సిరాశ్రీ ప్రశ్న - సిరాశ్రీ

1. శివరాత్రి ఉపవాసం కఠినంగా చెయ్యాలి. ఎంత కచ్చితంగా చేస్తే అంత శివకటాక్షం సిద్ధిస్తుంది.

అంతే కానీ ఉపవాసం పేరుతో పళ్లు, పాలు తాగితే అది ఉపవాసం అనిపించుకోదు. 
 
2. అసలు ఉపవాసం అంటే "దగ్గరగా ఉండడం" అని అర్థం. అంతే కానీ తిండి మానేయమని కాదు.
శివుడు తిండి మానేసినంత మాత్రాన కటాక్షించే అంత అమాయికుడేం కాదు.
తిండి మీద ధ్యాస లేకుండా తన మీదే ధ్యానం చేసే భక్తుల కోసం చూస్తుంటాడు.
బలవంతంగా ఆకలిని భరిస్తూ అది ఉపవాసం అనుకుంటే పొరపాటు.
శివరాత్రికి మత్తు, నిద్ర వచ్చే తామసాహారం కాకుండా చైతన్యాన్ని ఇచ్చి,
దేహాన్ని బద్దకం నుంచి దూరంగా ఉంచే పళ్ళు వంటివి సేవిస్తే మంచిదే. 
 
పై రెండిట్లో ఏది కరెక్ట్?
 

ఇది బేతాళ ప్రశ్న కాదు. బేతాళ ప్రశ్నల గురించి విక్రమార్కుడి కథల్లో విన్నాం. బేతాళుడు అడిగే ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పకపోతే తల వేయి చెక్కలవుతుందట.

ఇక్కడ అడిగే ప్రశ్నలకి సమాధానం ఏది సరైనదో అడిగే  బేతాళుడికే తెలియదు. కనుక ఎవరి తలా చెక్కలవ్వదు. కనుక సరదాగా ఆలోచించి తోచిన సమాధానం చెప్పొచ్చు. ఇది కేవలం ఆలోచనా పరిధిని పెంచే సరదా ఆట అనుకోండి అంతే !

మీ సమాధానాల్ని కామెంట్స్ రూపం లో తెలియజేయండి. నలుగురి ఆలోచనల రాపిడి లోంచే జ్ఞానం పుడుతుంది.  

మరిన్ని వ్యాసాలు

దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు