చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా! - సిరాశ్రీ

cheyyathi jai kuttu telugoda
తెలుగు వారి పండుగ ఉగాది వచ్చి వారం తిరక్కుండానే పాతికేళ్ల తర్వాత ఒక తెలుగు రచయితని జ్ఞానపీఠ పురస్కారం వరించిందన్న వార్త వినిపించింది. ఈ అత్యుత్తమ సాహితీ పురస్కారాన్ని తెలుగు గడ్డను తీసుకొచ్చిన మూడవ రచయిత శ్రీ రావూరి. ఇది తెలుగు వారందరూ గర్వించాల్సిన తరుణం.

విశ్వనాథ సత్యనారాయణ వ్రాసిన రామాయణ కల్పవృక్షం, వేయి పడగలు; డాక్టర్ సి నారాయణ రెడ్డి వ్రాసిన విశ్వంభర సరసన శ్రీ రావూరి భరద్వాజ పాకుడు రాళ్ళు కూడా చేరిందిప్పుడు. సినీ పరిశ్రమలో ఉండే వారి అంతరంగావిష్కరణ ఈ పాకుడు రాళ్ళు ప్రధాన ఇతివృత్తం. 
దాదాపు 37 కథలు, 17 నవలలు వ్రాసిన రావూరి పలు నాటకాలు, రేడియో నాటికలు కూడా వ్రాసారు. బాల సాహిత్యానికి చెప్పుకోదగ్గ కృషి చేసిన వారిలో రావూరి ఒకరు.

ఆనాటి వారికి మాత్రమే తెలిసిన 86 యేళ్ళ రావూరి భరద్వాజ ఈనాటి తరం వారికి జ్ఞానపీఠ కారణంగా తెలిశారనడం నిజం. తెలుగు వారికి జ్ఞానపీఠ ఘనతని ఆర్జించిన రావూరి రచనలు చాలా వరకు అలభ్యాలుగానే ఉన్నాయి. ఈ వంకన త్వరలో పుస్తక విక్రయ శాలల్లో రావూరి రచనల తాకిడి మొదలవుతుందని వేరే చెప్పక్కర్లేదు.

జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత శ్రీ రావూరి భరధ్వాజ కు గోతెలుగు.కామ్ హార్దికాభినందనలు తెలియజేస్తోంది. 

మరిన్ని వ్యాసాలు

సంక్రాతి ఎలా వచ్చిందంటే
సంక్రాతి ఎలా వచ్చిందంటే
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
దేవదాసి .
దేవదాసి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Dwiteeyam ane rendava staanam
ద్వితీయం అనే రెండవ స్థానం
- కందుల నాగేశ్వరరావు
నయనాల నీలాలలో....
నయనాల నీలాలలో....
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.