గుండె ఊటలు (నానీలు) - యస్. ఆర్. పృథ్వి

Gunde Ootalu(naaneelu)

సంపన్నులను చూస్తే
జాలేస్తుంది
పేదలకు ఆరుబయట
చెట్ల ఏ.సీ.లు

జనమంతా
తడిసి ముద్దయ్యారే
ఓ అదా!
వాగ్దానాల వాన!!

క్రెడిట్ కార్డుల్తో
పళ్ళు తోముకుంటున్నారు
కొన్నాళ్ళకు
బోసి నోరే

అన్నింటికీ
ఆర్ధిక ప్రయోజనాలేనా
మరి
మానవ సంబంధాలు?

ఆలోచనల్లోకి
స్వార్ధం చేరితే
మనిషి తనంలో
మాయని మచ్చ

గడియారంలో
ముళ్ళ విన్యాసం
తిప్పేకాలం మాత్రం
కనిపించదు.

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం