అందరూ మహానుభావులే - కళాసాగర్

andaroo mahanubhavule

1200 పుటలతో పెద్ద బాలశిక్షను 116 రూపాయలకే తెలుగు వారికి అందించిన అన్నపూర్ణ పబ్లిషర్స్, పెద్ద బాలశిక్షను రూపొందించిన డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి సంపాదకత్వంలో వెలువరించిన గ్రంధం ఈ ' అందరూ మహానుభావులే '

గత వెయ్యేళ్ళ కాలంలో వివిధ రంగాలలో గుర్తింపు పొందిన 1200 మందికి పైగా ప్రముఖుల పరిచయాలతో, ఫోటోలతో ప్రచురించిన ఈ గ్రంధం వెయ్యేళ్ళ తెలుగువారి చరిత్రకు ఒక దర్పణం లాంటిదని చెప్పవచ్చు. జీవిత చరిత్ర రచనలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి పురస్కారం అందుకున్న డాక్టర్ వెలగా వెంకటప్పయ్య సుమారు మూడేళ్ళు శ్రమించి సేకరించిన సమాచారంతో ప్రచురించారు.

ఇందులో చక్రవర్తులు, నవాబులు, జమీందారులు, సన్స్థానాధిపతులు, విదేశీ పాలకులు, మిషనరీలు, కేంద్ర ప్రభుత్వ పాలనా రంగం, రాష్ట్ర రాజకీయ రంగ ప్రముఖులు, సామజిక రంగం, సమాజ సేవకులు, దాతలు, మానవ వనరులు రంగం, వైద్య రంగం, న్యాయ రంగం, శాస్త్ర-సాంకేతిక రంగం, ఉత్పత్తి రంగం, ప్రచురణకర్తలు, చరిత్ర పరిశోధకులు, ధార్మిక రంగం, దృశ్య కళారంగం, చిత్రకళ, శిల్పకళ్, నృత్యం, సంగీత కళాకారులు, హరికథ, బుర్రకథ,సినిమా, క్రీడారంగం, భాషా సాహిత్య రంగాలు, నవీన కవులు, నాటక కర్తలు, బాల సాహితీవేత్తలు, సుగమశాస్త్ర రచయితలు, తదితర రంగాలకు చెందిన ఎందరో వ్యక్తులను పరిచయం చేసారు.

సమగ్ర గ్రంధం అనలేము కానీ, తెలుగులో ఈ మాత్రం కృషితో ఇంతమంది ప్రముఖుల జీవిత విశేషాలతో ఇంతకుముందు మరే పుస్తకం వచ్చిన దాఖలాలు లేవు. సంపాదకులు తమ ముందుమాటలో ఇది ఒక ముసాయిదా ప్రతి అన్నారు కాబట్టి భవిష్యత్ లో వీలైనంత సమగ్రంగా వీరి నుంచి ఆశించవచ్చు. ఇందుకు పబ్లిషర్స్ కు, సంపాదకునికి, జర్నలిస్టులు, రచయితలు తమవంతుగా ఇందులో చేర్చేందుకు ప్రముఖుల పరిచయాలు, సవరణలు చేసేందుకు మరింత సమాచారాన్ని అందించి సహకరిస్తే, ఒక మంచి సమాచార గ్రంధాన్ని తెలుగు వారికందించిన వారిలో మీరూ భాగస్వాములౌతారు.

సుమారు వెయ్యి పేజీలతో ప్రచురించిన పబ్లిషర్స్ అన్నపూర్ణ వారు, సంపాదకులు వెలగా వెంకటప్పయ్య గారు అభినందనీయులు. దీనిని అతి తక్కువ ధరకు రూ. 116/- లకు అందించడం గొప్ప విశేషం. ప్రతి ఇంట్లోనూ,గ్రంధాలయాల్లోనూ, పాఠశాలల్లోనూ ఉండవల్సిన చక్కని గ్రంధం ' అందరూ మహానుభావులే '

ప్రతులకు : అందరూ మహానుభావులే
అన్నపూర్ణ పబ్లిషర్స్,
ఫోన్ : 040 64516190
మరియు
అన్ని పుస్తక విక్రయ కేంద్రాల్లోనూ.

 

మరిన్ని వ్యాసాలు

ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మొధెరా సూర్య దేవాలయం.
మొధెరా సూర్య దేవాలయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
హవామెహల్ .
హవామెహల్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు