దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!


మిస్సిసిపి రాష్ట్రం లో లాంగ్ బీచ్ లోని ఓ కన్వీనియెన్స్ స్టోర్ లోకి వెళ్ళిన ఓ దొంగ తుపాకి చూపించి 200 డాలర్లు దొంగిలించాడు. అతని ముంజేతి మీద, నాట్గిల్టి అన్న పెద్ద అక్షరాలు పచ్చబొట్టు పొడిచి ఉండటం గమణించిన సేల్స్ మెన్ ఆ సంగతి పోలీసులకి చెప్పాడు. మర్నాడు ఆఫ్ డ్యూటీ లో ఓ సినిమాకి వెళ్ళిన ఓ పోలీస్ డిటెక్టివ్ కి నాట్ గిల్టి అన్న అక్షరాలున్న వ్యక్తి థియేటర్ లో కనపడ్డాడు. అదే రోజు ఆల్ పాయింట్స్ బుల్లెటిన్ లో అతని వర్ణని చదవడంతో వెంటనే ఆ డిటెక్టివ్ ఆ దొంగని అరెస్ట్ చేసాడు. పచ్చ బొట్టె ఆ దొంగని పట్టించింది.

 

 


స్పెల్లింగ్ తెలుసుకునుండటం ముఖ్యం. నలుగురు దొంగలు

రోం లోని ఓ సూపర్ బజార్ లో లిక్కర్ బాటిల్స్ దొంగిలించి పారిపోతున్న ఓ దొంగ వెంట పట్టుకోండి, దొంగ అని అరుస్తూ ఒకరిద్దరు పరిగెత్తారు. తీరా అతను రోం పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందునించే పరిగెత్తుతున్నాడు. ఆ అరుపులు విన్న పోలీసులు అతన్ని తక్షణం పట్టుకున్నారు.
లిక్కర్ బాటిల్స్ దొంగిలించినవే కానీ ఈ చాక్లెట్ మాత్రం నాది. అని ఆ స్టోర్ లో అది కొన్న రసీదు చూపించాడు ఆ దొంగ.