లేపాక్షి (పర్యాటకం) - లాస్య రామకృష్ణ

Lepakshi

హిందూపూర్ నుండి 15 కిలోమీటర్లు అలాగే కర్ణాటక లో ని బెంగుళూరు నుండి 120 కిలోమీటర్ల దూరం లో ఉన్న అందమైన కుగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి.

శివుడు, విష్ణువు మరియు వీరభద్రుడికి అంకితమివ్వబడిన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. విజయనగర నిర్మాణ శైలిని తలపించేటట్టు వీరన్న మరియు విరుపన్నలన్నబడే అన్నదమ్మ్ములు  నిర్మించబడిన వీరబద్రుని ఆలయం ఈ ప్రాంతం లో ని ప్రధాన ఆకర్షణ. ప్రాచీన నిర్మాణాలను ఇష్టపడే వాళ్ళకు ఈ ఆలయం అనువైన ప్రదేశం. విజయ నగర చక్రవర్తుల కాలానికి సంబంధించిన కళాకారుల యొక్క శిల్ప కళా నైపుణ్యానికి ఈ ఆలయం ఓక నిదర్శనం. ఇక్కడ గోడలపై శతాబ్దాల క్రితానికి చెందిన శాసనాలను కన్నడ బాషలో ఇక్కడ గమనించవచ్చు. ఏక నల్ల రాతి శిలతో నిర్మించిన పెద్దదైన నంది లేపాక్షి యొక్క  ప్రత్యేకత. ప్రసిద్దమైన లేపాక్షి చీరల డిజైన్ లు కూడా ఈ ఆలయ గోడలపై ఉన్న చెక్కడాల ద్వారా ప్రభావితమయ్యాయన్నది ఆసక్తికరమైన అంశం.

విశ్వకర్మ బ్రాహ్మణుల యొక్క ప్రతిభా పాటవాలు లేపాక్షి లో ని ఆలయ నిర్మాణాలలో కనిపిస్తాయి. విశ్వకర్మ అమరశిల్పి జక్కన్న ఈ ఆలయాల నిర్మాణాలలో పాలు పంచుకున్నాడని అంటారు.

లేపాక్షి కి సమీపం లో ఉన్న కుర్మా శైల (తాబేలు ఆకారం లో ఉండే పర్వతం) పై అనేక ఆలయాలు కలవు. రఘునాథ, శ్రీరామ, పాపనాధేస్వర మరియు దుర్గా దేవి ఆలయాలు ఈ పర్వతం పై కలవు. మహాభారత, రామాయణాల్లో ని ముఖ్యమైన సంఘటనలను వర్ణిస్తున్న చిత్రలేఖనాలు ఈ ఆలయాల గోడలపై గమనించవచ్చు. అమరశిల్పి జక్కన యొక్క రక్తపు మరకలు ఇక్కడి ఆలయ గోడలకు గమనించవచ్చు. రాజు తో వచ్చిన అభిప్రాయ బేధం వల్ల కళ్ళు తీసివేయాలని రాజు ఆజ్ఞాపించగా అమర శిల్పి జక్కనే స్వయంగా తన కళ్ళని తీసి గోడపై కి విసిరేస్తాడు.

ఎలా చేరాలి?

బస్సు మార్గం
బెంగుళూరు-హైదరాబాద్ రహదారిలో ఉన్న లేపాక్షి రాష్ట్ర ప్రభుత్వ బస్సులు మరియు ప్రైవేటు రవాణా వ్యవస్థ ల ద్వారా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ మరియు రాష్ట్రం లో ని ఇతర ప్రధాన నగరాలన్నింటికి చక్కగా అనుసంధానమై ఉంది.

రైలు మార్గం
లేపాక్షి కి సమీపం లో ఉన్న రైల్వే స్టేషన్ హిందూపూర్ రైల్వే స్టేషన్. దేశం లో ని  అలాగే  రాష్ట్రం లో ని ఇతర ప్రధాన నగరాలకు మరియు పట్టణాలకు ఈ రైల్వే స్టేషన్ చక్కగా అనుసంధానమై ఉంది.

వాయు మార్గం
లేపాక్షి నుండి 100 కిలోమీటర్ల దూరం లో ఉన్న బెంగుళూరు విమానాశ్రయం లేపాక్షి నగరానికి సమీపం లో ఉన్న విమానాశ్రయం. దేశీయ, అంతర్జాతీయ విమానాల ద్వారా ఈ విమానాశ్రయం దేశం లో ని వివిధ ప్రాంతాలకి అలాగే వివిధ దేశాలకి చక్కగా అనుసంధానమై ఉంది.

సందర్శించేందుకు ఉత్తమ సమయం
అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు లేపాక్షి ని సందర్శించేందుకు ఉత్తమ సమయం. ఈ మాసాల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడమే కాకుండా ప్రయాణానికి, ప్రాంతాల సందర్శనకి అనువుగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం వల్ల ఈ మాసాల్లో దక్షిణ భారత దేశ పర్యటన ని ఎంతో మంది పర్యాటకులు ప్రాధాన్యమిస్తారు. సాయంత్రం ఇంకా రాత్రి వేళల్లో చలి తట్టుకునేందుకు ఒక స్వెట్టర్ ని మీతో సదా ఉంచుకోవడం ఉత్తమం.