గుండె ఊటలు (నానీలు) - యస్.ఆర్. పృథ్వి

gunde ootalu(naaneelu)

న్నత శిఖరాలకి
వెళ్ళాలి
అయితే
మానవతా మార్గంలోనే వెళ్లు

ఆకాశం ఎత్తు
పాతాళం లోతు
రెండూ కలిసే చోటు
మనిషి మనసు

పడుగు, పేకలకి
ఆర్ధిక రోగం
జీవిత వస్త్రాలకి
చిరుగల భోగం

బ్రతికున్నప్పుడు
పెద్దవాళ్ళు బరువు
పోగానే
గుండె చెరువు

ఆమె వొంటికి
గుడ్డ కరువేకావచ్చు
నిర్మాతకి మాత్రం
కాసుల దరువు

అహంకారం
కరిచే వీధి సింహం
ఆలోచన
చల్లని నిండు జాబిల్లి

మరిన్ని వ్యాసాలు

Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Social media lo nakilee profile patla apramattata
సోషల్ మీడియాలో అప్రమత్తత
- సి.హెచ్.ప్రతాప్
సాలార్ జంగ్ మ్యుజియం.
సాలార్ జంగ్ మ్యుజియం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
చార్మినార్ .
చార్మినార్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు