కాళింది లో గోవిందం - ఓలేటి శ్రీనివాసభాను

kalindilo govindam
ఆడింది ఆడింది పాదం
కాళింది లో గోవిందం
మున్నీట సర్పం - మూడింది దర్పం ...
మిన్నూ-  మన్నూ ఏకం...
ఊగింది లోకం!   ఆడింది .... ఆడింది పాదం ...

గాలీ-నీరూ కాలకూటంగా
వ్రేపల్లె కే సంకటంగా
ఘోరంగా- ప్రాణం పోవంగా
"రంగా.. రంగా" యన్న ఆలకించంగా!  ఆడింది... ఆడింది పాదం...

పడగెత్తి నాగన్న లేవంగా
బుసకొట్టి కోరలు తెరువంగా
వాటంగా- వాలం సాయంగా
నిలువెల్ల మదమంత - నీటను కలువంగ!  ఆడింది ... ఆడింది పాదం

నేత్రం- జలజాతపత్రం
గాత్రం-ఎంతో పవిత్రం
శిఖిపింఛ మౌళి - శ్రీ  బాల శౌరి
చిందులేసిన తీరు చిత్రాతి చిత్రం!  ఆడింది .. ఆడింది పాదం...
 

మరిన్ని వ్యాసాలు

Dravyolbanam
ద్రవ్యోల్బణం
- రవిశంకర్ అవధానం
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల వారి గానాలు.
సాలూరి వారి సారధ్యంలో ఘంటసాల
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నృత్య గీతాలు.
సిని నృత్య గీతాలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Indriya nigraham
ఇంద్రియ నిగ్రహం
- సి.హెచ్.ప్రతాప్
Vediya Bhajanam
వేదీయ భోజనం
- రవిశంకర్ అవధానం