కాస్మోటిక్స్ ఉపయోగిస్తున్నప్పుడు తీసుకోవల్సిన కంటి జాగ్రత్తలు - ..

(Eye Care While Using Cosmetics)

కళ్లు అనేవి పలు మనోభావాలను వ్యక్తపరిచే శరీరంలోని అతి ముఖ్యమైన భాగం. కంటి కోసం ఉపయోగించే కాస్మోటిక్స్ వాటిని ఆకర్షణీయంగా చేస్తాయి. కాని, కాస్మోటిక్స్‌ను సరైన రీతిలో ఉపయోగించని పక్షంలో అవి కంటికి హాని కలిగించవచ్చు.

కనుక కాస్మోటిక్స్ ఉపయోగిస్తున్న సమయంలో మీ కంటి సంరక్షణ కోసం చేయాల్సిన మరియు చేయకూడని అంశాలను ఇక్కడ తెలుసుకోండి.

1) కాస్మోటిక్ ఉత్పత్తులపై అన్ని వివరాలు తప్పక పేర్కొనబడాలి

కంటి కాస్మోటిక్స్‌పై దానిలో ఉపయోగించిన అన్ని అంశాలు మరియు వర్ణ సంకలనాత్మక పదార్ధాల పేర్లు, తయారీ తేదీ మరియు గడువు తేదీని తప్పక పేర్కొనాలి. మీరు వాటి ఆమోదాన్ని నిర్ధారించడానికి ఏఫ్‌డిఏ (ఆహార మరియు ఔషధ నిర్వహణ) యొక్క ఆమోదిత వర్ణ సంకలనాత్మక పదార్ధాల జాబితాతోని అంశాలను ఉత్పత్తిలో ఉపయోగించిన పదార్ధాలతో సరిపోల్చవచ్చు.

2) కనుబొమ్మలు 

కనురెప్ప వెంట్రుకలు మరియు కనుబొమ్మల శాశ్వత డైయింగ్ లేదా టింటింగ్‌ను అందిస్తుందని పేర్కొన్న ఉత్పత్తుల గురించి జాగ్రత్త వహించండి, ఎందుకంటే అవి కళ్లకు హాని చేయవచ్చు. నేటి వరకు, ఎఫ్‌డిఎ కనురెప్ప వెంట్రుకలు మరియు కనుబొమ్మల శాశ్వత డైయింగ్ కోసం ఎలాంటి వర్ణ సంకలనాత్మక పదార్ధాలను ఆమోదించలేదు.

3) కనురెప్ప వెంట్రుకలు

కాస్మోటిక్స్ కోసం ఉపయోగించే కనురెప్ప వెంట్రుకల పొడిగింపులు, కృత్రిమ కనురెప్ప వెంట్రుకలు మరియు అంటుకునే పదార్థాలు తప్పక రక్షణ అవసరాలకు మరియు వాటిపై పేర్కొన్న లేబుల్‌లకు అనుకూలంగా ఉండాలి. యు.ఎస్. ఆహార మరియు ఔషధ నిర్వహణచే కాస్మోటిక్స్‌లో ఉపయోగించగల ఆమోదిత వర్ణ సంకలనాత్మక పదార్ధాల జాబితాను చూడవచ్చు, దీనిలో విభిన్న రకాల కాస్మోటిక్స్‌ల్లో ఉపయోగించే వర్ణ సంకలనాత్మక పదార్ధాలు గురించి క్లుప్త వివరణలు పేర్కొనబడ్డాయి.

4) కనురెప్పలు 

కనురెప్పలు చాలా సున్నిహితంగా ఉంటాయి కనుక, అలెర్జిక్ ప్రతిక్రియ లేదా ప్రకోపనం వలన ఈ ప్రాంతంలో గాయం కావచ్చు. కనుక, కాస్మోటిక్స్‌లో ఉపయోగించిన అంటుకునే పదార్థాలు వలన ఎలాంటి అలెర్జిక్ ప్రతిక్రియలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోండి.

5) చేయవల్సినవి మరియు చేయకూడనవి 

దుమ్ము మరియు తేమ వలన ఉత్పత్తులు కలుషితం కావచ్చు మరియు ఇన్ఫెక్షన్‌లకు దారి తీయవచ్చు. కనుక, మీ కంటి కాస్మోటిక్స్‌ను జాగ్రత్తగా పొడి మరియు శుభ్రమైన ప్రాంతంలో నిల్వ చేయాలి.

మీ చేతులను శుభ్రంగా కడుక్కుని, కంటి మేకప్ ఉపయోగించడానికి ముందు వాటిని పూర్తిగా ఆరబెట్టుకోవాలి. మనం సాధారణంగా ఎల్లప్పుడూ ఎక్కువైన మేకప్ అంశాలను మన వేళ్లతో తుడిచి వేసే అవకాశం ఎక్కువ, దీని వలన ఇన్ఫెక్షన్ సోకవచ్చు.

కంటి కాస్మోటిక్స్‌లో ఉపయోగించిన అంశాల వలన మీ కాంటాక్ట్ లెన్స్‌లకు హాని కలిగే అవకాశం ఉన్నందున వాటిని ధరించడానికి ముందే కంటి మేకప్ పూర్తి చేయాలి.

అదే విధంగా, తొలగిస్తున్నప్పుడు, ముందుగా మీ కాంటాక్ట్ లెన్స్‌ను తీసివేసి, తర్వాత కంటి కాస్మోటిక్స్ తొలగించాలి.

మీ గోళ్లను తప్పక కత్తిరించుకోవాలి. కంటి మేకప్ సమయంలో చేతి గోళ్ల వలన మీ కళ్లకు గాయం కావచ్చు.

కంటి మేకప్ కళ్లకు భారంగా ఉండవచ్చు. దాని వలన మీ కళ్లపై ఒత్తిడి ఉండవచ్చు. కనుక, వారంలో ఒకటి లేదా రెండు రోజులపాటు మీ కళ్లకు ఎలాంటి కాస్మోటిక్స్ ఉపయోగించవద్దు మరియు వాటికి కొంత విశ్రాంతి ఇవ్వండి. మీ కళ్లను మృదువుగా మర్దనా చేయడం వలన వాటిపై ఒత్తిడి తగ్గుతుంది మరియు విశ్రాంతి కలుగుతుంది.

మీ కంటి కాస్మోటిక్స్‌ను మీ సహచరులతో పంచుకోవద్దు. ఒక వ్యక్తి యొక్క కంటి బ్యాక్టీరియా మరొక వ్యక్తి యొక్క కళ్లకు ఇన్ఫెక్షన్ సోకేలా చేయవచ్చు.

కంటి మేకప్ కోసం పదునైన పెన్సిల్‌లను ఉపయోగించవద్దు. కంటికి గాయాలు అయ్యే అవకాశాన్ని తగ్గించడానికి దానిని కొద్దిగా వంచి ఉపయోగించండి.

రిటైల్ దుకాణాల్లో ఇతరులు ఉపయోగించిన కంటి మేకప్ సామగ్రిని ఉపయోగించవద్దు. ఒకసారి ఉపయోగించగల వాటిని మాత్రమే అభ్యర్థించండి.

కళ్లకు ఇన్ఫెక్షన్ సోకినప్పుడు ఉపయోగించిన కాస్మోటిక్స్ మళ్లీ ఉపయోగించవద్దు. వాటికి బదులుగా కొత్త వాటిని ఉపయోగించండి.

మీ కంటికి చికాకు కల్పించే కంటి కాస్మోటిక్స్ ఉపయోగించవద్దు. అవి మీకు మంచివి కావు. మీ కళ్లకు సరిపోయే ఉత్పత్తిని తెలుసుకునేందుకు మీ వైద్యులను సంప్రదించండి.

కంటి మేకప్ ఉత్పత్తులను అత్యధిక లేదా తక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాల్లో నిల్వ చేయవద్దు, ఇలా చేయడం వలన అవి వాటి లక్షణాలను కోల్పోవచ్చు.

పెదాలు కోసం ఉపయోగించే లైనర్‌లను కంటి లైనర్‌లు వలె ఉపయోగించవద్దు. పెదాలు కోసం ఉపయోగించే లైనర్‌ల్లోని అంశాలు కంటి లైనర్‌ల్లో ఉపయోగించే వాటికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి.

వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు కంటి మేకప్ వేసుకోవడానికి లేదా తొలగించడానికి ప్రయత్నించవద్దు, దీని వల మీ కళ్లకు గాయం కావచ్చు.

మీ కంటి కాస్మోటిక్ ఆరిపోయిన సందర్భంలో మీ లాలాజలాన్ని ఉపయోగించవద్దు, ఎందుకంటే మీ నోటిలో ఉండే బ్యాక్టీరియా కంటి ఇన్ఫెక్షన్‌కు కారణం కావచ్చు.

తదుపరిసారి మీరు మీ కంటి మేకప్ వేసుకునే సమయంలో, ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోండి !!

మరిన్ని వ్యాసాలు

ఫతేపూర్ సిక్రి.
ఫతేపూర్ సిక్రి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Taj Mahal - Wonders of the world
తాజ్ మహల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
మొధెరా సూర్య దేవాలయం.
మొధెరా సూర్య దేవాలయం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
హవామెహల్ .
హవామెహల్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Cine geethala rachayitrulu
సినీ గీతాల రచయిత్రులు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు