నవ్వుల జల్లు - చెక్కా చెన్నకేశవరావు


మంత్రి : ఈ పరిచారికకు, రాణులందరిలో సమాన హక్కులు, భోగ భాగ్యములు కలిగించే ఏర్పాట్లు చెయ్యమంటున్నారు - అదేమిటి ప్రభూ ?
రాజు: అందరికంటే ముందుగా మా రహస్య మందిరమున ప్రవేశించినది ఆమెయే కదా !

 

విలేకరి : మీ ప్రస్తుత పారితోషికం ?
సితార : ప్రదర్శనని బట్టి పారితోషికం మారుతూ వుంటుంది!
 రచయిత: ద్వందార్థ రచయితగా నాకు గల ప్రఖ్యాతి మీకు తెలిసిందే ! మీ తదుపరి చిత్రం "న భూతో న భవిష్యతి " లో నాకు అవకాశం యిప్పించండి.
నిర్మాత, దర్శకుడు : ద్వందార్థాల వాడకం పాత చింతకాయ పచ్చడి ! ఇది హైటెక్ యుగం. మూడు, నాలుగు అర్ధాల పదాలు వ్రాయగలిగితే చెప్పండి !

 కస్టమర్ : ఈ ప్యాంటు ఇంత పెచ్చు రేటు చెబుతున్నావ్ ! దీని ప్రత్యేకత ఏమిటి?
సేల్స్ బాయ్ : దీనికి 11 జేబులు, 22 తోకలు, 33 గుండీలు, 44 బెజ్జాలూ వుంటాయి. పైగా 2 నెలలకోసారి ఉతికితే చాలు!

 
దేవుడు : భక్తా ! నీకు అనంత సంపదను, అతిలోక సుందరిని ప్రసాదిస్తున్నాను. సుఖ సంతోషాలను అనుభవించు.
భక్తుడు : నాకు అనంత సంపదను, నా ఎదురింటి వాడికి అతిలోక సుందరినీ ప్రసాదించు స్వామీ !

 సుల్తాన్ : మీ 365 రాణులూ సుదీర్ఘ సమావేశం జరుపుతున్నారు ? ఏమిటి సారాంశం ?
రాణులు : రోజు విడిచి రోజు మేము నెల తప్పుతున్నాము. జహాంపనా ! అర్థం కావటంలేదు.


 
పెళ్ళికూతురు : శోభనం గదిలో క్లోస్డ్ సర్క్యూట్ కెమెరా వుందని నాకు అనుమానంగా వుండండి!
పెళ్ళికొడుకు : ఐతే మంచం కింద దుప్పటి పరుచు! ఏం భయంలేదు !!
 
భర్త : తొలి పరిచయ సన్నివేశంలో, నీలో ఎలాంటి భావన రేకెత్తింది?
శోభిత : ఏదీ ? ఎవరితో ? (తరవాత నాలుక కరచుకుంది !)

 

 
ప్రవీణ్ : ఆ భార్య , భర్తల మధ్య తగాదాలే ఉండవంటున్నావ్ ? వారిది అంత అన్యోన్య దాంపత్యమా ?
కార్తీక్ : అదీ, వాడూ ఎవరి దారి వారిదే. ఎవరి సంపాదన వారిదే. ఎవరి ఖర్చులు వారివే. ఎవరి పని వాళ్ళే చూసుకుంటారు. ఎవరి బెడ్ మీద వాళ్ళే బజ్జుకుంటారు.

 
రచయిత : ఎవడ్రా .... ఈ flexi ని తయారు చేయించింది? ఐడియాలు అమ్మబడును, కొనబడును అని వ్రాయించమంటే ... వడియాలు అమ్మబడును, కొనబడును అని వ్రాసాడు వెధవ ?!

 

మరిన్ని వ్యాసాలు

Cine srungaram
సినీ శృంగారం
- మద్దూరి నరసింహమూర్తి
Heaven On Earth - Kashmir
భూలోక స్వర్గం కాశ్మీర్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
రెండవ ప్రపంచ యుద్ధం-రహస్యాలు/విశేషాలు 6
రెండవ ప్రపంచ యుద్ధం - 6
- శ్యామకుమార్ చాగల్
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే పాత ప్రేమికులను వదులుకోవాల
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే...
- సదాశివుని లక్ష్మణరావు
ప్రభల సంస్కృతి .
ప్రభల సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బుడబుక్కలవారు.
బుడబుక్కలవారు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పూరి జగన్నాధ రథ యాత్ర .
పూరి జగన్నాధ రథ యాత్ర .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
వీధి నాటకం .
వీధి నాటకం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.