మీ పలుకు - పాఠకులు

నమస్తే..
మీరు పోస్ట్ చేసిన రాజా మ్యూజిక్ ముచ్చట్లు చూసి ఇలా రాస్తున్నా! కధ, ప్లాటు, టైటిల్, సీన్లు, మ్యూజిక్, లిరిక్స్ ఇలాటివి ఎంతో కాలంగా ఎన్నో సినిమాలలో లిఫ్ట్ చేయడం, వాడడం, ఇన్స్పైర్ అవడం, కాపీ కొట్టడం లాంటివి జరిగాయి, జరుగుతున్నాయి, జరుగుతాయి కూడా. 1940-50 లో జరిగిన విషయాలు తీసుకొచ్చి మన ఎదురుగానే అన్యాయం జరిగిందన్నంత గా ఫొటోలో వీడియోలో చూపించి రాయడం ఆయా పాటలు, గాయకులు, రచయితలు, సంగీత దర్శకుల మీద ఉన్న గౌరవం పోగొడుతుందేమో ఆలోచించండి.

మ్యూజికాలజిస్ట్ గారికి ప్రత్యేకం గా వినతి..ఏదైనా నిర్మాణాత్మకంగా.. ఉండే విషయాలు తెలియజేస్తే బాగుంటుంది. పాట వెనక కధ, సిట్యుయేషన్ గురించిన వివరాలు, రచయిత ఫలానా పదం వాడడానికి కారణం లాంటివి.
--- ఫణి మాధవ్ కస్తూరి

 మీ తొలి సంచిక చూసాను. నిన్న మళ్ళీ మీ సంచిక చూసాను. బహుశా అది ఎనిమిదవ సంచిక అనుకుంటా. చాలా మార్పులు గమనించాను. ఇప్పుడు నిజంగా వార పత్రిక చదువుతున్నట్టుగానే వుంది.కీప్ ఇట్ అప్.
---సాయికృష్ణ, నందరాడ

టాగోర్ ఎంత అద్భుతంగా రాసారో నాకు తెలియదు కాని... వంశీ గారు మాత్రం చదివిన వారందరినీ గుల్ బాగ్ లో ఎన్నో రాత్రుళ్ళు తిప్పేసారు. ఒక కథ ఇంతలా కదిలిస్తుందా?
---వేడుల సూర్యనారాయణ మూర్తి

మన పత్రికలో రాస్తున్న కొంతమంది రచయితల్లో ఏదో రాసామన్నట్టు కాకుండా కసి కనబడుతోంది! ఉదాహరణకు శాస్త్రి గారి 'సుశాస్త్రీయం' మరియు రాజా గారి 'మ్యూజిక్ ముచ్చట్లు' . .  ఎంతో శ్రమించి పరిశోధన చేస్తే కానీ ఆ అవుట్ పుట్ రాదని ఓ కవిగా నాకు తెలుసు! అభినందనలతో ....
- సత్యాన్వేషి, సత్యనారాయణపురం 

'ఆంద్రరత్న' శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి గురించి చక్కగా వివరించారు. శాస్త్రి గారికి ధన్యవాదాలు.  ఇటువంటి వారు మరల పుట్టాలని, దేశాన్ని బాగుచేయాలని కోరుతూ.. .
---నాగయ్య, హైదరాబాద్
 


 

మరిన్ని వ్యాసాలు

కృష్ణణ్ - పంజు .
కృష్ణణ్ - పంజు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సప్త బద్రి.
సప్త బద్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
పాటల పల్లకి
పాటల పల్లకి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Idi koodaa marpe
ఇది కూడా మార్పే
- మద్దూరి నరసింహమూర్తి