున్న నైరుతి కన్నా ఎత్తు ఉన్నా విపరీత నష్టములు  కలుగును. యజమాని అప్పులపాలు కావచ్చు. ఇల్లు పరహస్త మగును.

8) ఈశాన్య దోషములేక వావుయ దోషములేక ఉన్న ఇల్లు అధిక సంపద, రాజకీయ ప్రాపకము, వ్యాపారాభి వృద్ధి కనుపించును. సంతతి  సంపద వృద్ధి చెందును

ఈ సూత్రములు  ముఖ్యముగా  స్థలములో నిర్మించిన  గృహములకు మాత్రమే  పూర్తి గా వర్తించును. ఫ్లాట్లు మరియు పై అంతస్తు లకు అన్నీ వర్తించవు. ఆ గృహము లేదా బహుళ అంతస్తుల భవనాలు మొదలగునవి  నిర్మించబడ్డ స్థలమునకు ఈ సూత్రములు చూడవలెను.

దశ - దిశ అను అంశములు రెంటిని పరీక్షించి  దోష నిర్ణయము చెయ్యవలెను. దశ  జాతక విషయము దిశ వాస్తు విషయము. వాస్తు చూడువారు యజమాని జాతకము కూడా చూసి ఆదిక్కు అనుకూలమా కాదా అన్న విషయము కూడా గమనించ వలెను. వాస్తు, జాతకము మన భవిష్యత్తుకు రెండు కళ్ళ వంటివి. ఈ రెంటిలొనూ ప్రవేశమున్న సిద్దాంతిని ఈ విషయమై  సంప్రదింపవలెను, ఇది చాలా ముఖ్యమగు విషయము, కనుక కొంచము శ్రమ ఖర్చు ఐనను పాటించుట ఉత్తమము. తరువాత విచారించి  లాభము లేదు . ఈ శాస్త్రమును నమ్మిన వారు ఇవి అన్ని పాటించ వలసినదే.
 
శుభమ్ భూయాత్ 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు