దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

న్యూయార్క్ కి చెందిన 22 ఏళ్ళ క్రిస్టఫర్ ఓ 'రాత్రి ఆడ కంపెనీ' కోసం దినపత్రికలో వచ్చిన ప్రకటనలోని పర్సనల్ కాలమ్ లోని ఓ ఫోన్ నెంబర్ కి ఫోన్ చేసి, తనకు రాత్రి కంపెనీ కావాలని చెప్పాడు. అయితే అతడు పొరబాటున ఓ నెంబర్ కు బదులు మరో నెంబర్ కు డయల్ చేశాడు. అది పోలీస్ స్టేషన్ నెంబర్ కావడం అతని దురదృష్టం.

ఆ కాల్ ను రిసీవ్ చేసుకున్న లేడీ పోలీస్ ఆపరేటర్ అతను చెప్పిన టైంకి, చెప్పిన ప్రదేశానికి సివిల్ దుస్తులలో వెళ్ళింది. వారి మధ్య సంభాషణను రికార్డు చేసిన పోలీసులు అతన్ని వ్యభిచార నేరానికి ప్రయత్నించిన కారణంగా అరెస్టు చేశారు. వారి పరిశోధనలో పర్సనల్ కాలమ్ లోని ఎస్కార్ట్ సర్వీస్ అనే ప్రకటనలలో ఎక్కువ భాగం వేశ్యల నుంచి అని తేలడంతో వారందరినీ కూడా ఆ తరువాత అరెస్టు చేశారు.

....................................................................................................................

కేలిఫోలో సేనోజా నగరంలోని ఎల్మ్ఉడ్ కరెక్షనల్ ఫెసిలిటి అనే జైల్లో శిక్షననుభవిస్తున్న ఆర్నాల్డ్ (25) తన సెల్ లోంచి బయటపడి 20 అడుగుల ఎత్తున్న జైలు ఫెన్స్ ఎక్కి కిందకి దూకాడు. అయితే అతను పబ్లిక్ రోడ్డు మీదకి ఉన్న ఆడ ఖైదీల విభాగం వైపున ఫెన్స్ లోకి దూకాడు. దాంతో అతను పట్టుబడ్డాడు.