జాతకచక్రం (జూన్ 8 నుండి 14 వరకు) - శ్రీ నంద

'గోతెలుగు.కామ్' పాఠకుల ప్రశ్నలకు శ్రీ నంద గారు సమాధానాలిస్తారు. మీ యొక్క ప్రశ్నలను(ఒక్కటి మాత్రమే) మీ పేరు, పుట్టిన తేది, సమయం, పుట్టిన ఊరు జతచేసి '[email protected] ' కి పంపగలరు. 
 


దయచేసి నా పూర్తి జాతకం తెలుపగలరు - నాగార్జున ఆతుకూరి, మార్కాపూర్
నాగార్జున గారు హస్తా నక్షత్రం కన్యారాశికి చెందిన వారు. ప్రస్తుతం రాహు మహర్దశలో బుధఅంతర్దశ నడుస్తున్నది. మీకు లేదా కుటుంబ సభ్యులలో ఎవరోఒకరికి తరచు అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. స్థిరమైన ఆలోచనలు చేయరు.  కుటుంబంలో మీయొక్క ఆలోచనలు తరచు మార్చుతుంటారు. గట్టిగా ప్రయత్నిస్తే ఉన్నత విద్యా /ఉద్యోగ అవకాశాలు బాగున్నవి. ఆదిశగా ప్రయత్నం చేయండి. వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. పెద్దల మాటలను వినడం మేలుచేస్తుంది. అధికంగా కోపాన్ని కలిగి ఉండుట లేదా ధనం ఖర్చుచేయుటలో సరైన ప్రణాళిక లేకపోవడం వలన ఇబ్బందులను పొందుతారు. అనారోగ్య విషయంలో సరైన శ్రద్ధను చూపండి. వాహనములు నడుపునప్పుడు నిదానంగా ఉండటం సూచన. ప్రతి సోమ,మంగళ వరాలు దుర్గాదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయం వీలుత అలవాటుగా చేసుకోండి. వరుసగా 17 బుధవారాలు వెంకటేశ్వర దేవాలయం వెళ్ళండి.

నా యొక్క వుద్యోగం మరియు వివాహం గురించి తెలుపగలరు. నా వివాహం నేను కోరుకున్న వ్యక్తితో జరుగుతుందా? లావణ్య
లావణ్య గారు మీరు భరణి నక్షత్రం మేషరాశికి చెందినవారు. ప్రస్తుతం కుజ మహర్దశలో గురు అంతర్దశ నడుస్తుంది. అక్టోబర్ 2013 తర్వాత శని అంతర్దశ ప్రారంభమవుతుంది. మీరు జీవితం విషయంలో కోరికలను కలిగి ఉంటారు. వివాహం విషయంలో మీకు నచ్చిన వ్యక్తిని చేసుకోవాలో లేదో అర్థంకావడం లేదు అటు పెద్దలు ఇటు మీ కోరికలు మధ్య ఆలోచనలో పడ్డారు. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. 2013 అక్టోబర్ వరకు ఆగండి. ఆతర్వాత నిర్ణయం తీసుకోండి. మీ మాటను అందరు వినాలన్న కోరికను కలిగి ఉంటారు. ధనం విషయంలో మాత్రం కొంత అశ్రద్ద ఉంటుంది. ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన భయాలను వదలండి. ఆరోగ్యాన్ని అశ్రద్ద చేయకండి చదువు పైన శ్రద్ధను పెట్టండి. వరుసగా 16 రోజులు శివాలయం వెళ్ళండి ఎరుపు లేదా పసుపు పూలతో స్వామిని పూజించుట. 7 మంగళవారాలు ఆంజనేయ ఆలయం వెళ్ళండి మేలుజరుగుతుంది. ప్రతిరోజు సుబ్రమణ్య అష్టకం చదవండి.

నా యొక్క వుద్యోగం మరియు వివాహం గురించి తెలుపగలరు - బాలు, గుమ్మలదిబ్బ
బాలు గారు జనన సమయం సరిగ్గా ఉదయమా సాయంత్రమా తెలుపలేదు. మీరు మూలా నక్షత్రం ధనుస్సు రాశిలో జన్మించారు. సమయం సరిగా తెలుపని కారణంచేత న్యూమరాలజీ ప్రకారం తెలుపుతున్నాను. మంచి వ్యక్తిగా గుర్తింపును కలిగి ఉంటారు. కాకపోతే ఏ పనిచేసిన నిదానంగా పూర్తిచేస్తారు. 2013 జూన్ తర్వాత బాగుంటుంది అనుకున్నవి సాధిస్తారు. బద్దకాన్ని వదిలి కష్టించి పనిచేయండి. ప్రభుత్వఉద్యోగ అవకాశాలు కలవు అందిపుచ్చుకొనే ప్రయత్నం ఆరంభించుట మంచిది. BALU అనేపేరు బాగుంది మార్పులు అవసరం లేదు.  అలాగే మీ ఇంటి పేరు కూడా ముందు రాయకండి.  తప్పనిసరి రాయవలసి వస్తే పేరు చివర్ వ్రాయండి. 19 శనివారాలు ఆంజనేయ స్వామీ దేవాలయం వెళ్ళండి. 1.25 kg నల్లనువ్వులు దానం చేయండి. వివాహం 2013 ఆగస్ట్ నుండి 2014 ఏప్రిల్ లోపు అవుతుంది. వివాహం అవడానికి ప్రతి గురువారం ఉపవాసం చేయుట మంచిది.

నా భవిష్యత్తు గురించి వివరించగలరు -  రమణ మూర్తి, సాలూరు, విజయనగరం
రమణమూర్తి గారు మీరు కృత్తికా నక్షత్రం, మేషరాశికి సంభందించిన వారు. మీలో మంచి నేర్పు సృజనాత్మకత ఉంటుంది.  పనిని పూర్తిచేసే విధానం కూడా బాగా తెలుసు. హుందాగా ఉండటానికి ఇష్టపడుతారు. వ్యాపారం పట్ల మక్కువను కలిగి ఉండే అవకాశం కలదు కాకపోతే వ్యాపారం ద్వార మీరు ఆశించిన లాభాలను పొందలేరు.  కావున చేయకపోవడం మంచిది. కోపాన్ని కలిగి ఉంటారు. పెద్దల ద్వారా సంక్రమించిన వ్యాది వలన భాదపడే అవకాశం కలదు జాగ్రత్తగా ఉండటం సూచన. ప్రస్తుతం గురు మహర్దశ లో బుధ అంతర్దశ నడుస్తున్నది.  డిసెంబర్ 2013 తర్వాత కేతు అంతర్దశ ప్రారంభవుతుంది. ఆర్థికంగాసంపాదన ఉన్నను ధనంను చేతిలో ఉంచుకోనుటలో ఇబ్బందులు పొందుతారు. కుటుంభ లభాదిపతి ఉచ్చలో ఉండటం మూలాన సంప్రదాయ కుటుంభానికి చెందినా వారుగా ఉండే అవకాశం కలదు పెద్దకుటుంభంలో జన్మించిఉంటారు. గత రెండుసంవత్సరాలుగా ఇబ్బందులను పొందుతున్నారు 17 బుధవారాలు గణపతి గుడికి వెళ్ళండి ప్రతిరోజు విష్ణుసహస్రనామం చదవండి. ఇతరులతో కలిసి మెలిసి ఉండండి అలాగే ఎక్కువ చోరువ కూడా వద్దు. 2014 లో మంచి ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. మానసికంగా దృడంగా ఉండండి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించుట మంచిది. శివునకు గురువారం అభిషేకం చేయండి మంచిఫలితాలు కలుగుతాయి.

నా వ్యక్తిగత జీవితం, భవిష్యత్తు మరియు కెరీర్ గురించి తెలుపగలరు - మహేష్ బాబు, జడ్డంగి
మహేష్ బాబు గారు మీరు హస్తా నక్షత్రం కన్యరాశి కి చెందినవారు. ప్రస్థుతం గురు మహర్దశలో గురు అంతర్దశ మే 2013 లో ప్రారంభమయ్యింది. గురు మహర్దశ 2013 నుండి 2029 వరకు ఉంటుంది. మీరు అందరిని కలుపుకొని వెళ్ళు మనస్తత్వాని కలిగి ఉన్నను కొంత మొండితనంతో ఉండుట చేత చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం కలదు.  అలాగే మాట్లాదేవిధానంలో పైకి గట్టిగా అంటే హర్ష్ గా ఉండే అవకాశం కలదు. మీకు యోగకారక గ్రహం గురుడు 6 లో ఉండుట చేత రుణముల వలన ఇబ్బందులు కలుగుతాయి. డబ్బుకు సంబందించిన విషయంలో జాగ్రత్తగా లేకపోతే మిత్రులే శత్రువులు అయ్యే అవకాశం కలదు. మీరు ఒకరి క్రింద పనిచేయడానికి ఇష్టపడరు. అలాగే ఒకే వృత్తిలో ఎక్కువకాలం సంతృప్తితో చేయలేరు. మీరు చక్కని ప్రణాళికతో పెద్దల సూచనలతో ముందుకు వెళితే అడ్మిన్ రంగంలో బాగా రాణిస్తారు. గుర్తింపు కల హోదాను సంపాదించుకుంటారు. మీ స్వంత ఆలోచనల కన్నా పెద్దల అనుభవాలకు విలువ నివ్వండి మేలుజరుగుతుంది. 2015 వరకు గురులో గురువు సంచరిస్తున్నాడు కావున ఈ రెండున్నర సంవత్సరాల కాలం ఆర్థికపరమైన విషయాల్లో నిదానంగా ఉండుట మంచిది. మీరు చేస్తున్న ఉద్యోగంలో కొంత అసంతృప్తిని కలిగి ఉంటారు 2014 తప్పక బాగుంటుంది కావున అంత వరకు వేచి చూడడం ఉత్తమం. సమయానికి భోజనం చేయుట లేదా మితంగా భుజించుట మేలు చేస్తుంది. ఆరోగ్య పరంగా జాగ్రత్తలు అవసరం. చక్కటి ఫలితాల కోసం ప్రతి గురువారం శివాలయం వెళ్ళండి. 16 ప్రదక్షణలు చేయండి. మీకు వీలైనన్ని గురువారాలు గోమాతకు పచ్చగడ్డి తినిపించుట మంచి ఫలితాలను ఇస్తుంది. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయుట వలన ఆరోగ్యసమస్యలు తగ్గుతాయి.

నేను నవంబర్ 2003 నుండి నా Ph.D. పూర్తిచేయలేక పోతున్నాను. కనీసం ఈ సారైనా పూర్తి చేయగలనా తెలుపగలరు - నాగమణి, విడపనకల్లు, అనంతపురం
నాగమణి గారు మీరు ఉత్తరాషాడ నక్షత్రం మకరరాశికి సంభందించిన వారు. ప్రస్తుతం మీకు గురు మహర్దశ నడుస్తున్నది. 2015 ఉగాది వరకు గురువులో శని సంచారం కలదు. 2004 నుండి 2007 వరకు మీకు మంచి అవకాశాలు ఉండినవి కాని ఆ సమయంలో గట్టిగా ప్రయత్నం చేయకపోవడం చేత కొంత కాలం ఆలస్యం అయ్యింది. మీరు కొంత బద్దకంతో ఆలస్యం చేసారు అని చెప్పవచ్చును.  అంటే ప్రయత్నంలో మొదట ఉన్న ఉత్సాహం ఆపని పూర్తీ అయ్యే వరకు లేకపోవడం చేత కూడా సమస్యలు కలిగినవి.  2013 జూలై చివరి నుండి తప్పక మే యొక్క  Phd  తప్పక వేగంగా ముందుకు సాగుతుంది కాకపోతే కొంత ప్రయత్నం అవసరం. ఈ సంవత్సరం మీరు చాలావరకు పూర్తి చేయగలుగుతారు. అలాకాని పక్షంలో 2014 సెప్టెంబర్ లోపు తప్పక పూర్తిఅవుతుంది. 2010 నుండి 2012 మధ్యకాలంలో మాత్రం కుటుంబం లో కలిగిన సమస్యల కారణంగా అలాగే ఆర్థికఇబ్బందుల మూలాన ఆలస్యం అయ్యింది. సమస్యలు నిదానంగా తొలగుతాయి. ప్రతిరోజు విష్ణుసహస్ర నామం చదువుట అలాగే వరుసగా 19 శనివారాలు హనుమాన్ దేవాలయం వెళ్ళండి 19 ప్రదక్షణలు చేయుట అలాగే స్వామివారి సింధూరం ధరించుట చేత తప్పక మేలుజరుగుతుంది. ఒక మూడు గురువారాలు మాత్రం శివునకు అభిషేకం చేయుట 1. 25 kg ల శనగలు దానం ఇవ్వండి అలాగే లక్ష్యం కోసం పనిచేయండి మీరు అనుకున్నది తప్పక సాధిస్తారు.

మా అమ్మాయి పూర్తి జాతకమును తెలుపగలరు. సాయి శ్రీహిత, అనకాపల్లి
మీ అమ్మాయి విశాఖ నక్షత్రం తులారాశిలో జన్మించిది. మీ పాప కాలసర్పయోగంలో జన్మించింది. తనకు సంభందించిన వరకు ప్రతి పని కూడా నిదానంగా పూర్తిఅవుతుంది కావున తొందరపాటును ప్రదర్శించుట మంచిది కాదు. ప్రస్తుతం మీ పాపకు గురుసంచారం నడుస్తుంది.  గురుడు సప్తమంలో ఉండి నీచను పొంది ఉన్నాడు కావున కొంత సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్దిని నిదానంగా కలిగి ఉంటారు.  ప్రస్తుతం చిన్న పాపనే కాబట్టి మీరు మిత్రునిగా తనకు ప్రతివిషయంలో ఏవిధంగా ఆలోచన చేయాలో నేర్పడం మంచిది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. నెలకు ఒకమారు గురువారం శివునకు అభిషేకం చేయుట ఉత్తమం. చదువు విషయంలో తను ఒక్క సారి చదివితే చాలు కాకపోతే కూర్చోబెట్టడమే కష్టం కాబట్టి. తనకు నచ్చ చెబుతూ చదువును కొనసాగించుట మంచిది. రాను రాను కోపం పెరుగుతుంది. అలాగే ఆర్థిక విషయాల్లో అసంతృప్తి ఉండుటకు వకాశం కలదు కావున మీరు ప్రతి విషయంలో తనకు సరైన అవగాహన ఉండేలా చూడటం సూచన. ఒకసారి సుబ్రమణ్య స్వామికి అభిషేకం చేయుట అలాగే శనివారం శివునకు అభిషేకం చేయుట మంచిది తరుచు ఈవిధంగా చేయుట మంచి ఫలితాలను ఇస్తుంది.  
 

 

వార ఫలాలు (జూన్ 8  - జూన్ 14)

 


మేష రాశి
ఈవారం మీరు ఆశించిన ఫలితాలు రాకపోగా ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. మాటలను పొదుపుగా వాడుట మంచిది. వ్యాపరస్థులు నిదానంగా అడుగులు ముందుకు వేయండి. ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట మంచిది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. వారితో కలిసి నూతన పనులను ఆరంభించే అవకాశం కలదు. మనోదైర్యంను కలిగి ఉండి ముందుకు వెళ్తారు. కొత్త కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు. బంధుమిత్రులతో మాటపట్టింపులు కలుగుటకు అవకాశం కలదు. కావున నిదానంగా వ్యవహరించుట మంచిది. చేయువృత్తిలో జాగ్రత్తగా ఉండుట ఆలోచించి పనులను ఆరంభించుట ఉత్తమం. తలపెట్టిన పనులు నిదానంగా సాగుతాయి. అనుకున్న పనులను చేయలంటే సాధన, శ్రద్ద అవసరం. అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట తోటి ఉద్యొగులతో కలిసి పనిచేయుట అదేవిధంగా వారికి అనుకూలంగా ఉండుట మంచి ఫలితాలను ఇస్తుంది. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు. కొంత ఆచితూచి వ్యవహరించుట మేలు. శత్రువులు పెరుగుటకు అవకాశం కలదు. కావున జాగ్రతగా ఉండుట చేసే పనిపట్ల శ్రద్ధను కలిగి ఉండుట ఉత్తమం. దూరప్రదేశాలకు వెళ్ళాలనే మీ ఆలోచన ముందుకు కదులుతుంది. ఉత్తమ ఫలితాలు కలుగుటకు లేదా ఇబ్బందులు తొలుగుటకు ప్రతిరోజు దేవాలయం వెళ్ళుట. శివునకు రుద్రాబిషేకం చేయండి. అలాగే ప్రతిరోజు సూర్యునకు నమస్కారం చేయుట మంచిది.    

వృషభ రాశి
ఈవారం చిన్న సంఘటనలు మినహా మిగితా అంతా మీరు ఆశించిన విధంగానే ఉంటుంది. వారం ఆరంభంలో ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. మీ అంచనాలు నిజమవుతాయి. భోజనసౌఖ్యంను పొందుతారు. ఉత్సాహంను కలిగి ఉంటారు. నూతన పనులను చేపడుతారు. మాటలను పొదుపుగా వాడుట ఉత్తమం అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన పనులు ముందుకు సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులకు పోకండి. కుటుంబంలో కలహములు కలుగుటకు అవకాశం కలదు. నూతన పరిచయాలు కలుగుటకు అవకాశం కలదు. వాటితో మీరు ఆశించిన ఫలితాలు లభించుటకు అవకాశం కలదు. వ్యాపారులు క్రయవిక్రయముల మూలాన లాభంను పొందుటకు అవకాశం కలదు. ధర్మసంబంద కార్యక్రమాల పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు. వాటిలో పాల్గొనుట మూలాన లాభంను పొందుటకు అవకాశం కలదు. తోటివారితో సహాయసహకారాలు లభించుట చేత సంతోషాన్ని పొందుటకు అవకాశం కలదు. గతంలోనుంచి మీరు దృష్టిని సారించుట చేత ఆరోగ్యం నిదానంగా కుదుటపడుటకు అవకాశం కలదు. స్త్రీ / పురుషుల పరిచయాల మూలాన సౌఖ్యంను పొందుట జరుగుతుంది. నూతన గృహనిర్మాణంకు సంబందించిన విషయాల్లో కొంత శ్రద్ధను చూపించుట చేత పనులు ముందుకు సాగుతాయి. మరిన్ని మంచి ఫలితాల కోసం ఆంజనేయ స్వామికి సింధూరపూజ చేయుట అలాగే గణపతిని ఆరాదించుట మేలుచేస్తుంది.     

మిథున రాశి
ఈవారం కొంత శ్రమను పొందవలసి రావొచ్చును. కాకపోతే మానసికంగా దృడంగా ఉండుట చేత బాగుంటుంది. అధికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో శ్రమను పొందుతారు ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. ఖర్చును పొందుతారు. అనుకోని ఖర్చులు వచ్చిపడుతాయి. అదుపులో ఉంచుకోనుటలో విఫలం అవుతారు. బంధుమిత్రులతో స్వల్ప ఇబ్బందులను ఎదుర్కొనుట చేత వారితో కొంత విభేదాలు పొడచూపుతాయి. ఆర్థికపరమైన విషయంలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. మీకు మీరే సర్దిచెప్పుకొనుట చేత వారం మధ్యలో చేపట్టిన పనులలో పురోగతిని సాదించుటకు అవకాశం కలదు. మీయొక్క ఆలోచనలను అలాగే మాటలను జాగ్రత్తగా వాడుట చేత మేలుజరుగుతుంది. పనిలో భారంను కలిగి ఉండుట చేత అలసిపోతారు. శరీర ఆయాసంను పొందుటకు అవకాశం కలదు. భోజనం విషయంలో మాత్రం అశ్రద్ద చేయకండి తగిన జాగ్రత్తలు పాటించుట మేలుచేస్తుంది. ఉద్యోగంలో మీ ఆలోచనలను తోటివారు తప్పుగా అర్థం చేసుకొనే అవకాశం కలదు జాగ్రత్త. అధికారులకు అనుకూలంగా ఉండటం కూడా చెప్పుకోదగ్గ సూచన. నూతన పరిచయాల మూలాన కొత్త విషయాలు తెలుసుకొనే అవకాశం కలదు. అకారణంగా ఏర్పడు మిస్ కమ్యూనికేషన్ పట్ల జాగ్రత్తగా ఉండుట మంచిది. మరింత మంచి ఫలితాల కోసం దుర్గాదేవిని ఆరాదించుట అలాగే శివాభిషేకం మంచిది.  

కర్కాటక రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలను పొందుటకు అవకాశం కలదు. అనుకున్న పనులు జరగడానికి ప్రణాళిక అవసరం. ఆర్థికంగా లాభంను పొందుతారు. చేపట్టిన పనులలో లాభంను కలిగి ఉండుటకు అవకాశం కలదు. మీకు నచ్చిన విధంగా ఉండుటకు ప్రాముఖ్యతను ఇస్తారు. భోజనం విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధను చూపిస్తారు. బంధువులతో కలిసి విందులు వినోదాలలో పాల్గొంటారు సరదాగా గడుపుతారు. మీరు అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చును కలిగి ఉంటారు. ఈ విషయంలో మాత్రం కొంత భాదను పొందుటకు అవకాశం కలదు. బంధువులతో చర్చలు పెట్టకపోవడం అనునది సూచన. మనోదైర్యంను కలిగి ఉండి నూతన పనులను ఉత్సాహంతో ఆరంభించుటకు అవకాశం కలదు. ప్రయత్నాలలో ముందుకు వెళ్ళగలుగుతారు అనుకున్న పనులు నెరవేరుతాయి. నూతన వస్త్ర ప్రాప్తిని కలిగి ఉంటారు సంతోషంగా గడుపుతారు. చిన్న చిన్న అసంతృప్తులను కలిగి ఉన్నాను. వాటిని పట్టించుకోక ముందుకు వెళ్ళుట వలన తప్పక మేలుజరుగుతుంది. ధర్మసంబంద పనుల దృష్ట్యా ఖర్చును పొందుటకు అవకాశం కలదు. విలువైన వస్తువులను కొనాలనే ఆలోచనను ఒకవేళ కలిగి ఉంటే వాయిదా వేసుకొనుట గతంలో కొన్న వస్తువులను జాగ్రత్తగా చూసుకోనుట మంచిది. మరొక ప్రదేశంలో ఉండవలసి రావొచ్చును. అనుకున్న ఫలితాలు కలుగుట కోసం లక్ష్మీదేవికి అభిషేకం చేయుట అలాగే రాఘవేంద్రస్వామి ఆరాధన చేయుట మంచిది.   

సింహ రాశి
ఈవారం అనుకూలమైన ఫలితాలను కలిగి ఉంటారు అనిచెప్పుకొవచ్చును. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో అభివృద్దిని కలిగి ఉంటారు చేసేపనిలో పేరును సంపాదించుకుంటారు. అధికారులతో వారికి అనుగుణంగా నడుచుకొనుట చేత పనులలో వేగం ఉంటుంది ఆశించిన ఫలితాలు రాబట్టుతారు. రాజకీయ సంబంద విషయాల్లొ అనుకున్నవి నెరవేరుతాయి. నూతన ప్రయత్నాలు సానుకూలపడుతాయి. గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న లేదా పెండింగ్ పనుల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారు. బంధుమిత్రులను కలుస్తారు వారి గృహంలో సమాలోచనలు, చర్చలను చేబట్టుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో ధన లాభంను కలిగి ఉంటారు. పురోగతి ఉంటుంది. ఇష్టమైన పనులలో ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉండి వేగంగా అ పనులను పూర్తిచేయుటకు అవకాశాలు కలవు. కాకపోతే వారం చివరలో మాత్రం ఖర్చు అదుపు తప్పుటకు అవకాశాలు కలవు ఊహించని ఎదురుదెబ్బలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండుట సూచన. కొంత సంచారం చేయవలసి రావొచ్చును. పనిభారంను పొందుటకు అవకాశాలు కలవు. చేసేపనిలో ఉత్సాహంను కలిగి ఉండి మీ ప్రత్యేకమైన ముద్రను వేయుటకు అవకాశం ఉంది. ధర్మసంభంద కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి బుద్ధిబలం చేత పనులను కొనసాగిస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి సుబ్రమణ్య ఆరాధన అలాగే స్వామివారికి అభిషేకాలు మంచివి.      

కన్యా రాశి
ఈవారంమిశ్రమ ఫలితాలు ఉంటవి చేపట్టే పనులలో అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించుట మేలుచేస్తుంది. నూతన ప్రయత్నాలలో సమయాన్ని గడుపుతారు పనులను వేగవంతం చేస్తారు. బంధువుల యెడల ప్రత్యేకమైన శ్రద్ధను చూపిస్తారు. వారితో కలిసి నూతన ప్రయత్నాలు చేయుటకు అవకాశం కలదు. మీ వలన వారి లబ్దిని పొందుటకు అవకాశం కలదు. ఆర్థికపరమైన లాభాన్ని కలిగి ఉంటారు. కాకపోతే వాటిని ఆలోచించి వినియోగం చేయుట ఉత్తమం. అనవసరపు ధనవ్యయం పెరుగుటకు అవకాశాలు కలవు. కావున నూతన వస్తువులను కొనడం అలాగే ఖర్చును అదుపులో ఉంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. అనవసరంగా మాట పట్టింపులకు పోకండి వివాదములు కలుగుతాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు కలుగుటకు ఆస్కారం ఉంది సర్దుకుపొండి. వారికి అవకాశాలు ఇవ్వడం మూలాన మేలుజరుగుతుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. స్థానచలనంకు అవకాశం కలదు మరొక ప్రదేశంలో నివసించవచ్చును. ఇతరులను అప్పగించిన పనులలో కార్యాలస్యంను పొందుటకు అవకాశం కలదు. వాటిని ప్రత్యేకంగా పట్టించుకోనుట మూలాన పనులలో ఇబ్బందులు కలుగకపొవచ్చును. అకారణంగా భయంను పొందుటకు అవకాశాలు కలవు ఆలోచనలు తగ్గించుకొనుట సూచన. శత్రువుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నిదానంగా ఉండటం ఉత్తమం. చక్కటి ఫలితాల కోసం హనుమాన్ ఆలయం వెళ్ళుట,సాయిబాబా ఆరాధన మేలుచేస్తాయి.   

తులా రాశి
ఈవారం కొంత పనులలో వేగం తగ్గుటకు అవకాశం కలదు. అలాగే ప్రతి పనిని ఆలోచించి చేపట్టుట వలన మంచి ఫలితాలు కలుగుటకు అవకాశం కలదు. వారంలో మీరు ఊహించిన విధంగా ఉండకపోవచ్చును. ఆశించిన ఫలితాలు రాకపోవడం చేత కొంత నిరాశను పొందుతారు. వారం ఆరంభంలో ఆరోగ్యసమస్యలు ఇబ్బందిని పెట్టుటకు అవకాశం కలదు. మోకాళ్ళ నొప్పులు కలుగుటకు అవకాశం కలదు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించుట చేయండి. కుటుంబంలో మీరు ఆశించిన విధంగా ఉండకపోవచ్చును. వివాదములు కలుగుటకు అవకాశం ఉంది. నిదానంగా ఉండుట సూచన. గట్టిగా ప్రయత్నం చేయుట ద్వార పనులను ముందుకు తీసుకువెళ్లగలరు. అలాగే సమయ పాలనను పాటించుట వలన మేలుజరుగుతుంది. ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే తగిన జాగ్రత్తలు పాటించుట మేలుచేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది. కాకపోతే కోరికలను అదుపులో ఉంచుకొనుట మూలాన ఇబ్బందులు తగ్గుతాయి. లేకపోతే ఖర్చులు పొందుతారు. మనోదైర్యంతో ముందుకు వెళ్ళుట అలాగే చేపట్టిన పనులలో ఉత్సాహాన్ని కోల్పోకుండా ఉండుట మూలాన ఫలితాలు కలుగుటకు ఆస్కారం ఉంది. గృహలాభంను పొందుటకు అవకాశం కలదు. అలాగే పెద్దల సూచనలు పాటించుట చేత లాభం ఉంటుంది. ప్రయత్నాలలో విజయం సాదించుటకు అవకాశం ఉంది ముదుకు వెళ్ళండి. మాటలను పొదుపుగా వాడుత కోపాన్ని తగ్గించుకొనుట చేత మేలుజరుగుతుంది. మంచి ఫలితాల కోసం దుర్గాదేవి ఆరాధన అలాగే వేంకటేశ్వరస్వామికి పూజ చేయుట ఫలితాలను కలుగజేస్తుంది. 

వృశ్చిక రాశి
ఈవారం ఆర్థికంగా సంపాదనను కలిగి ఉన్నప్పటికిని ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉండుటకు అవకాశం ఉంది. ప్రతిపనిలోను మాములుగా ఉండే అవకాశం కలదు. పెద్దగా ఆశించకుండా మీ పనులను చేస్తూ వెళ్ళుట వలన ఫలితాలు పొందుటకు అవకాశం కలదు. కుటుంబంలోని సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించుట ఉత్తమం. చేపట్టిన పనులలో స్వల్పఆటంకాలు కలుగుటకు అవకాశం కలదు కావున ఒకటికి రెండు సార్లు అధికంగా పనిచేయుట మంచిది. వారం ఆరంభంలో ఉన్న ఉత్సాహం చివరి వరకు కొనసాగకపోవచ్చును. తడబాటు ఉంటుంది. బద్ధకం పెరుగుటకు అవకాశాలు కలవు. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి జాగ్రత్త వహించుట మేలు. కుటుంబంలో సర్దుకోకపోతే కలహములు కలుగుటకు అవకాశాలు ఉన్నవి జాగ్రత్త. ఉద్యోగంలో కూడా నిదానంగా వ్యవహరించుట అందరిని కలుపుకొని వెళ్ళుట మేలు. శ్రమను అలాగే పనిభారంను కలిగి ఉంటారు. ఓపికను కలిగి ఉండి అలాగే పనిచేయుట మూలాన నిదానంగా ఫలితాలు కలుగుటకు అవకాశం కలదు. అంటే ఆలస్యంగా ఫలితాలు కలుగుటకు ఆస్కారం కలదు. మీరు ఊహించని వార్తలను వినుటకు అవకాశం కలదు. భాదపడే వార్తను వింటారు. సరైన సమయానికి భోజనం చేయుటలో విఫలం అవుతారు. మీ ప్రవర్తన కొంత అనుమానించేదిగా ఉండుటకు అవకాశం కలదు. అధికారులతో ఇబ్బందులను పొందుటకు అవకాశం కలదు. వారికి అనుగుణంగా నడుచుకొనుట సూచన. విందులు వినొదములలొ పాల్గొనే అవకాశం కలదు. ఖర్చును పొందుతారు. సేవకావృత్తిలో రాణిస్తారు కలహములు కలుగుటకు అవకాశం కలదు. నిదానంగా ఉండుట మంచిది. ఇబ్బందులు తొలగుటకు నవగ్రహప్రదక్షణ, దక్షిణామూర్తిని ఆరాధించుట చేయండి. అలాగే ప్రతిరోజు లలితాసహస్రనామం పారాయణ మంచిది.       

ధనస్సు రాశి
ఈవారం మంచిఫలితాలు కలుగుటకు అవకాశం కలదు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. నూతన ప్రయత్నాలు అనుకూలిస్తాయి తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్దిని కలిగి ఉంటారు. ధనలాభంను కలిగి ఉంటారు. వారం ఆరంభం లో ఉత్సాహంను కలిగి ఉండి ముందుకు వెళ్తారు. ఇతరులకు సేవచేయుట మూలాన పేరును కలిగి ఉంటారు. కుటుంబ జీవితంలో సౌఖ్యంను కలిగి ఉంటారు. సరదాగా గడుపుతారు. వ్యాపారస్థులకు అనుకూలమైన సమయంగా భావించ వచ్చును. అందరిని కలుపుకొని వెళ్ళుట మూలాన పనులు జరుగుతాయి. మీ ఆలోచనలు అందరికి ఉపయోగపడే ఆలోచనలు చేయుట వలన కీర్తిని కలిగి ఉంటారు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండుట మంచిది. అశ్రద్ద చేయకండి. ఇతరులు మిమ్మలి ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేస్తారు జాగ్రత్త. నూతన వస్త్రప్రాప్తిని కలిగి ఉంటారు. సంతోషంగా గడుపుటకు అవకాశాలు కలవు. అధికారులతో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి సర్దుకుపొండి. చిన్న చిన్న సమస్యలు కలిగినను నిదానంగా వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్ళుటకు అవకాశం కలదు. రాజకీయ వ్యవహరలయందు ఆసక్తిని కలిగి ఉంటారు. నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం కలదు. కోపంను కలిగి ఉండే అవకాశం ఉంది అదుపులో ఉంచుకొనుట మేలు. మరిన్ని ఫలితాల కోసం విష్ణుసహస్రనామం చదువుట అలాగే వేంకటేశ్వర ఆరాధన మంచిది. 

మకర రాశి
ఈవారం మిశ్రమ ఫలితాలు కలిగి పొందుతారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును కలిగి ఉండుట వలన సమస్యలు కలుగుతాయి. బంధుమిత్రులతో చేయుపనులలో నిదానంగా వ్యవహరించుట అలాగే జాగ్రత్తగా ఉండుట చేత అకారణంగా ఏర్పడు ఖర్చులను తగ్గించుకొనుటకు అవకాశం కలదు. వారం ఆరంభంలో నచ్చని వార్తను వినుటచేత నిరుత్సాహంను పొందుతారు. వారం మధ్యలో ఇతరుల సహకారంతో పనులలో ముందుకు వెళ్తారు. ధనలాభంను కలిగి ఉంటారు. కుటుంబంలో అందరిని సంప్రదించి నూతన నిర్ణయాలను తీసుకొని ముందుకు వెళ్తారు. అందిరికి ఉపయోగపడే ఆలోచనలు కలిగి ఉంటారు. స్త్రీ / పురుష సౌఖ్యంను కలిగి ఉంటారు. పెద్దల సహకారంతో ముందుకు వెళ్తే ప్రయత్నాలలో ముందుకు వెళ్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది సంతృప్తిని కలిగి ఉంటారు. పనిభారంను కలిగి ఉండుట చేత సమయానికి భోజనం చేయలేరు. వినొదములలొ పాల్గొనుటకు ఉత్సాహంను చూపిస్తారు చిననాటి మిత్రులు కలిసే అవకాశం ఉంది. ప్రమాదకరమైన వస్తువులతో పనిచేయునప్పుడు జాగ్రత్తగా ఉండుట సూచన. ప్రమాదాలు సంభవించుటకు అవకాశం కలదు. తగిన జాగ్రత్తలు చేపట్టుట మేలు. కుటుంభంలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది. సర్దుకుపోవడం వలన కలహములు తగ్గుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆలోచనలు అమలు చేయుట అలాగే అందరిని కలుపుకొని వెళ్ళుట మంచిది. మంచి ఫలితాల కోసం ఆదిత్యహృదయం పారాయణ చేయండి,ప్రతిరోజు లక్ష్మీఅష్టోత్తరం చదువుట అలాగే దుర్గాదేవికి కుంకుమ అర్చన చేయండి. 

కుంభ రాశి
ఈవారం కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది. కుటుంబంలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం కలదు. కావున కొన్ని విషయల్లో మీరు రాజీపడుట మంచిది. నూతన ప్రయత్నాలు చేయకండి గతంలో ప్రారంభించిన పనులలో చిన్న చిన్న మార్పులు చేసుకొనుట ద్వార పనులు ముందుకు సాగుతాయి. మానసికంగా కొంత ఆలోచనలు పెరుగుటకు అవకాశం కలదు. ప్రయత్నకార్యములలో ఆటంకాలు కలుగుటకు ఆస్కారం కలదు. కావున బాగా ఆలొచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. అనారోగ్య సమస్యలు కలుగుటకు అవకాశం కలదు. నూతన ప్రయత్నాలు వాయదా వేసుకోండి. వారం చివర్లో కొంత మేర మీరు ఆశించిన ఫలితాలు కలుగుటకు అవకాశం కలదు. కుటుంబంలో మీకు అనుకూలమైన మార్పులు కలుగుతాయి. సేవాగుణాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహయపడుతారు. బంధుమిత్రులతో సత్సంబందాలు ఉండకపోవచ్చును. శ్రమను కలిగి ఉండుటకు అవకాశం కలదు. అకారణంగా కలహములు కలుగుటకు అవకాశం కలదు. నిదానంగా వ్యవహరించుట మేలు. ఉద్యోగస్థానంలో మంచి పేరును కలిగి ఉంటారు నూతన ఆలోచనలు అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన పనులను చేపడుతారు. మృష్టాన్నభోజన ప్రాప్తిని కలిగి ఉంటారు. సేవకుల వలన లాభంను పొందుటకు అవకాశాలు కలవు. చేయుపనిలో శ్రమను కలిగి ఉంటారు. మంచి ఫలితాల కోసం శివపార్వతులను ఆరాదించుట మంచిది. లక్ష్మీనరసింహా స్వామికి అభిషేకం చేయుట మూలాన ఫలితాలు పొందుతారు. 

మీన రాశి
ఈవారం మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఉత్సాహంను కలిగి ఉండి నూతన పనులను చేపడుతారు. సంతాన మూలక సౌఖ్యంను కలిగి ఉంటారు. ప్రయత్నాలలో విజయంను పొందుటకు అవకాశం కలదు. వారం ఆరంభంలో బాగుంటుంది జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన వాటియొక్క ఫలితాలు వారం మొత్తం కలుగుటకు అవకాశాలు కలవు. రాజకీయ వ్యవహారాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. లాభంను పొందుటకు అవకాశం కలదు. ఇష్టమైన పనులను చేపడుతారు వాటి మూలాన లాభంను పొందుతారు. మనోదైర్యంను కలిగి ఉండి పనులలో ముందుకు వెళ్తారు. బంధువులతో విరోధములు కలుగుటకు అవకాశం కలదు జాగ్రత్తగా ఉండుట సూచన. వారం చివర్లో పనులలో స్వల్ప ఇబ్బందులు కలుగుటకు అవకాశం కలదు. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండుట సూచన. ఆర్థికపరమైన విషయాల్లో ముందుకు వెళ్తారు ధనలాభంను కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి సమాలోచనలు చేయుట ద్వార పనులు ముందుకు సాగుతాయి కాకపోతే పనిఆరంభంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుట మంచిది. మాత్రుసంభంద వర్గం నుండి మీకు అనుకూలమైన వార్తలను వింటారు సంతోషాన్ని పొందుటకు అవకాశం కలదు. స్థిరమైన ఆలోచనలు చేయుట వలన లాభం ఉంటుంది. పెద్దల సలహాలను పాటించుట అలాగే ఓపికను కలిగి ఉండుట మేలుచేస్తుంది. మీ ఆలోచనలు గౌరవాన్ని కలిగించేవిగా ఉండుటకు అవకాశం ఉంది. పెద్దలతో పరిచయాలు కలుగుతాయి. వాటి మూలాన లాభంను కలిగి ఉంటారు. అకారణంగా భయంను పొందుతారు జాగ్రత్తగా ప్రణాలికా ప్రకారం వెళ్ళండి. ఉత్తమ ఫలితాల కోసం శివాభిషేకం చేయండి, దుర్గాదేవికి అర్చన చేయండి ప్రతిరోజు సూర్యనమస్కారం చేయుట వలన ఫలితాలు కలుగుతాయి.