చారు, కూర, బూరె, గారె - సిరాశ్రీ

charu, koora, boore, gaare
నేడు శ్రీరామనవమి. పానకాలు తాగడం, సీతారామకళ్యాణ భోజనాలు చేయడం మామూలే. భోజనాల్లో "చారు", "కూర", "బూరె", "గారె" వంటివి సహజమే. అందుకే ఆ నాలుగు పదాలను ఆ అర్థంలో కాకుండా వేరే అర్థంలో వాడుతూ, శ్రీరాముడిని ఉద్దేశిస్తూ సరదాగా సినీకవి సిరాశ్రీ చెప్పిన పద్యం  గోతెలుగు పాఠకులకు అందిస్తున్నాం.

'చారు' దరహాస! రఘురామ! సత్య సదన!
భక్తి 'కూర'గ నినుకొల్చి పరగినంత 
భూరి సౌశీల్య సద్గుణం'బూరె'ననగ 
చక్కని నడత కొత్త'గారె'క్క విప్పె    

అర్థాలు:
చారు: అందమైన, దరహాస= చిరునవ్వుగల, రఘురామ! సత్యసదన= సత్యానికి నిలయమైన ఓ రఘురామా!
భక్తి కూరగ: భక్తి కలుగగా, నినుకొల్చి పరగినంత= నిన్ను ప్రార్ధించి వర్ధిల్లగా  భూరి సౌశీల్యము: నిండైనా మంచితనము ,
సద్గుణంబు+ఊరె= సద్గుణంబూరె ననగ= మంచి గుణములు పుట్టగా చక్కని నడత కొత్తగా రెక్క విప్పె: మంచి నడవడి రెక్కలు విప్పుతుంది.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్