దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapudongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

 కేలిఫోర్నియాలోని అనహెయిం అనే ఊరికి చెందిన వెల్స్ ఫార్గో అనే బేంక్ లోకి ఓ దొంగ వెళ్ళి తుపాకి చూపించి డబ్బివ్వమని డిమాండ్ చేసాడు. దురదృష్టవశాత్తు అంతకు అయిదు నిముషాల ముందే ఆ బేంక్ లోని డబ్బంతా బ్రాంచ్ మేనేజర్ దగ్గర్లో వున్న ఇంకో బ్రాంచికి పంపాడు ఈ బేంక్ లోని డబ్బుంచే సేఫ్ డిపాజిట్ బాక్స్ తాళం పాడవడంతో ఆ పని చేసాడా మేనేజర్.
అక్కడ పనిచేసే ఉద్యోగస్థుల జేబుల్లోని 23 డాలర్ల 30 సెంట్లు మాత్రం తీసుకుని వెళ్ళాడా దొంగ.

 

 


పిట్స్ బర్గ్ లోని ఓ బేంక్ లోకి తుపాకీతో వెళ్ళిన ఓ దొంగ, కేష్ ని తీసుకున్నాక, తను టేక్సీ లో వచ్చానని వెళ్ళడానికి వాహనం లేదని బేంక్ కేషియర్ తో చెప్పి ఆమె కారు తాళం చెవులు కూడా తీసుకున్నాడు. అతనామె కారులో వెళ్తుండగానే పోలీసులు అతన్ని దారిలో అరెస్ట్ చేసారు. 

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్